ETV Bharat / state

మూసీ నిర్వాసితుల్లో పట్టాలు ఉంటే రెట్టింపు ధర ఇస్తున్నాం - దాన కిశోర్ - Musi River Front Development

Musi River Front Development Project : మూసీ నది పరిసరాలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు మూసీ అభివృద్ధి ప్రాజెక్టు ఎండీ దాన కిశోర్ పేర్కొన్నారు. 2026 జూన్‌లోపు మూసీలో మంచి నీళ్లు ప్రవహించాలని సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు. మూసీలోకి వచ్చే నీటిని శుద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.

Musi River Catchment Survey
Musi Front Development Project (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 28, 2024, 5:05 PM IST

Updated : Sep 28, 2024, 6:55 PM IST

Musi Catchment Survey : చట్టానికి లోబడి హైడ్రా, అధికారులు పనిచేస్తున్నారని మూసీ ప్రాజెక్టు ఎండీ దాన కిశోర్ పేర్కొన్నారు. మూసీ నిర్వాసితులను ఎవరినీ బలవంతంగా తరలించడంలేదని ఆయన స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితులతో సామరస్యంగా మాట్లాడి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు తరలిస్తున్నామని, నిర్వాసితుల్లో దాదాపు 90 శాతం మంది ఖాళీ చేసేందుకు సుముఖుత వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మూసీ నిర్వాసితుల్లో ఎవరికైనా పట్టాలు ఉంటే రెట్టింపు ధర ఇస్తున్నట్లు తెలిపారు.

మురికి కూపంలా మూసీ : హైదరాబాద్​లో 1927లో మూసీకి వచ్చిన వరదల వల్ల భారీ నష్టం జరిగిందని దాన కిశోర్ పేర్కొన్నారు. గతంలోనూ నిర్వాసితులను తరలించారని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో ఇటీవల దాదాపు 9 సెం.మీ పైగా వర్షాలు వచ్చాయని, చిన్న వర్షాలకే హైదరాబాద్‌ ముంపునకు గురవుతోందన్నారు. గతంలో మూసీ సుందరీకరణకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య పలు సూచనలు చేశారని తెలిపారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం కోటి జనాభా ఉందని, మూసీ పరివాహక ప్రాంతం మురికికూపంలా మారిందన్నారు. దానిని మార్చాలని స్పష్టం చేశారు.

ఎప్పటికైనా తొలగించాల్సిందే : మూసీకి వరదలు వస్తే ఇబ్బందులు పడేది ప్రజలేనని దాన కిశోర్ తెలిపారు. మూసీ పరిధిలోని ఎమ్మెల్యేలను తీసుకొని క్షేత్ర పర్యటనకు వెళ్తామని ఆయన పేర్కొన్నారు. మూసీ బఫర్‌జోన్‌, ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని ఇళ్లను ఎప్పటికైనా తొలగించాల్సిందేనని దాన కిశోర్ స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితులకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల విలువైన ఇళ్లను ఇస్తున్నట్లు తెలిపారు.

"మూసీ నది పరిసరాలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నాము. 2026 జూన్‌లోపు మూసీలో మంచి నీళ్లు ప్రవహించాలని సీఎం ఆదేశించారు. మూసీలోకి వచ్చే నీటిని శుద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాము. మూసీకి వచ్చే నీటిని శుద్ధి చేసేందుకు రూ.3800 కోట్ల వ్యయం చేస్తున్నాము. మూసీ రివర్‌ఫ్రంట్‌ పక్కనే ఈస్ట్‌, వెస్ట్‌ కారిడార్‌ నిర్మిస్తాము. వీటి నిర్మాణంతో ట్రాఫిక్‌ తగ్గుతుంది. మూసీ ఆధునీకరణకు ప్రజలందరూ సహకరించాలి" - దాన కిషోర్, మూసీ రివర్ డెవలప్​మెంట్​ ఎండీ

జీవనదిలా మూసీ - మంచినీటిని వదిలే ప్రాజెక్టు నిర్మాణం కోసం వారంలో టెండర్లు - Fresh Water Project

'హైడ్రా, ఎఫ్​టీఎల్, బఫర్​ జోన్ - ఈ పేర్లు వింటేనే మా గుండె ఝళ్లుమంటుంది సారూ' - HYDRA Victims At Telangana Bhavan

Last Updated : Sep 28, 2024, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.