DCM Driver Allegedly Raped a Minor Girl in Keesara : జీవనం కోసం ఆ ప్రాంతంలో హోటల్ నడిపించడమే ఆ తండ్రి చేసిన పాపమైంది. ఆడుకునే వయసులోనే తన మైనర్ కుమార్తె అత్యాచారానికి గురైంది. కుటుంబానికి శోకం మిగిల్చింది. హోటల్ నిర్వహిస్తూ వచ్చిన డబ్బులతో తన కుమార్తెను చదివించుకుంటూ జీవనాన్ని గడుపుతున్నాడు. కానీ అదే ప్రాంతంలో తన బిడ్డ అత్యాచారానికి గురవుతుంది అనుకోలేదు ఆ తండ్రి. గత ఏడేళ్లుగా నగర శివారులోని ఓ ఇండస్ట్రీస్‌లో హోటల్ నిర్వహిస్తున్నాడు. అందులో డీసీఎం డ్రైవర్‌గా చేస్తున్న వ్యక్తే హోటల్ యజమాని కుమార్తెను అత్యాచారం చేశాడు.
హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న యజమాని 15ఏళ్ల మైనర్ బాలికను లారీ డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కీసర పరిధిలోని రాంపల్లి పరిధిలోని ఓ ఇండస్ట్రీస్‌లో గత ఏడు సంవత్సరాలుగా చిన్న హోటల్ నడుపుంటూ తండ్రి కుమార్తె జీవనం సాగిస్తున్నారు. అయితే హోటల్ యజమానికి 15 ఏళ్ల కుమార్తె ఉంది. రోజువారిగానే తండ్రి హోటల్లో పనులు చేసుకుంటు ఉండగా కుమార్తె వెనకవైపు ఉన్న వారి ఇంట్లో పడుకుంది. శుక్రవారం రాత్రి ఒంటిగంట సమయంలో డీసీఎం డ్రైవర్ మహేశ్ హోటల్లో తినడానికి వచ్చాడు.
డీసీఎం క్యాబిన్లో నుంచి తోసెసి పరార్ : యజమాని కుమార్తె బాత్రూంకి వెళ్లడాన్ని గమనించాడు. అమ్మాయి వెనకాలే వెళ్లి నోరునొక్కి తన డీసీఎంలో ఎక్కించుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. సుమారు రెండు గంటల ప్రాంతంలో తండ్రి వచ్చి చూసేసరికి కుమార్తె కనిపించలేదు. చుట్టు పక్కల ప్రాంతంలో వెతికాడు. డీసీఎం క్యాబిన్ లోపల గమనించిన తండ్రి డీసీఎం డ్రైవర్‌ను వెంబడించాడు. వెంటనే అమ్మాయిని క్యాబిన్లో నుంచి కిందకు తోసేసి అక్కడి నుంచి డీసీఎంతో పరారయ్యాడు. దీంతో బాలిక తండ్రి కీసర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు మహేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇటీవలి కాలంలో అత్యాచారాలు ఘోరంగా పెరిగిపోయాయి. చిన్నపిల్లలు అని చూడకుండా రక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. కామవాంఛ తీరడం కోసం ఎవరైతేనేం అంటూ చేస్తుంది నేరమన్నది తెలిసి కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. అభం శుభం తెలియని వయస్సుని, స్కూలుకు వెళ్లే పిల్లలని చూడకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు.
పక్కింట్లో ఉన్న బాలికపై 4 నెలలుగా అత్యాచారం - నిందితుడిపై పోక్సో కేసు నమోదు - Rape on Minor Girl