ETV Bharat / state

బొగ్గు గనిని సింగరేణికి దక్కేలా చూడాలి - అవసరమైతే ప్రధానితో​ మాట్లాడతాం : భట్టి - Sravanapalli Coal Mine Auction - SRAVANAPALLI COAL MINE AUCTION

Sravanapalli Coal Mine Auction : కేంద్రం శ్రావణపల్లి బొగ్గు గనిని సింగరేణికి దక్కేలా చూడాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. అవసరమైతే తాను, సీఎం రేవంత్​ రెడ్డి కలిసి ప్రధాని వద్దకు మాట్లాడేందుకు వస్తామన్నారు. ఈ క్రమంలో బొగ్గు గనులకు సంబంధించి కేంద్రమంత్రి కిషన్​రెడ్డికి వినతి పత్రం అందించారు. హైదరాబాద్​లో బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ప్రారంభించారు.

Sravanapalli Coal Mine Auction
Sravanapalli Coal Mine Auction (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 21, 2024, 2:22 PM IST

Deputy CM Bhatti Vikramarka Participate in the Sravanapalli Coal Mine Auction : రాష్ట్రం ముందుకు వెళ్లాలంటే విద్యుత్​, బొగ్గు అత్యంత అవసరమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యుత్​శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి తెలంగాణ కొంగు బంగారమని తెలిపారు. సింగరేణి బొగ్గుతోనే తెలంగాణ విద్యుత్​ ఉత్పత్తి సంస్థలు నడుస్తున్నాయని స్పష్టం చేశారు. సింగరేణికి కొత్త గనులను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో బొగ్గు గనులకు సంబంధించి కేంద్రమంత్రి కిషన్​రెడ్డికి వినతి పత్రం అందించారు. మొట్టమొదటసారి హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన బొగ్గు గనుల వేలం ప్రక్రియను తెలంగాణ రాష్ట్రం ఉపయోగించుకోవాలని పాల్గొన్నానంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు.

ఎన్​ఎండీఆర్​ యాక్టుకు ముందు ట్రైపాక్షిక ఒప్పందం ప్రకారం సింగరేణి సంస్థకే పూర్తి అధికారం ఉండేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు. కానీ 2015లో సవరించిన ఎన్​ఎండీఆర్​ ప్రకారం సింగరేణి తన హక్కును కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం 17(ఏ)2 ప్రకారం బొగ్గు గనులు కేటాయించాలని సింగరేణి కోరిందని పేర్కొన్నారు. సత్తుపల్లి 3, కొయ్యగూడెం 3 గనులు ఉన్నాయని చెప్పారు. వీటిని కేటాయిస్తే సింగరేణికి అనువుగా ఉంటుందని సూచించారు. వేలం పాట నిర్వహిస్తే ఇందులో పాల్గొని అయిన గత ప్రభుత్వం గనులను సాధించుకోవాల్సి ఉంది. కానీ అలా చేయలేదని వివరించారు. 39 గనులు 42 వేల కార్మికులతో ఉన్న సింగరేణి, 8 గనులు ఎనిమిది వేల కార్మికులకు పడిపోయే అవకాశం ఉందని ఆవేదన చెందారు.

సింగరేణికి బొగ్గు గనుల కోసం కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ప్రధాని మోదీని ఒప్పించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. తాను, సీఎం రేవంత్​ రెడ్డి కూడా మాట్లాడేందుకు వస్తామని అన్నారు. సత్తుపల్లి, కొయ్యగూడెం గనులు ప్రారంభించలేదని వాటిని కూడా సింగరేణికి కేటాయించాలని కోరుతున్నామన్నారు. సింగరేణికి బొగ్గు గనుల వేలంకు రిజర్వేషన్​ కల్పించాలని పేర్కొన్నారు. ఇప్పుడు వేలం నిర్వహిస్తున్న బొగ్గు గనులు సింగరేణికే దక్కేలా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.

సింగరేణి గనుల కోసం విలువైన భూములిచ్చి - ఏళ్లుగా సమస్యలతో సహజీవనం - దయనీయం ఇల్లందు నిర్వాసితుల దుస్థితి - Singareni Colony Public Problems

త్వరలో కొత్త బొగ్గు గనుల వేలం - కొనుగోలు చేయాలనే యోచనలో సింగరేణి - Coal Blocks Auction 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.