ETV Bharat / state

LIVE UPDATES : ఉచిత బస్సుల ప్రయాణం పట్ల బీఆర్‌ఎస్‌ వైఖరి ఏంటో చెప్పాలి : మంత్రి సీతక్క - TG ASSEMLBLY SESSIONS LIVE UPDATES - TG ASSEMLBLY SESSIONS LIVE UPDATES

Telangana Assembly Session 2024
Telangana Assembly Session (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 29, 2024, 10:10 AM IST

Updated : Jul 29, 2024, 8:11 PM IST

Telangana Assembly Session Today: తెలంగాణ శాసనసభ సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఈవేళ కూడా ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. ఇవాళ మొత్తం 19 పద్దులపై శాసనసభలో చర్చ జరుగుతోంది.

LIVE FEED

8:03 PM, 29 Jul 2024 (IST)

ఉచిత బస్సుల ప్రయాణం పట్ల బీఆర్‌ఎస్‌ వైఖరి ఏంటో చెప్పాలి : మంత్రి సీతక్క

ఒక వైపు బస్సులు పెంచాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తూ మరోవైపు ఆటో వాళ్లను ఆదుకోవాలని మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి సీతక్క విమర్శించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలు బాగా నడుస్తున్నాయని బస్సులు పెంచి ఆటో కార్మికుల పొట్టకొట్టలా అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. దూర ప్రాంతాల్లో మాత్రమే బస్సులు నడుస్తున్నాయని తెలిపారు. ఉచిత బస్సుల ప్రయాణం పట్ల బీఆర్‌ఎస్‌ వైఖరి ఏంటో చెప్పాలని అన్నారు. ప్రజలకు సేవ చేసే నాలెడ్జ్ మాత్రమే నాకు ఉందని అన్నారు.

మరోవైపు మహిళా మంత్రిపై కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు తగవని క్షమాపణలు చెప్పాలని మంత్రి శ్రీధర్​బాబు మండిపడ్డారు.

7:51 PM, 29 Jul 2024 (IST)

మేనిఫెస్టోలో చెప్పినట్లు ఆటో డ్రైవర్లకు బడ్జెట్‌లో డబ్బులు పెట్టలేదు : కౌశిక్‌రెడ్డి

మేనిఫెస్టోలో చెప్పినట్లు ఆటో డ్రైవర్లకు బడ్జెట్‌లో డబ్బులు పెట్టలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో ఇబ్బందులు ఉన్నాయని పేర్కొన్నారు. సీతక్కకు తెలియదని నాలెడ్జ్ లేదని విమర్శించారు. ఆర్టీసీ విలీనం అపాయింటెడ్ డే ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. ఛలో మొబిలిటీ, సోమ్ డిస్టిలరీస్ దస్త్రాలను సభాపతి ముందు పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తెలిపారు. సీఐడీ, విజిలెన్స్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సోమ్ డిస్టిలరీస్ కాంగ్రెస్ పార్టీకి విరాళాలు ఇచ్చింది. రాష్ట్రంలో అన్ని మద్యం దుకాణాలు, బార్లను మూసివేయండని అన్నారు.

7:01 PM, 29 Jul 2024 (IST)

పరిశ్రమలకు రాయతీలు విడుదల చేయాలి : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి

పరిశ్రమలకు రాయతీలు గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్జ్ఞప్తి చేశారు.
హెచ్ఎంటీ తదితర ప్రాంతాల్లో స్కిల్‌సిటీ ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు.
సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు బడ్జెట్‌లో నిధులు తగ్గించారని తెలియజేశారు.

6:57 PM, 29 Jul 2024 (IST)

రెవెన్యూ రాబడుల శాఖలపై ప్రభుత్వం నిఘా పెట్టాలి : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రెవెన్యూ రాబడుల శాఖలపై ప్రభుత్వం నిఘా పెట్టాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు.
లీకేజీలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు.

1:25 PM, 29 Jul 2024 (IST)

సింగరేణిలో దాదాపు రూ. 10, 12 వేల కోట్ల అవినీతి జరిగిందని గతంలో నేను చెప్పాను : కూనంనేని

సింగరేణిలో దాదాపు 10, 12 వేల కోట్ల అవినీతి జరిగిందని కూనంనేని ఆరోపించారు. గతంలో తాను చెప్పానని, విచారణ కమిటీ వేయాలని కూడా గతంలో చెప్పానని గుర్తుచేశారు. విద్యుత్‌పైనే కాదు సింగరేణి సమస్యలపై మాట్లాడాలని ఆయన డిమాండ్​ చేశారు. సింగరేణికి ప్రభుత్వం నుంచి రూ.21 వేల కోట్లు రావాలని ఉద్ఘాటించారు. సింగరేణిలో జరిగిన అవకతవకలను బయటపెట్టాలని డిమాండ్​ చేశారు. విద్యుత్, సింగరేణిని కలిపి విచారణ చేపట్టాలని కోరారు. విద్యుత్ ప్లాంట్లలో సబ్ క్రిటికల్ టెక్నాలజికి వెళ్లడం వెనక మతలబు ఏంటో అని ప్రశ్నించారు. సింగరేణిని, కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఒక సమగ్రమైన ఆలోచన విధానంతో ప్రభుత్వం ముందుకెళ్లాలని సూచించారు.

1:15 PM, 29 Jul 2024 (IST)

జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగింపు

మాజీమంత్రి జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్​

12:52 PM, 29 Jul 2024 (IST)

వాళ్ల అబద్ధాలు మానకపోతే, నేను నిజాలు చెప్పడం మానను : సీఎం రేవంత్​రెడ్డి

యాదాద్రి పవర్‌ ప్రాజెక్టు 2021లోపు పూర్తి చేస్తామని ఒప్పంద చేసుకున్నారని, ఇప్పటికి పూర్తి కాలేదని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ పూర్తికి మరో రెండేళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. యాదాద్రి, భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టుల్లో దిగమింగింది తేల్చడానికే విచారణ కమిషన్‌ వేశామని వెల్లడించారు. మంత్రి పదవులు ఇస్తే చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డికి ఊడిగం చేసింది మీరుకాదా అని ప్రశ్నించారు. తెలుగుదేశంలో ఉండి కూడా తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి సభలో మాట్లాడానని గుర్తుచేసుకున్నారు. తనను జైలుకు పంపించినా భయపడలేదని నిలబడి కొట్లాడానని పేర్కొన్నారు. వాళ్ల అబద్దాలు మానకపోతే, తాను నిజాలు చెప్పడం మాననని హెచ్చరించారు.

12:45 PM, 29 Jul 2024 (IST)

కోర్టుల నిర్ణయాలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారు : సీఎం రేవంత్​

కోర్టుల నిర్ణయాలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. ఇలా మాట్లాడితే ప్రాసిక్యూట్‌ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కమిషన్‌ రద్దు చేయాలనే హైకోర్టుకు వెళ్లారని తెలిపారు. విచారణ కమిషన్‌ రద్దు చేయమని, విచారణ ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు చెప్పిందని వెల్లడించారు. కమిషన్‌ రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టుకు కూడా చెప్పిందని, ఛైర్మన్ ప్రెస్‌మీట్‌ నిర్వహించారనే అభ్యంతరంపై కోర్టు మమ్మల్ని అడిగిందని తెలిపారు. ఛైర్మన్‌ మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందా అని సుప్రీంకోర్టు ప్రశ్నించిందని, దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టుకు చెప్పామని వెల్లడించారు. కమిషన్‌ రద్దు చేయాలన్న వాళ్ల విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించిందని, కేసీఆర్ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించిందని పేర్కొన్నారు. భద్రాద్రి పవర్‌ప్లాంట్‌ను రెండేళ్లలో పూర్తి చేస్తామని ఒప్పందం చేసుకున్నారని, రెండేళ్లలో పూర్తి చేస్తామన్నా ప్రాజెక్టుకు ఏడేళ్లు పట్టిందని విమర్శించారు.

12:30 PM, 29 Jul 2024 (IST)

విద్యుత్‌ కోతలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు : జగదీశ్వర్‌రెడ్డి

విద్యుత్ అంశంలో అధికార పక్షం చేస్తున్న ఆరోపణలు సరైనవి కావని జగదీశ్వర్‌రెడ్డి ఆక్షేపించారు. కొత్తగూడెం విద్యుత్‌ ప్లాంట్‌ కూడా బీహెచ్‌ఎల్‌కే ఇచ్చామని తెలిపారు. కొత్తగూడెం విద్యుత్‌ ప్లాంట్‌ను అతి తక్కువ సమయంలో పూర్తి చేశామని పేర్కొన్నారు. విద్యుత్‌ కోతలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కరెంట్‌ కోతలపై జీవన్‌రెడ్డి అధికారులకు ఫోన్‌ చేసి అడిగారని గుర్తుచేశారు. జీవన్‌రెడ్డిపై కూడా కేసు పెడతారా అని ప్రశ్నించారు. విద్యుత్‌ కోతలపై పత్రికల్లోనూ వార్తలు వస్తున్నాయని వెల్లడించారు.

12:19 PM, 29 Jul 2024 (IST)

మా నాయకుడు కేసీఆర్‌ హరిశ్చంద్రుడే, వాళ్లలా సంచులు మోసే చంద్రుడు కాదు: జగదీశ్వర్‌రెడ్డి

తనపైన ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టారని జగదీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పెట్టిన మూడు కేసుల్లో కోర్టులు తనను నిర్దోషిగా తేల్చిందని చెప్పారు. పెట్రోల్‌ బంక్‌లు, మిర్యాలగూడ కేసులు ఉన్నాయని కోమటిరెడ్డి అన్నారని, వాళ్లు చెప్పిన కేసులపై హౌస్‌ కమిటీ వేయండని డిమాండ్​ చేశారు. తనపై చేసిన ఆరోపణలు నిజమైతే ముక్కునేలకు రాసి రాజీనామా చేస్తానని, తను మాట్లాడితే సీఎం బుజాలు ఎందుకు తడుముతున్నారని ప్రశ్నించారు. మా నాయకుడు కేసీఆర్‌ హరిశ్చంద్రుడేనని, వాళ్లలా సంచులు మోసే చంద్రుడు కాదని విమర్శించారు. చంద్రుడి సంచులు మోసి జైలుకు వెళ్లింది ఆయనేనని ఎద్దేవా చేశారు.

12:16 PM, 29 Jul 2024 (IST)

జగదీశ్వర్‌రెడ్డిపై చేసిన ఆరోపణలు నిరూపిస్తా : మంత్రి కోమటిరెడ్డి

జగదీశ్వర్‌రెడ్డి సవాలను స్వీకరిస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. జగదీశ్వర్‌రెడ్డిపై చేసిన ఆరోపణలు నిరూపిస్తానని, ఆయనపై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానని హామీ ఇచ్చారు.

12:13 PM, 29 Jul 2024 (IST)

నాపై ఆరోపణలు నిరూపించకపోతే కోమటిరెడ్డి, సీఎం ఇద్దరు ముక్కు నేలకు రాయాలి రాజీనామా చేయాలి : జగదీశ్వర్‌రెడ్డి

కోమటిరెడ్డి మాట్లాడిన ప్రతీ అక్షరం రికార్డుల నుంచి తొలగించాలని జగదీశ్వర్‌రెడ్డి కోరారు. కోమటిరెడ్డి చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటి నిరూపించినా సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి వెళ్లిపోతానని సవాల్​ విసిరారు. రాజీనామా చేసిన తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి రాను అని పేర్కొన్నారు. నాపై ఆరోపణలు నిరూపించకపోతే కోమటిరెడ్డి, సీఎం ఇద్దరు ముక్కు నేలకు రాయాలని, రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. నాపై ఆరోపణలు నిరూపించకపోతే సీఎం, మంత్రి కోమటిరెడ్డి రాజకీయాల్లోంచి వెళ్లిపోవాలని సవాల్​ విసిరారు.

12:10 PM, 29 Jul 2024 (IST)

జగదీశ్వర్‌రెడ్డి గతంలో హత్య కేసులో నిందితుడు : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

జగదీశ్వర్‌రెడ్డి గతంలో హత్య కేసులో నిందితుడని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. దొంగతనం కేసులోనూ జగదీశ్వర్‌రెడ్డి నిందితుడని, మదన్‌మోహన్‌రెడ్డి హత్య కేసులో జగదీశ్వర్‌రెడ్డి ఏ2గా ఉన్నారని ఆరోపించారు. భిక్షం అనే వ్యక్తి హత్య కేసులో జగదీశ్వర్‌రెడ్డి, ఆయన తండ్రి ఏ6, ఏ7గా ఉన్నారని పేర్కొన్నారు. రామ్‌రెడ్డి హత్య కేసులో జగదీశ్వర్‌రెడ్డి ఏ3 ఉన్నారని, ఆయనను ఏడాది పాటు జిల్లా నుంచి బహిష్కరించారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పెట్రోల్‌బంక్‌లో జరిగిన దొంగతనం కేసులో జగదీశ్వర్‌రెడ్డి నిందితుడని, ఎన్టీఆర్ హయాంలో మద్యం కేసులోనూ జగదీశ్వర్‌రెడ్డి నిందితుడని ఆరోపించారు.

12:08 PM, 29 Jul 2024 (IST)

మళ్లీ చర్లపల్లి జైలుకే వెళ్తామని రేవంత్‌ అంటున్నారు : జగదీశ్వర్‌రెడ్డి

చర్లపల్లి జీవితం రేవంత్‌రెడ్డికి అనుభవం ఉందని జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. మళ్లీ చర్లపల్లి జైలుకే వెళ్తామని రేవంత్‌ అంటున్నారని, ఉద్యమంలో చంచల్‌గూడ జైలుకు వెళ్లిన అనుభవం నాకు ఉందని పేర్కొన్నారు.

12:04 PM, 29 Jul 2024 (IST)

బీఆర్​ఎస్ డీఎన్‌ఏనే తిన్నింటివాసాలు లెక్కపెట్టడం : సీఎం రేవంత్​

పదేళ్లు ఎవరితో కలిసి పనిచేసిన సహచరులను అగౌరపరిచారని ఎక్కడైనా ఉందా అని సీఎం రేవంత్​ ప్రశ్నించారు. గురువుకు పంగనామాలు పెట్టడం ఎక్కడైనా ఉందా ? నేను మిత్రులను మిత్రులులాగే చూస్తానని, సహచరులను సహచరులాగే చూస్తానని, పెద్దలను గౌరవిస్తానని పేర్కొన్నారు. తిన్నింటివాసాలు లెక్కపెట్టే లక్షణం బీఆర్​ఎస్​ నేతలకు ఉందని విమర్శించారు. బీఆర్​ఎస్ డీఎన్‌ఏనే తిన్నింటివాసాలు లెక్కపెట్టడమని ఎద్దేవా చేశారు. నమ్మిన వారిని మోసం చేసే లక్షణం బీఆర్​ఎస్​దేనని, ఈరోజు సాయంత్రం కమిషన్‌ కొత్త ఛైర్మన్‌ను నియమిస్తామని, మీవాదనలు అక్కడ చెప్పండని పేర్కొన్నారు.

11:52 AM, 29 Jul 2024 (IST)

విద్యుత్ అంశంలో విచారణ జరిగాల్సిందే అని కోర్టు చెప్పింది : సీఎం రేవంత్​

విద్యుత్ కమిషన్‌ ఎదుట కేసీఆర్‌ ఎందుకు హాజరుకాలేదని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. విద్యుత్ సివిల్‌ వర్క్‌లో బినామీలకు టెండర్లు ఇచ్చారని, వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. బీఆర్​ఎస్​ సభ్యుల కోరిక మేరకే న్యాయవిచారణకు ఆదేశించామని వెల్లడించారు. న్యాయవిచారణ జరుగుతున్నప్పుడే తాము దొరికిపోయాం అనే విషయం వాళ్లకు అర్ధమైందని పేర్కొన్నారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే కమిషన్‌కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారని మండిపడ్డారు. విద్యుత్ అంశంలో విచారణ వద్దని కోర్టును అడిగారని తెలిపారు. విద్యుత్ అంశంలో విచారణ జరపాలని మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డే అడిగారని గుర్తుచేశారు. విద్యుత్ అంశంలో విచారణ వద్దని మాజీ సీఎం కోర్టుకు వెళ్లారని, విద్యుత్ అంశంలో విచారణ జరిగాల్సిందే అని కోర్టు చెప్పిందని తెలిపారు.

11:47 AM, 29 Jul 2024 (IST)

సోనియా గాంధీ దయ, జైపాల్‌రెడ్డి కృషి వల్ల రాష్ట్రం విద్యుత్‌ సమస్య నుంచి గట్టెక్కింది : సీఎం రేవంత్​

విద్యుత్‌ వినియోగం ప్రాతిపదికనే విద్యుత్‌ విభజన జరిగేలా జైపాల్‌రెడ్డి చేశారని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. జైపాల్‌రెడ్డి కృషి వల్ల వినియోగం ఆధారంగా తెలంగాణకు 54 శాతం వచ్చేలా విద్యుత్ విభజన జరిగిందని గుర్తుచేశారు. ఉత్పత్తి సామర్థ్యం ప్రకారం 36 శాతం తెలంగాణలో, 64 శాతం ఏపీలో ఉందని తెలిపారు. విభజన చట్టంలో తెలంగాణకు 36 శాతం, ఏపీకి 64 శాతం విద్యుత్‌ వచ్చేలా ఉందని వెల్లడించారు. తెలంగాణను చీకట్ల నుంచి కాపాడింది జైపాల్‌రెడ్డి అని పేర్కొన్నారు. సోనియా గాంధీ దయ, జైపాల్‌రెడ్డి కృషి వల్ల రాష్ట్రం విద్యుత్‌ సమస్య నుంచి గట్టెక్కిందని కొనియాడారు. విద్యుత్‌పై విచారణ కొనసాగించాలని సుప్రీం కోర్టు కూడా చెప్పిందని తెలిపారు. బీహెచ్‌ఎల్‌ నుంచి సివిల్‌ వర్క్స్‌ అన్నీ వాళ్ల బినామీలకే ఇచ్చారని, ప్రైవేటు కాంట్రాక్టర్లు వాళ్ల పార్టీవాళ్లకు ఇచ్చిన వేల కోట్ల పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు. విచారణలో వీళ్ల అవినీతి బయటకు వస్తుందనే అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు.

11:41 AM, 29 Jul 2024 (IST)

విద్యుత్‌ విచారణ కమిషన్‌ కొత్త ఛైర్మన్‌ను సాయంత్రం నియమిస్తాం : సీఎం రేవంత్​

విద్యుత్‌ అంశంలో న్యాయవిచారణ కోరిందే బీఆర్​ఎస్​ సభ్యులేనని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. జగదీశ్వర్‌రెడ్డి చర్లపల్లి జైల్లో ఉన్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కోనుగోలు, యాదాద్రి పవర్‌ప్లాంట్‌పై న్యాయవిచారణ జరుగుతోందని చెప్పారు. కేసీఆర్‌ సత్యహరిశ్చంద్రుడికి ప్రతిరూపంలో జగదీశ్వర్‌రెడ్డి చెప్తున్నారని, విచారణ కమిషన్‌ ముందు వాదనలు వినిపిస్తే బీఆర్​ఎస్ సభ్యుల నిజాయితీ బయటకు వచ్చేదని పేర్కొన్నారు. న్యాయవిచారణ కోరిందీ వాళ్లేనని వద్దంటున్నది వాళ్లేనని తెలిపారు. విచారణ కమిషన్‌ కొత్త ఛైర్మన్‌ను సాయంత్రం నియమిస్తామని వెల్లడించారు. 24 గంటల విద్యుత్‌ ఇవ్వాలని చంద్రబాబు హయాంలోనే నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు. విద్యుత్ కోతలు ఉండకూడదని రాజశేఖర్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, యూపీఏ ప్రభుత్వ నిర్ణయాల వల్లే హైదరాబాద్‌కు ఆదాయం పెరిగిందని తెలిపారు.

11:34 AM, 29 Jul 2024 (IST)

అభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నామని అసెంబ్లీలో ఆనాడే కేసీఆర్‌ చెప్పారు : జగదీశ్వర్‌రెడ్డి

2014 జూన్‌లో అధికారంలోకి వచ్చి నవంబరు నాటికి 24 గంటల విద్యుత్‌ ఇచ్చామని జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. రైతులకు ఎందుకు 24 గంటల విద్యుత్ ఇవ్వట్లేదని మంత్రిగా ప్రశ్నించానని తెలిపారు. విద్యుత్ ఉన్నా సరఫరాకు లైన్లు, సౌకర్యాలు లేవని అధికారులు తెలిపారని చెప్పారు. రూ.90 వేల కోట్లు పెట్టి విద్యుత్‌ సరఫరా వ్యవస్థను బలోపేతం చేశామని తెలిపారు. వినియోగం ఆధారంగానే విభజన సమయంలో రాష్ట్రానికి విద్యుత్‌ను కేటాయించారని చెప్పారు. రూ.24 వేల కోట్ల అప్పుతో విద్యుత్ రంగం మా చేతికి వచ్చిందని పేర్కొన్నారు. అప్పులు చేయకుండా అభివృద్ధి ఎలా చేయాలని ప్రశ్నించారు. అప్పులు చేయకుండా నోట్లు ముద్రించాలా అని ప్రశ్నించారు. అభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నామని అసెంబ్లీలో ఆనాడే కేసీఆర్‌ చెప్పారని గుర్తుచేశారు. ఏదో కొత్త విషయం చెప్పినట్లు పదేపదే అప్పులు చేశారు అంటున్నారని మండిపడ్డారు.

11:20 AM, 29 Jul 2024 (IST)

మా ప్రభుత్వంలోనే విద్యుత్‌ వినియోగం పెరిగింది : జగదీశ్వర్‌రెడ్డి

2014 ముందు మాత్రమే కరెంటు లైన్ల కింద ఇళ్ల నిర్మాణం జరిగిందని జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో కరెంటు లైన్ల కింద ఇల్ల నిర్మాణం జరగలేదని చెప్పారు. పదేళ్ల బీఆర్​ఎస్​ పాలనలో రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం పెరిగిందని పేర్కొన్నారు. 2014లో రాష్ట్రంలో వ్యక్తిగత విద్యుత్‌ వినియోగం 1,196 కిలో వాట్లు ఉండగా 2024లో రాష్ట్రంలో వ్యక్తిగత విద్యుత్‌ వినియోగం 2,349 కిలో వాట్లు అని చెప్పారు. తమ ప్రభుత్వంలోనే విద్యుత్‌ వినియోగం పెరిగిందని వెల్లడించారు.

11:08 AM, 29 Jul 2024 (IST)

విద్యుత్‌ మీటర్లపై ప్రజలను సీఎం రేవంత్​ పక్కదారి పట్టిస్తున్నారు : జగదీశ్వర్‌రెడ్డి

అవసరమైతే 10 రోజులు అదనంగా శాసనసభ నడుపుదామని జగదీశ్వర్‌రెడ్డి డిమాండ్​ చేశారు. రైతుల పొలాల్లో మీటర్లు పెట్టడానికి కేసీఆర్‌ ఒప్పుకోలేదని తెలిపారు. కేంద్రం ఇచ్చే రూ.30 వేల కోట్లను కూడా వదులుకున్నామని చెప్పారు. విద్యుత్‌ మీటర్లపై ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. మోదీ, కేసీఆర్ ఉదయ్‌ స్కీమ్‌ గురించే మాట్లాడుకున్నారని వెల్లడించారు.

11:01 AM, 29 Jul 2024 (IST)

ఏం మాట్లాడాలో అర్ధం కావట్లేదు, మాకు పుస్తకాలే ఇవ్వలేదు : జగదీశ్వర్‌రెడ్డి

ఏం మాట్లాడాలో అర్ధం కావట్లేదని, తమకు పుస్తకాలే ఇవ్వలేదని మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. ఉదయం 4.30 గంటలకు పుస్తకాలు ఇస్తే ఎలా తీసుకోవాలని ప్రశ్నించారు. తమకు రాత్రే పుస్తకాలు ఇచ్చారని అనడం అబద్ధమని తేల్చిచెప్పారు. కొన్ని అంశాలపై పుస్తకాలు వచ్చాయని, కొన్నింటిపై రాలేదని తెలిపారు. రేపటి అంశాలపై పుస్తకాలు ఇస్తే ఏం మాట్లాడాలో నిర్ణయించుకుంటామని పేర్కొన్నారు.

10:58 AM, 29 Jul 2024 (IST)

విద్యుత్ రంగంలో చేసే మంచికి ప్రతిపక్షం సహకరించాలి : రాజగోపాల్ రెడ్డి

రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని, విద్యుత్‌ రంగంలో సమూలమార్పులు తీసుకొస్తామని తెలిపారు. విద్యుత్ రంగంలో చేసే మంచికి ప్రతిపక్షం సహకరించాలని కోరారు.

10:50 AM, 29 Jul 2024 (IST)

ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ డిపాజిట్లు కూడా రాలేదు : రాజగోపాల్ రెడ్డి

ఛత్తీస్‌గఢ్‌ నుంచి చవకగా విద్యుత్‌ వచ్చేదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఛత్తీస్‌గఢ్‌తో ఎంఓయూ చేసుకుని కూడా విద్యుత్‌ తెచ్చుకోలేదని తెలిపారు. కారు, సారు, 16 అన్నారని, ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్​ డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. విద్యుత్‌ రంగంపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

10:45 AM, 29 Jul 2024 (IST)

యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో పాత సాంకేతిక, పాత మోటార్లను ఉపయోగించారు : రాజగోపాల్ రెడ్డి

యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో పాత సాంకేతిక పరిజ్ఞానం, ఎప్పుడో పక్కన పడేసిన పాత మోటార్లను ఉపయోగించారని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఆ విద్యుత్ ప్రాజెక్టు నిత్యం ఏదొక విధంగా షట్ డౌన్ అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అధికారులే బయట పెట్టారని, ఆ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కూడా నామినేటెడ్ విధానంలో ఇచ్చారని పేర్కొన్నారు. ఇష్టానుసారంగా అంచనాలు పెంచారని మండిపడ్డారు. భెల్​కు 20 వేల కోట్లు విలువైన పనులు నామినేటెడ్ పద్ధతిన ఇచ్చారని తెలిపారు. బొగ్గు గనులకు 280 కిలోమీటర్ల దూరంలో దామరచర్ల వద్ద థర్మల్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని చెప్పారు. బొగ్గు అందుబాటులో ఉన్న చోట పవర్ ప్రాజెక్ట్ పెట్టాల్సి ఉందన్నారు. కానీ గత ప్రభుత్వం అందుకు భిన్నంగా పెట్టారని విమర్శించారు.

10:40 AM, 29 Jul 2024 (IST)

అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ రాజులా ప్రవర్తించారు : రాజగోపాల్ రెడ్డి

యాదాద్రి పవర్‌ప్లాంట్‌ వయబులిటీ కాదని 2018లోనే చెప్పానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. యాదాద్రి పవర్‌ప్లాంట్‌ ప్రాజెక్టు పూర్తికి అదనంగా రూ.11 వేల కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పారు. డబ్బులు పోయినా యాదాద్రి పవర్‌ప్లాంట్‌ పూర్తవ్వలేదని విమర్శించారు. రామగుండంలో పవర్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలని విభనజ చట్టంలో ఉందని తెలిపారు. రామగుండంలో పవర్‌ప్లాంట్‌ కట్టకుండా యాదాద్రిలో ఎందుకు కట్టారని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ రాజులా ప్రవర్తించారని విమర్శించారు. నన్ను ప్రశ్నించేది ఎవరు అనే అహంతో కేసీఆర్‌ ప్రవర్తించారని మండిపడ్డారు.

10:25 AM, 29 Jul 2024 (IST)

సభకు రానప్పుడు కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు?: రాజగోపాల్ రెడ్డి

బీఆర్​ఎస్​ ప్రభుత్వం విద్యుత్‌ రంగాన్ని నిర్వీర్యం చేసిందని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో అధిక విద్యుత్‌ను తెలంగాణకు యూపీఏ ప్రభుత్వం కేటాయించిందని గుర్తుచేశారు. జనాభా ప్రాతిపదికన కాకుండా అవసరాల మేరకు విద్యుత్‌ కేటాయించారని తెలిపారు. సభకు రానప్పుడు కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా కేసీఆర్‌ కాకుండా వేరేవారు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. విద్యుత్‌ అవకతవకలపై కమిషన్‌ వేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. తాము తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే చెప్పిండి సరిదిద్దుకుంటామని కోరారు. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిందే కాంగ్రెస్‌ ప్రభుత్వమని అన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అప్పుల్లోకి నెట్టేసిందని విమర్శించారు. అప్పుల నుంచి విద్యుత్ రంగాన్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. సీఎంపై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి విమర్శలు సరికాదని హెచ్చరించారు. గత ప్రభుత్వ తప్పులు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉందని వ్యాఖ్యానించారు.

10:15 AM, 29 Jul 2024 (IST)

మధ్యాహ్నం 3 తర్వాత డిమాండ్లపై మంత్రుల సమాధానాలు

తెలంగాణ శాసనసభలో 19 డిమాండ్లపై చర్చ కొనసాగుతోంది. ఈరోజు మధ్యాహ్నం 3 తర్వాత డిమాండ్లపై మంత్రుల సమాధానాలు చెప్పనున్నారు. శాసనసభలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పద్దులను ప్రవేశపెట్టారు. ఆయనతోపాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, రాజనర్సింహ సీఎం తరఫున పద్దులు ప్రవేశపెట్టారు. పద్దులపై చర్చను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు.

Last Updated : Jul 29, 2024, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.