Deputy CM Pawan Kalyan Reaction On Allu Arjun Arrest : అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై దాడి (Attack on MPDO Jawahar Babu) జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించి దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. అనంతరం ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. బాధ్యులను వదిలిపెట్టమని హెచ్చిరికలు జారీ చేశారు. ఈ తరుణంలో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై మీడియా ప్రతినిధులు అడగగా ఆయన స్పందించారు. సమస్యలు చాలా ఉన్నాయని, సినిమా అనేది చిన్న సమస్యని అన్నారు. బాధితుడి పరామర్శకు వచ్చినప్పుడు ఇలాంటివి మాట్లాడడం సరికాదని హితువు పలికారు.
భద్రత బాధ్యత పోలీసులదే : పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి వ్యవహారంపై కూడా పవన్ కల్యాణ్ స్పందించారు. నకిలీ ఐపీఎస్ ఎలా వచ్చాడనేది ఉన్నతాధికారులు చూసుకోవాలని, ఆ బాధ్యత ఇంటెలిజెన్స్, డీజీపీ, హోంమంత్రిదేనని అన్నారు. తనకు పని చేయడం ఒక్కటే తెలుసని, తన భద్రత బాధ్యతలు చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు పెద్దలదేనని తెలిపారు. ఈ అంశంపై తన పేషీ అధికారులు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారని, ఈ విషయంపై తాను కూడా డీజీపీతో మాట్లాడతానని వివరించారు.
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ - విచారణ వాయిదా వేసిన కోర్టు
అభిమానులపై పవన్ అసహనం : ఇదిలా ఉండగా, పవన్ కల్యాణ్‌ని చూసేందుకు అక్కడికి వచ్చిన పలువురు ఆయన అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయన సీరియస్‌గా మీడియాతో మాట్లాడుతున్న సమయంలో 'ఓజీ ఓజీ ఓజీ' అంటూ స్లోగన్లు చేశారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్యం చేశారు. "ఏంటయ్యా మీరు. ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు. పక్కకు రండి" అంటూ వారిపై అసహనం వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వరుస మీటింగ్స్, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు, దర్శక, నిర్మాతలకు ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే పట్టాలెక్కించిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. తన తదుపరి చిత్రాలు ఓజీ, హరిహర వీరమల్లు షూట్స్‌లో వీలు కుదిరినప్పుడు హాజరవుతున్నారు. సుజీత్ దర్శకత్వంలో పవన్ నటిస్తోన్న చిత్రమే ఓజీ. యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్‌గా ఇది సిద్ధం అవుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు.
'రేవతి చనిపోయిందని థియేటర్లో నాకు చెప్పలేదు' - భావోద్వేగానికి గురైన అల్లు అర్జున్