ETV Bharat / state

యూపీఐ పేమెంట్లు క్యాన్సిల్ చేసి రూ.4కోట్లు కొట్టేసిన ముఠా - ఆ షోరూమ్‌లే వారి టార్గెట్​ - UPI Payments Gang Arrested

Police Arrested UPI Payments Gang : యూపీఐ పేమెంట్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా సుమారు రూ.4 కోట్ల మేర యూపీఐ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ కేసులో రాజస్థాన్‌కు చెందిన 13 మందిని అరెస్టు చేయగా వారి నుంచి రూ.1.72 లక్షల నగదుతో పాటు రూ.50 లక్షలు విలువ చేసే ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

Police Busted UPI Payment Gang
Police Arrested UPI Payments Gang (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 9, 2024, 4:05 PM IST

Updated : Sep 9, 2024, 4:51 PM IST

Police Busted UPI Payment Gang : యూపీఐ పేమెంట్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న రాజస్థానీ ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా మూడు కమిషనరేట్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.4 కోట్ల మేర యూపీఐ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. రాజస్థాన్‌కు చెందిన 13 మంది నిందితుల నుంచి రూ. 1.72 లక్షల నగదుతో పాటు 50 లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్‌ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా బజాజ్‌ ఎలక్ట్రానిక్‌ షోరూమ్‌లలో వివిధ వస్తువులు కొనుగోలు చేశాక యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తారు. బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఫిర్యాదుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సైబరాబాద్‌ డీసీపీ నరసింహ తెలిపారు.

ఈ ముఠా చెల్లింపులు చేయడానికి బజాజ్‌ షోరూమ్‌లోని క్యూఆర్‌ కోడ్‌ను రాజస్థాన్‌లోని సహచరులకు పంపుతారని డీసీపీ నరసింహ తెలిపారు. అక్కడి నుంచి క్యూఆర్‌ కోడ్‌తో డబ్బులు పంపిస్తారు. ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు డెలవరీ అయ్యాక పొరపాటున వేరే ఖాతాకు డబ్బు బదిలీ చేశామంటూ ఛార్జ్‌ బ్యాక్‌ ఆప్షన్‌ ద్వారా తిరిగి డబ్బు పొంది మోసానికి పాల్పడుతున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆ వస్తువులను ఇతరులకు అమ్మి ఈ ముఠా సొమ్ము చేసుకుంటున్నారు. రాజస్థాన్‌కు చెందిన 20 నుంచి 25 ఏళ్ల వయసు ఉన్న యువకులంతా కలిసి ఈ ముఠాగా ఏర్పడ్డారని, రెండు నెలలుగా 1,125 లావాదేవీలు నిర్వహించినట్లు డీసీపీ వెల్లడించారు. రాజస్థాన్‌కు ప్రత్యేక బృందాలను పంపించి ప్రధాన సూత్రధారులను అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.

'ముఖ్యంగా హైదరాబాద్​లోని బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ షోరూమ్‌లనే టార్గెట్​ చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ షోరూమ్​లోకి కస్టమర్​గా వెళ్లి అందులో విలువైన వస్తువులను కొని, పేమెంట్‌ విషయంలో వీళ్లు క్యూఆర్​కోడ్​ను ఫొటో తీసి వాళ్ల రాష్ట్రంలో ఉన్న కొంతమందితో యూపీఐ పేమెంట్‌ చేస్తున్నారు. యూపీఐ పేమెంట్‌ చేసుకున్న తర్వాత రెండు మూడు రోజులకు రాజస్థాన్‌లో ఉన్న వాళ్ల మనుషులు ఈ యూపీఐ పేమెంట్‌ ఫ్రాడ్​ ​పేమెంట్‌ అని ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో ఆ నగదను మళ్లీ ఛార్జ్‌బ్యాక్​గా తీసుకుంటున్నారు. ఈ విధంగా ఈ ముఠా సభ్యలు మోసాలకు పాల్పడ్డారు'- నరసింహ, సైబరాబాద్ క్రైమ్ డీసీపీ

Last Updated : Sep 9, 2024, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.