ETV Bharat / state

సచివాలయంలో చంద్రబాబుతో పవన్​ కల్యాణ్​ భేటీ - ఘనస్వాగతం పలికిన అమరావతి రైతులు - Pawan visited ap Secretariat

Deputy CM Pawan Kalyan met CM Chandrababu at Secretariat in AP: సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో మర్యాద పూర్వకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ కు ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు.

Deputy CM Pawan Kalyan met CM Chandrababu at Secretariat in AP
Deputy CM Pawan Kalyan met CM Chandrababu at Secretariat in AP (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 18, 2024, 5:40 PM IST

Deputy CM Pawan Kalyan met CM Chandrababu at Secretariat in AP : ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్​ మర్యాదపూర్వకంగా కలిశారు. రెండో బ్లాక్​లో తన ఛాంబర్ ను పరిశీలించిన అనంతరం పవన్ సచివాలయం మొదటి బ్లాక్​కు వెళ్లి చంద్రబాబుతో భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్​కు సీఎం సాదరంగా స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సచివాలయంలో తన ఛాంబర్​కు వచ్చిన పవన్ కల్యాణ్​ను సీఎం చంద్రబాబు ఆలింగనం చేసుకున్నారు. ఆయనతో పాటు సీఎంను మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్​ కలిశారు.

సీఎం ఛాంబర్​లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక చిహ్నం చూపించి మీరు ఆ గుర్తుకు హూందాతనం తెచ్చారని పవన్ కల్యాణ్​ వ్యాఖ్యానించారు. పవన్ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు తరవాత తొలి భేటీలో పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. మంత్రివర్గ భేటీ ఏర్పాటు, అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై వీరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. అదేవిధంగా గురువారం(రేపు) ఉదయం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్​ బాధ్యతలు తీసుకోనున్నారు.

నీటి పారుదల శాఖ అతిథి గృహం డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయం : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు విజయవాడలోని నీటిపారుదలశాఖ అతిథి గృహాన్ని క్యాంపు కార్యాలయంగా కేటాయించే అవకాశం ఉంది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ- శాస్త్ర సాంకేతిక మంత్రిగా గురువారం సచివాలయంలో పవన్​ కల్యాణ్​ బాధ్యతలు స్వీకరించనున్నారు.

హైదరాబాద్​ నుంచి ఇవాళ ఉదయం విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా విజయవాడలోని ఇరిగేషన్‌ గెస్ట్‌హౌస్‌కు వెళ్లారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఆ శాఖ కమిషనర్ కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు పవన్‌కల్యాణ్‌కు సాదర స్వాగతం పలికారు. అనంతరం అతిథి గృహాన్ని పవన్ కల్యాణ్​ నిశితంగా పరిశీలించారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కూడా పవన్‌ వెంట ఉన్నారు. రెండు అంతస్తుల ఈ అతిథి గృహంలో పై అంతస్తులో నివాసం, దిగువ అంతస్తులో కార్యాలయం ఏర్పాటుపై చర్చించారు.

పక్కనే సమావేశ మందిరం కూడా అందుబాటులో ఉండడంతో పవన్‌కల్యాణ్‌ గెస్ట్‌హౌస్‌ను తన క్యాంపు కార్యాలయంగా వినియోగించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ గెస్టుహౌస్‌లో కొన్ని మార్పులను పవన్‌ సూచించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ క్యాంపు కార్యాలయాన్ని అప్పటి జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు వినియోగించారు. వైసీపీ ప్రభుత్వంలో బొత్స సత్యనారాయణ కొంత భాగాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించగా, మరికొంత జలవనరుల శాఖ కార్యాలయంగా ఉంది.

ఇప్పుడు మొత్తం కార్యాలయాన్ని పవన్ కల్యాణ్​ తన క్యాంపు కార్యాలయంగా వినియోగించనున్నారు. సూచనప్రాయంగా పవన్ కల్యాణ్‌ ఈ అతిథి గృహానికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. లేదంటే మరో భవనాన్ని అధికారులు పరిశీలిస్తారు. ఇప్పటికే పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ భవనాన్ని పరిశీలించి బాగుందని చెప్పారు. అతిథి గృహం పరిశీలన అనంతరం పవన్‌కల్యాణ్‌ నేరుగా జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు.

డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలికిన అమరావతి రైతులు : అమరావతిలో అడుగుపెట్టిన ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు అపూర్వ స్వాగతం లభించింది. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత తొలిసారి రాజధానిలో అడుగు పెట్టిన జననానికి అమరావతి రైతులు, మహిళలు, అభిమానులు నీరాజనం పలికారు. వాహనం పైనుంచే వారందరికీ అభివాదం చేస్తూ పవన్‌కల్యాణ్‌ ముందుకు కదిలారు. రాజధాని అమరావతికి ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ కాకతో రాజధాని రైతులు ఘనస్వాగతం పలికారు. వెంకటపాలెం నుంచి మందడం వరకు పవన్‌తో పాటు వేల మంది రైతులు, మహిళలు, అభిమానలు స్వాగత ర్యాలీ చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద పవన్‌కు గజమాలతో అపూర్వ స్వాగతం పలికారు. దారిపొడువునా పవన్‌కు పూల వర్షం కురిపించారు. అందరికీ అభివాదం చేస్తూ జనసేనాని ముందుకు కదిలారు. కష్టకాలంలో తమకు ఎంతో అండగా నిలిచిన పవన్‌ కల్యాణ్‌కు పూలతో స్వాగతం పలకడంపై అమరావతి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పవన్​కు వదినమ్మ స్పెషల్ గిఫ్ట్​ - ఆ లిమిటెడ్ ఎడిషన్ పెన్ ధర తెలిస్తే షాకే! - Pawan Kalyan Pen

నేనే మీ వద్దకు వస్తా - త్వరలో జిల్లాల వారీగా పర్యటిస్తా : పవన్ కల్యాణ్ - Deputy CM Pawan Kalyan

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.