ETV Bharat / state

2035 నాటికి రాష్ట్రంలో 40,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తే లక్ష్యం : భట్టి - Deputy CM Bhatti On Green Power - DEPUTY CM BHATTI ON GREEN POWER

Deputy CM Bhatti Vikramarka On Green Power : తెలంగాణలో స్థిరమైన, విశ్వసనీయమైన గ్రీన్ పవర్ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి సమగ్ర గ్రీన్ పవర్ ఎనర్జీ పాలసీని అభివృద్ధి చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు గుజరాత్​లో ఏర్పాటు చేసిన 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్‌కు హాజరైన భట్టి, వివిధ రిజర్వాయర్ల వద్ద సోలార్ ప్రాజెక్టులకు తెలంగాణ గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో చేపట్టిన గ్రీన్ పవర్ మిషన్ లక్ష్యం సాధించడానికి వివిధ రంగాల్లోని పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు తమతో చేతులు కలపాలని ఆహ్వానించారు.

Solar Power Production in Telangana
Deputy CM Bhatti On Green Power Generation (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2024, 5:51 PM IST

Deputy CM Bhatti On Green Power Generation : 2035 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 40,000 మెగావాట్ల గ్రీన్ పవర్​ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గుజరాత్ రాష్ట్రం గాంధీ నగర్​లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్​లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ప్రారంభమైన 4వ ప్రపంచ గ్రీన్ పవర్ పెట్టుబడిదారుల సమ్మేళనం, ఎగ్జిబిషన్ సందర్భంగా ఏర్పాటైన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగించారు.

రాష్ట్రంలో గ్రీన్ పవర్ ఉత్పత్తికి ఉన్న మార్గాలు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఆయన వివరించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి ప్రపంచంలో ఆర్థిక, సామాజిక శ్రేయస్సుకు రెన్యూవబుల్​ ఎనర్జీ పునాది లాంటిదని ఆయన పేర్కొన్నారు. భారతదేశం 500 గిగా వాట్ల గ్రీన్ పవర్​ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. తెలంగాణ డైనమిక్ ఆర్థిక వ్యవస్థ, ఐటీ, ఫార్మసిటికల్స్ తయారీ వంటి అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలతో ఈ పరివర్తనకు తెలంగాణ ప్రభుత్వం నాయకత్వం వహించాలని లక్ష్యంగా పెట్టుకుందన భట్టి విక్రమార్క అన్నారు.

300 రోజులకు పైగా ఉండే సూర్యరశ్మితో సుమారుగా 26.4 గిగావాట్ల సామర్థ్యం : ఇది పెరుగుతున్న ఇంధన అవసరాలను సమతుల్యం చేయడం స్థిరత్వానికి ఒక నిబద్దతగా తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిటీ, ఫోర్త్ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్​ను ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. ఇంటెలిజెన్స్ సిటీ, ఫ్యూచర్ సిటీ సుస్థిర సాంకేతికల చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతమై ఉంది. కీలక పారిశ్రామిక కారిడార్లను అనుసంధానం చేయడానికి ప్రాంతీయ రింగ్ రోడ్డు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్​ను ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు.

ఇవి గ్రీన్ పవర్ ఉత్పత్తికి అవకాశం కల్పిస్తాయని అన్నారు. తెలంగాణలో సమృద్ధిగా ఉన్న వనరులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, టీఎస్ - ఐపాస్ వంటి వ్యాపార అనుకూల సంస్థలు గ్రీన్ పవర్ రంగాల్లో కంపెనీలు అభివృద్ధి చెందడానికి మంచి అవకాశాలను అందిస్తున్నాయి అన్నారు. 300 రోజులకు పైగా ఉండే సూర్యరశ్మితో సుమారుగా 26.4 గిగావాట్ల సామర్థ్యం అంచనా వేస్తున్నట్టు తెలిపారు. భారతదేశంలో బలంగా గాలులు వీచే మొదటి ఎనిమిది రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ ఉందన్నారు.

సమగ్ర గ్రీన్ పవర్ ఎనర్జీ పాలసీని అభివృద్ధి చేస్తున్నాం : 150 మీటర్ల వద్ద సుమారుగా 54 గిగావాట్ల గాలి సామర్థ్యం కలిగి ఉందన్నారు. రాష్ట్రంలో శ్రీశైలం, నాగార్జునసాగర్​లలో పంప్ ఆపరేషన్లతో రాష్ట్రంలో రెండు ప్రధాన హైడ్రో ప్రాజెక్టులు ఉన్నాయని, ఇక్కడ పంపుడ్​ స్టోరేజీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపట్టడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వీటితోపాటు రిజర్వాయర్లు, పాడుబడిన గనులు మొదలైన వాటిని ఉపయోగించి, నది వెలుపల పంపుడ్ స్టోరేజీ ప్రాజెక్టులను చేపట్టడానికి మరింత అవకాశం ఉందని వివరించారు.

ఇతర గ్రీన్ పవర్ సంభావ్యతలో హైడ్రోజన్, జియో థర్మల్ ( సుమారు 1500 నుంచి 3,000 మెగావాట్ల) మినీ హైడల్ ( సుమారు 250 మెగావాట్ల) విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం స్థిరమైన, విశ్వసనీయమైన గ్రీన్ పవర్ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి సమగ్ర గ్రీన్ పవర్ ఎనర్జీ పాలసీని అభివృద్ధి చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం చేపట్టిన గ్రీన్ పవర్ మిషన్ లక్ష్యం సాధించడానికి వివిధ రంగాల్లోని పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు తమతో చేతులు కలపాలని ఆహ్వానించారు. సోలార్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపే వారంతా హైదరాబాద్​కు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.

"రాష్ట్రంలో 22 గ్రామాలకు సౌరవిద్యుత్​​ - ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు" - Deputy CM Bhatti Review On Solar

మార్చిలోపు 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలి : డిప్యూటీ సీఎం భట్టి - DY CM BHATTI ON YADADRI POWER PLANT

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.