ETV Bharat / state

అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ కేసులో కాంగ్రెస్‌ నేతలకు నోటీసులు - భయపడేది లేదన్న సీఎం రేవంత్​ - Amit Shah Fake Video Case - AMIT SHAH FAKE VIDEO CASE

Delhi Police Notices to Congress Leaders on Amit Shah Video : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వీడియా మార్ఫింగ్‌ కేసులో దిల్లీ పోలీసులు, హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు వచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేరిట వైరలవుతున్న కొన్ని నకిలీ వీడియోలపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేయగా, ఈ మేరకు విచారణ చేపట్టారు. దిల్లీ పోలీసుల నోటీసులపై వివరణ ఇస్తామని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తెలిపారు.

Delhi Police Notices to Cm Revanth Reddy on Amit Shah
Delhi Police Notices to Cm Revanth
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 29, 2024, 4:22 PM IST

Updated : Apr 30, 2024, 10:36 AM IST

Delhi Police Summons to Congress Leaders on Amit Shah Fake Video : రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యాలను వక్రీకరించారని, ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేశారనే అభియోగంతో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో సహా నలుగురు కాంగ్రెస్ నేతలకు దిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. మే 1వ తేదీనా దిలిలీ ద్వారకా సెక్టార్‌లోని పోలీస్‌ ప్రత్యేక విభాగంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సోమవారం గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ ఇన్‌ఛార్జి రామచంద్రారెడ్డికి కేసుకు సంబంధించిన పేపర్లను నీరజ్‌ చౌధరీ అందజేశారు. నో

అమిత్‌షా వీడియో మార్ఫింగ్ కేసులో నలుగురికి నోటీసులు : టీసులు అందుకున్నవారు మే 1వ తేదీనా విచారణకు హాజరుకాని పక్షంలో సీఆర్‌పీసీ 91/160 కింద క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ ప్రకారం చర్యలు తీసుకుంటామని వాటిలో వివరించారు. దిల్లీ పోలీస్‌ ప్రత్యేక విభాగం ఈ నెల 28న ఐటీ చట్టంతో పాటు ఐపీసీ 153, 153ఏ, 465, 469, 171జీ సెక్షన్ల కింద నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం నోటీసులు ఇస్తున్నట్లు చెప్పారు.

Amit Shah Morphing Video Case : అమిత్‌షాపై సోషల్‌ మీడియా ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన వీడియోను, పోస్ట్‌ చేసినందకు వినియోగించిన ల్యాప్‌టాప్‌/సెల్‌ఫోన్‌/ట్యాబ్‌లను, అలాగే ఈ వీడియోలను ఎక్కడి నుంచి తీసుకున్నారో దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాన్ని విచారణకు వచ్చే టైమ్‌లో వెంట తీసుకురావలని పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా విభాగం ఛైర్మన్‌ మన్నె సతీశ్‌, కోఆర్డినేటర్‌ నవీన్‌, పీసీసీ కార్యదర్శి శివకుమార్‌, అధికార ప్రతినిధి ఆస్మా తస్లీంలకు నోటీసులు ఇచ్చారు. సీఆర్పీసీ 91, 160 కింద నోటీసులు ఇచ్చిన దిల్లీ పోలీసులు, అక్కడ నుంచి వెళ్లిపోయారు.

అసలేం జరిగిందంటే : అమిత్‌ షా ఈ నెల 23న తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తామని వ్యాఖ్యానించారు. దీన్ని కొంతమంది వక్రీకరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్‌ను రద్దు చేస్తామని షా చెబుతున్నట్లుగా ఎడిట్‌ చేశారని బీజేపీ ఆరోపిస్తోంది.

CM Revanth Respond on Notices : నోటీసుల పేరుతో మోదీ, అమిత్‌షా చేసే బెదిరింపులకు ఎవరూ భయపడేదిలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టుపై దిల్లీ పోలీసులు నోటీసులు జారీచేసి, గాంధీభవన్‌కు రావటంపై సీఎం స్పందించారు. కర్ణాటకలో జరిగిన కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి ఈడీ, ఐటీ, సీబీఐ అయిపోయిందని, ఇక దిల్లీ పోలీసులు వచ్చారన్నారు.

"బీజేపీపై పోరాటం చేసే వారికి అమిత్‌షా నోటీసులు ఇస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో బీజేపీను ప్రశ్నించినందునే, ముఖ్యమంత్రిని అయిన నన్ను, మా పార్టీ నేతలకు గాంధీభవన్​లో దిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటి వరకు ఈడీ, ఐటీ, సీబీఐని ప్రయోగించిన మోదీ, షాలు ఎన్నికల్లో ఓట్లకోసం ఇక దిల్లీ పోలీసులను పంపారు. బెదిరింపులకు భయపడేవాళ్లు ఎవరూ ఇక్కడ లేరు. తెలంగాణ, కర్ణాటకల్లో బీజేపీని ఓడించి తీరుతాము."-రేవంత్​రెడ్డి, ముఖ్యమంత్రి

Uttam Reaction On Notices To CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి పోలీసుల నోటీసులు ఇవ్వడం కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని రాష్ట్ర సాగునీరు, పౌరసరఫరా శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. బీజేపీ ఓటమి భయంతోనే కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు, ఈడీ, సీబీఐలతో బెదిరించాడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఫేక్‌ వీడియోలు అంటూ నోటీసులు పంపిస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఆ వీడియోతో సంబంధం ఏంటని ప్రశ్నించారు. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, రాహుల్‌ గాంధీ ప్రధాని అవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

2025 నాటికి రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు రద్దు చేయాలనేదే బీజేపీ లక్ష్యం : సీఎం రేవంత్​ - CM Revanth Hot Comments on BJP

400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ చూస్తోంది : సీఎం రేవంత్​ రెడ్డి - CM Revanth on Modi and KCR

Last Updated : Apr 30, 2024, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.