ETV Bharat / state

కొత్త పీసీసీ అధ్యక్షుడి ప్రకటన మరింత ఆలస్యం! - అధ్యక్ష పీఠం ఆ ఇద్దరిలో ఎవరికి దక్కేనో! - Delay in selection of new PCC Chief

New PCC Leader In Telangana Congress : కాంగ్రెస్‌ నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర నాయకుల అభిప్రాయాలను సేకరించిన ఏఐసీసీ, ఎంపిక బాధ్యతను రాహుల్‌ గాంధీకి అప్పగించినట్లు తెలుస్తోంది. బీసీలకే పీసీసీ పదవి ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించినా గౌడ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నాయకుల మధ్య నెలకొన్న గట్టి పోటీతో ఎటు మొగ్గు చూపాలో తెలియని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం.

New PCC Leader In Telangana Congress
New PCC Leader In Telangana Congress (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2024, 5:06 PM IST

New PCC Leader In Telangana Congress : రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు పూర్తయినా ప్రకటనకు మాత్రం మరికొంత సమయంపట్టే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. ఆ పదవి బీసీలకు ఇవ్వాలని నిర్ణయించిన అధిష్ఠానం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ మహేశ్​కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్‌ పేర్లు పరిశీలిస్తోంది. ఆ ఇద్దరికి సంబంధించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నుంచి అధిష్ఠానం అభిప్రాయం తీసుకుంది. దీంతో ఇవాళో, రేపో ప్రకటన వస్తుందని వారం, పది రోజులుగా పార్టీ వర్గాలు చెబుతూనే ఉన్నాయి. అధికారిక ప్రకటన మాత్రం రావడం లేదు.

పీసీసీ అధ్యక్ష పీఠం కోసం పోటీ ఆ ఇద్దరి మధ్యే : విశ్వసనీయ సమాచారం మేరకు ఆ ఇద్దరి మధ్య పోటీ అధికంగా ఉండటంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏఐసీసీలో నెలకొన్నట్లు తెలుస్తోంది. మహేశ్ కుమార్‌ గౌడ్‌, మధుయాస్కీ గౌడ్‌ వారం రోజులుగా దిల్లీలోనే మకాం వేసి లాబీయింగ్‌ చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. మధుయాస్కీ 2004లో రాజకీయాల్లోకి రాగా రెండుసార్లు ఎంపీగా రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. ఇక మహేశ్ కుమార్‌ గౌడ్‌ గడిచిన మూడేళ్లుగా పీసీసీ ఆర్గనైజింగ్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్​గా పని చేస్తున్నారు.

యువజన కాంగ్రెస్‌ నుంచి పార్టీలో పని చేస్తున్న ఆయనకు దిల్లీ స్థాయిలో విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి. ఇద్దరు ఎవరికి వారు పెద్దల మోక్షం కోసం పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పార్టీలో వీరి పదవులు, వ్యవహారాలకు చెందిన వివరాలు తెప్పించుకుని అధిష్ఠానం పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. ఎంపిక బాధ్యత రాహుల్‌ గాంధీకి ఇవ్వడంతో ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు.

వర్కింగ్​ ప్రెసిడెంట్ పదవులనూ భర్తీ చేసే ఛాన్స్ : పీసీసీ అధ్యక్ష పదవితో పాటు మరికొన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులనూ భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం యోచిస్తున్నట్లుగా సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రాంచంద్రనాయక్ లేదా బాలు నాయక్​కు అవకాశం దక్కే అవకాశాలుున్నాయి. ఎస్​సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్​ను వరించే అవకాశం ఉంది.

తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షుడు ఎవరు? - రేసులో ఆ ఇద్దరు! - TELANGANA PCC CHIEF BC CANDIDATE

వీడిన 'పదవుల' చిక్కుముడి! - రెండు మూడు రోజుల్లో నూతన సారథి పేరు ప్రకటన!! - New TPCC President Selection

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.