Delay Railway Bridges Works in Adilabad : ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే ఓవర్, అండర్ బ్రిడ్జిల నిర్మాణం స్వరాష్ట్రంలోనూ సాకారం కావడం లేదు. రెండేళ్ల క్రితం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రూ.97.20 కోట్లతో మంజూరు లభించింది. ఇందులో తెలంగాణ సర్కార్ వాటా రూ.57.71 కోట్లు కాగా, కేంద్ర వాటాగా రూ.39.49 కోట్లు పనుల కేసం వెచ్చించాల్సి ఉంది. నోడల్ ఏజెన్సీగా ఆర్అండ్బీ(R&B) యంత్రాంగం హైదరాబాద్‌కు చెందిన తనిష్క్ కన్స్ట్రక్షన్ కంపనీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం సంజయ్‌నగర్‌లో ఓవర్‌బ్రిడ్జి, తాంసి బస్టాండ్ ప్రాంతంలో అండర్ బ్రిడ్జి పనులను 2024 నవంబర్ 23లోగా పూర్తి చేయాల్సి ఉంది. కానీ భూ సేకరణ కాక పనులన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయి.
భోపాల్ రైల్వేస్టేషన్లో కూలిన పాదచారుల వంతెన
Delay in ROB Works in Adilabad : శాసనసభ ఎన్నికల ముందు 2023 మే 4న ఎంపీ సోయం బాపురావు, ప్రస్తుత ఎమ్మెల్యే పాయల్ శంకర్, అప్పటి ఎమ్మెల్యే జోగు రామన్న లాంఛనంగా పనులను ప్రారంభించడం రాజకీయాలకతీతంగా అందరిలోనూ ఆశలను రేకెత్తించింది. కానీ పరిహారం చెల్లించాల్సిన అవసరం లేనీ ప్రభుత్వ స్థలాల్లో పిల్లర్ల నిర్మాణం చేపట్టి పరిహారం చెల్లించాల్సిన ప్రైవేట్ స్థలాల్లో పనులు ప్రారంభించలేదు. ప్రైవేట్ స్థలాల్లో పనులు చేపట్టాలంటే భూ నిర్వాసితులకు దాదాపుగా రూ.27 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంది.
"భూ నిర్వాసితులు ఉన్నటు వంటి ప్రాంతం వైపు పనులు ప్రారంభం కాలేదు. కేవలం ప్రభుత్వ స్థలంలో మాత్రం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నిర్వాసితులకు పరిహారం ఇప్పటి వరకు చెల్లించలేదు. నిర్వాసిత భూములను ప్రభుత్వం సేకరించ లేదు. రైల్వే వంతెనల నిర్మాణ పనులు వేగంగా జరగడం లేదు. - స్థానికులు
రైల్వే ఓవర్ బ్రిడ్జి, అండర్ బిడ్జ్రిని నిర్మించడం వల్ల మా ఇళ్లు, షాపులు పోతున్నాయి. పరిహారం ఇవ్వకుండా పనులు ప్రారంభించారు. నష్టపోయిన వారికి అధికారులకు మధ్య సమన్వయం లేక ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నారు. రాజకీయాలు పక్కకు పెట్టి నాయకులు మాకు న్యాయం చేయాలి." - భూ నిర్వాసితులు
పరిహారం చెల్లిస్తే పనులు ప్రారంభమయ్యే అవకాశం : పరిహారం నిధులను చెల్లిస్తే తప్పా పనులు ప్రారంభమయ్యే అవకాశం కనిపించడం లేదు. ఎన్నికల ముందు హడావిడి చేసిన నేతలెవరూ వాటి గురించి పట్టించుకోవడం లేదు. దశాబ్దాల తరబడిగా ప్రతిపాదనల్లోనే మగ్గుతున్న రైల్వే వంతెనల (Railway Under Bridges)నిర్మాణ పనులను ప్రజాప్రతినిధులు ఎన్నికల కోణంలో కాకుండా ప్రజల బాధలను పరిగణలోకి తీసుకుంటేనే పురోగతి కనిపిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పట్టించుకునేవారే ఉండరనే ప్రజలలో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈసారైనా బడ్జెట్లో రైల్వే ప్రాజెక్టులకు నిధులు దక్కేనా?
శరవేగంగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు - 4 నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి