ETV Bharat / state

4 నెలల్లో నైనీబ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలి : డిప్యూటీ సీఎం భట్టి - Deputy CM Bhatti Review Meeting

Deputy CM Bhatti Review On Odisha Coal Block : మరో నాలుగు నెలల్లో ఒడిశా నైనీ బ్లాక్ నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. నైనీ బ్లాక్​లో బొగ్గు ఉత్పత్తిపై సింగరేణి అధికారులతో సచివాలయంలో భట్టి సమీక్షించారు. నైనీ బొగ్గు బ్లాక్​కు ఇప్పటికే అన్ని అనుమతులు లభించిన నేపథ్యంలో ఆ రాష్ట్ర అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పనులు వేగంగా పూర్తయ్యేలా చొరవ చూపాలని సింగరేణి సంస్థను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక అధికారిగా నైనీ జనరల్ మేనేజర్​కు బాధ్యతలు అప్పగించాలని సూచించారు.

Deputy CM Bhatti Review meeting
Deputy CM Bhatti Review On Odisha Coal Block (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 17, 2024, 3:16 PM IST

Deputy CM Bhatti Review On Odisha Coal Block : సింగరేణి సంస్థకు ఒడిశా రాష్ట్రంలో కేటాయించిన నైనీ బ్లాక్ నుంచి నాలుగు నెలల్లో ఉత్పత్తి ప్రారంభించాలని ఉపముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. సచివాలయంలో నైనీ బొగ్గు బ్లాకుపై ఇంధన శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, ఇతర అధికారులతో భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఇటీవలే భట్టి విక్రమార్క, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝిని కలిసి చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి ప్రతిష్ట స్థానికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పనిచేయాలన్నారు.

సింగరేణి అధికారులతో భట్టి సమీక్ష : సింగరేణికి 783 హెక్టార్ల అటవీ స్థలం అప్పగింతపై ఒడిశా సీఎం సానుకూలంగా స్పందించినందున ఆ రాష్ట్ర అటవీశాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పనులు వేగంగా పూర్తయ్యలా చొరవ చూపాలని భట్టి విక్రమార్క సింగరేణి అధికారులను ఆదేశించారు. స్థానిక నిర్వాసితులకు పునరావాస పథకం, కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలు, గ్రామ యువతకు ఉపాధి అవకాశాలపై తగిన ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. ఛెండిపడ రోడ్డును విస్తరించడం, బలోపేతం చేయడం వంటి పనులపై ఆ రాష్ట్ర ఆర్ఎండీ శాఖతో సమన్వయం చేసుకొని త్వరగా పూర్తి చేయాలని చొరవ చూపారు.

నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ : హైటెన్షన్ విద్యుత్తు లైనును ఒడిశా విద్యుత్ శాఖతో కలిసి వెంటనే నిర్మించాలన్నారు. పునరావాసం, నష్టపరిహారం అంశాలపై చర్చించే ఆర్.పి.డి.ఏ.సి. మీటింగ్​ను అతి త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. నైనీ బొగ్గు బ్లాక్​ను 2015 లో కేటాయించినప్పటికీ గడచిన ప్రభుత్వ నిరాసక్తత వల్ల ఇప్పటికీ బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కాలేదన్నారు. నైనీ నుండి బొగ్గు ఉత్పత్తికి ఇప్పుడు సానుకూల పరిణామాలు నెలకొన్నందున నిర్ణీత కాలంలో పూర్తయ్యేలా ప్రణాళికను రూపొందించాలన్నారు. రోజువారీగా నిర్దేశించుకున్న పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. అక్టోబరులో నైనీ బ్లాకు నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేందుకు కృషి చేస్తామని సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు.

నైనీ బొగ్గు గనుల తవ్వకానికి సహకరించాలని ఒడిశా సీఎంకు డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి - ఓకే చెప్పిన మోహన్​ చరణ్​ మాఝీ - Deputy CM Bhatti Meet Odisha CM

త్వరలో మరో డీఎస్సీ - పోస్టులు ఎన్నో తెలుసా? - Deputy CM Bhatti Press Meet

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.