Pawan Kalyan Lays Foundation Stone for Roads Construction: గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలకు స్వస్తి పలికేందుకే రహదారుల నిర్మాణం చేపట్టామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం బల్లగరువులో పర్యటించిన పవన్ కల్యాణ్ రోడ్ల నిర్మాణానికి, పలు అభివద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గిరిజనులకు కష్టాల్లో తోడుగా ఉన్నామని చెప్పటానికే మన్యం జిల్లాలో పర్యటిస్తున్నానని పవన్ చెప్పారు. మెత్తం 100 కి.మీ మేర 120 రోడ్లకు పవన్ శంకుస్థాపన చేశారు. డోలీ మోతలు లేని రాష్ట్రం దిశగా ముందుకెళ్తున్నామని పవన్ కల్యాణ్ అన్నారు.
డోలీ మోయడం అత్యంత బాధాకరం: ఈ రోజుల్లో కూడా డోలీ కట్టి నలుగురు మోయడం అత్యంత బాధాకరమని పవన్ కల్యాణ్ అన్నారు. గిరిజన యువత తలచుకుంటే వాళ్ల జీవితాల్లో మార్పు వస్తుందని వ్యాఖ్యానించారు. 2000 గ్రామాలకు రోడ్లు లేవని దానికి రూ.2,849 కోట్లు అవుతుందని తెలిపారు. గిరిజన గ్రామాల రోడ్లకు ఏటా రూ.350 కోట్లు కేటాయిస్తామని మిగతా నిధులు కేంద్రం నుంచి తీసుకుని రోడ్లను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో కాఫీ, చిరుధాన్యాలు పండిస్తున్నారని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు ఉన్నాయని ఇలా నా దృష్టికి ఎన్ని సమస్యలు వచ్చినా సీఎం చంద్రబాబుకు వివరిస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
'ప్రజల ప్రాణాలు పోతుంటే ఊరుకోం' - సంధ్య థియేటర్ ఘటనపై రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
గంజాయి నివారణకు చేతులు కలపాలి: అనంతగిరిని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మార్చాలని పవన్ కల్యాణ్ అన్నారు.
'గంజాయి నివారణకు అందరూ చేతులు కలపాలి. గిరిజనుల ఇళ్లపట్టాలకు అటవీశాఖతో కలిసి అదాలత్ ఏర్పాటు చేస్తాం. నిబంధనలు సడలించి మరీ గిరిజన గ్రామాలకు రోడ్లు వేస్తున్నాం. గిరిజనులు సాగు చేసిన పంటలకు మార్కెటింగ్ కల్పిస్తాం. అల్లూరి జిల్లా పర్యాటకంగా అభివృద్ధి కావాలి. జీవో 3ను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తా.' -పవన్ కల్యాణ్, డిప్యూటీ ముఖ్యమంత్రి
గిరిజన యువత నైపుణ్యం బాగా పెంచుకుని లోపల ఉన్న సమర్థతను బయటకు తీయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టిందని, గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి పెంచుతామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 'స్వచ్ఛ సంకల్పం' పేరుతో ఓ పోస్టర్ను పవన్ కల్యాణ్ విడుదల చేశారు.
ఇది స్వర్గఫలం గురూ! ఒక్క పండు ధర 1500 - తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడే మొట్టమొదటి సారి సాగు
బియ్యం ఎగుమతుల్లో కాకినాడ 'కీ' పోర్టు - అంతర్జాతీయస్థాయిలో రేషన్ మాఫియా!