ETV Bharat / state

పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష విరమణ - శ్రీవారి ఆలయంలో వారాహి డిక్లరేషన్ బుక్‌ - Pawan Kalyan Tirumala Tour

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Pawan Kalyan Tirumala Tour : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. వారాహి డిక్లరేషన్ బుక్‌తో ఆలయం వెలుపలకు పవన్‌ వచ్చారు. శ్రీవారి దర్శనానికి ముందు చిన్న కుమార్తె పొలెనా అంజన తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్‌ ఇచ్చారు. ఇవాళ రాత్రికి తిరుమలలోనే బస చేయనున్న డిప్యూటీ సీఎం, రేపు తిరుపతిలో నిర్వహించే వారాహి సభలో పాల్గొంటారు.

Pawan Kalyan Prayaschitta Deeksha Conclude
Pawan Kalyan Tirumala Tour (ETV Bharat)

Pawan Kalyan Prayaschitta Deeksha Conclude : తిరుమల లడ్డూ కల్తీ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ గత నెల 22న ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. 11 రోజుల పాటు దీక్షను కొనసాగించారు. అందులో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. గొల్ల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు.

వారాహి డిక్లరేషన్ బుక్‌తో పవన్ : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు పవన్‌ కల్యాణ్‌కు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత ఆయన తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్లి పరిశీలించారు. కుమార్తెలు ఆద్య, పొలెనా అంజన, దర్శకుడు త్రివిక్రమ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌సాయితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. వారాహి డిక్లరేషన్ బుక్‌తో ఆలయం వెలుపలకు పవన్‌ వచ్చారు. చేతిలో ఎర్ర పుస్తకం ఉండటంతో ఆసక్తిగా భక్తులు గమనించారు. కాలినడక సమయంలో తన వెంట ఉంచుకున్న డిక్లరేషన్‌ పుస్తకాన్ని స్వామివారి దర్శనానికి వెళ్లినప్పుడు తీసుకెళ్లారు.

పవన్‌కల్యాణ్‌ చిన్న కుమార్తె పొలెనా అంజన డిక్లరేషన్‌ : పవన్‌కల్యాణ్‌ తిరుమల శ్రీవారి దర్శనానికి ముందు చిన్న కుమార్తె పొలెనా అంజనా స్వామివారి దర్శనానికి డిక్లరేషన్‌ ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్‌ పత్రాలపై సంతకాలు చేశారు. పొలెనా మైనర్‌ కావడంతో ఆమె తరఫున తండ్రిగా పవన్‌కల్యాణ్‌ కూడా ఆయా పత్రాలపై సంతకాలు పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ ఎక్స్​లో పోస్ట్‌ చేసింది. ఇవాళ రాత్రికి తిరుమలలోనే బస చేయనున్న డిప్యూటీ సీఎం, రేపు సాయంత్రం నాలుగున్నర గంటలకు తిరుమల నుంచి తిరుపతికి చేరుకుంటారు. రేపు ఐదున్నరకు జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నిర్వహించే వారాహి సభలో పాల్గొంటారు.

Pawan Kalyan Tirumala Tour
శ్రీవారి ఆలయంలో వారాహి డిక్లరేషన్ బుక్‌ (ETV Bharat)

తిరుమలలో చిరుతల నుంచి రక్షణ : రేణిగుంట విమానాశ్రయం నుంచి మంగళవారం సాయంత్రం తిరుపతి చేరుకున్న పవన్ కల్యాణ్, అలిపిరి మెట్లమార్గం నుంచి కాలినడకన రాత్రి తిరుమలకు వచ్చారు. కాలిబాట గుండా బయలుదేరిన పవన్‌కళ్యాణ్ వెంట భారీగా అభిమానులు తరలివచ్చారు. మార్గమధ్యలో భక్తులతో మాట్లాడుతూ అక్కడక్కడ సేదా తీరారు. గత సంవత్సరం చిరుత దాడిలో మృతి చెందిన లక్షిత, చిరుత దాడిలో గాయపడిన కౌశిక్ వివరాలను ఏడో మైలు వద్ద అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిరుతల నుంచి రక్షణకు అటవీశాఖ చేపట్టిన చర్యలను అధికారులు పవన్‌కు వివరించారు. రాత్రి గాయత్రి నిలయం అతిథి గృహానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.

శ్రీవారి ఆస్తులను పరిరక్షించాల్సింది పోయి పప్పుబెల్లాల్లా అమ్మేస్తారా? : ఏపీ డిప్యూటీ సీఎం - Pawan Kalyan on TTD Properties

'తప్పులు చేసిన వారిని ఆయన ఎలా సమర్థిస్తారు?' : జగన్‌పై పవన్‌ కల్యాణ్ ఫైర్ - AP Deputy CM Pawankalyan Deeksha

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.