ETV Bharat / state

మార్చిలోపు 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలి : డిప్యూటీ సీఎం భట్టి - DY CM BHATTI ON YADADRI POWER PLANT

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 11, 2024, 10:42 PM IST

Deputy CM Bhatti Vikramarka Review On Yadadri Power Plant : గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాలేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రాజెక్టుపై నిత్యం సమీక్షలు జరపకుండా పక్కన పెట్టడం వల్లే వ్యయం మరింత పెరిగి ప్రభుత్వంపైన ఆర్థిక భారం పడిందన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి వారం వారం క్యాలెండర్ ఖరారు చేశామని 2025 మార్చి 31 నాటికి ఐదు యూనిట్లు అందుబాటులోకి తీసుకువచ్చి 4,000 మెగావాట్ల విద్యుత్​ను ఉత్పత్తి చేస్తామని డిప్యూటీ సీఎం అన్నారు.

Deputy CM Bhatti And Ministers Visit Yadadri Power Plant
Deputy CM Bhatti Vikramarka Review On Yadadri Power Plant (ETV Bharat)

Deputy CM Bhatti And Ministers Inspect Yadadri Power Plant : నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం (వైటీపీఎస్) అభివృద్ధి, పనుల పురోగతిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం యూనిట్ -2 ఆయిల్ సింక్రనైజేషన్​ను స్విచ్ ఆన్ చేసి పనులను ప్రారంభించారు. పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు, సిబ్బంది, కార్మికులకు ప్రభుత్వం తరఫున అభినందనలు తెలిపారు. అనంతరం ప్రాజెక్టు పనుల పురోగతిపై టీజీజెన్‌కో, బీహెచ్ఈఎల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష : ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి 3 యూనిట్ల ద్వారా 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకొస్తామని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. 2025 మార్చి నాటికి 5 యూనిట్ల ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తియే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పనులు వేగవంతం చేయడానికి సివిల్ పనులతో పాటు, రైల్వే పనులు, రోడ్డు రవాణా మార్గాన్ని సులభతరం చేస్తున్నామన్నారు.

ప్రాజెక్టులో నిరుద్యోగులకు ఉద్యోగాలు : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్జీటీ క్లియరెన్స్‌తో పాటు, నిరంతరం ప్రాజెక్టు పనులపై పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. భూ నిర్వాసితులకు భూసేకరణ నిధులతో పాటు, ప్రాజెక్టులో తప్పనిసరిగా ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌తో పాటు పులిచింతల ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారిని అన్ని విధాల ఆదుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బాధిత కుటుంబాలలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆదేశించిన ఉప ముఖ్యమంత్రికి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్​పై ప్రత్యేక దృష్టి : యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణం ఆలస్యమైనప్పటికీ త్వరితగతిన పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. భూములు ఇచ్చిన వారికి జాబితా రూపొందించి వారికి న్యాయం చేస్తామన్నారు. 2025 మార్చి నాటికి ఐదు యూనిట్లు అందుబాటులోకి తీసుకువచ్చి 4,000 మెగావాట్ల విద్యుత్​ను ఉత్పత్తి చేస్తామని మంత్రులు స్పష్టం చేశారు.

"మార్చిలోపు 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలి. ప్రాజెక్టు భూనిర్వాసితులను గౌరవించి న్యాయం చేయాలి. అర్హులైన వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. పవర్‌ప్లాంట్‌ భూనిర్వాసితులకు వెంటనే పరిహారం చెల్లించాలి. పవర్ ప్లాంట్ నుంచి దామరచర్ల వరకు రోడ్డునిర్మాణం జరగాలి. బొగ్గు రవాణా, ఇతర అవసరాలకు 4 వరుసల రోడ్డు వేయాలి." -భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం

రాష్ట్ర ఆదాయమంతా అప్పులకే పోతోంది - అందుకే రీస్ట్రక్చరింగ్ చేయాలి : భట్టి విక్రమార్క - DY CM Bhatti On Finance Commission

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వచ్చే వాటాను 50 శాతానికి పెంచాలి : డిప్యూటీ సీఎం - CENTRAL FINANCE COMMISSION meet

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.