ETV Bharat / state

'మీ బాబును కిడ్నాప్ చేశాం మేమడిగినంత డబ్బివ్వకపోతే చంపేస్తాం' - ఇలాంటి ఫోన్​కాల్స్ మీకూ వస్తున్నాయా? - CYBER CRIMINALS FAKE KIDNAP CALLS - CYBER CRIMINALS FAKE KIDNAP CALLS

Fake Child Abduction Cases in Telangana : సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా కేటుగాళ్లు మరో కొత్త ఎత్తుగడకు తెర తీశారు. విదేశాల్లో ఉంటున్న పిల్లలను కిడ్నాప్ చేశామని తల్లిదండ్రులకు ఫోన్‌కాల్స్‌ చేస్తున్నారు. ఇది నిజమని నమ్మిన తల్లిదండ్రులు వారు చెప్పినట్లు చేస్తున్నారు. తీరా మోసపోయామని గ్రహించి లబోదిబోమంటున్నారు. ఇ

Kidnapping Frauds in Telangana
Kidnapping Frauds in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 26, 2024, 1:55 PM IST

Kidnapping Frauds in Telangana 2024 : సైబర్‌ నేరగాళ్లు యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నారు. రోజుకో కొత్త పంథాతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.సైబర్​ నేరాలపై పోలీసులు ఎంతగా అవగాహన కల్పించినా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఓవైపు ఉద్యోగాలు, బహుమతులు అనే ఆశలను ఎరగా వేస్తున్నారు. మరోవైపు ప్రముఖ వ్యక్తుల సోషల్‌ మీడియా ఖాతాల డీపీలు ఉపయోగించి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. కానీ వారు ఇప్పుడు రూట్ మార్చారు. తాజాగా 'విదేశాల్లో చదువుతున్న మీ పిల్లలను కిడ్నాప్‌ చేశామని అడిగినంత ముట్టజెప్పాలని లేకుంటే వారు మీకు మిగలరని' బెదిరిస్తూ సైబర్‌ మోసగాళ్లు సరికొత్త పంథాలో ప్రజలను దోచుకుంటున్నారు.

ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి ఫోన్‌కాల్స్‌ వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు చెబుతున్నారు. పిల్లలకు నేరుగా ఫోన్‌ చేయాలని, వారు చదువుతున్న విద్యా సంస్థల ద్వారా సమాచారాన్ని తెలుసుకుని కేటుగాళ్ల మోసాలను తిప్పికొట్టాలని సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.

దుబాయ్‌ కేంద్రంగా సైబర్ మోసాలు - రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు నిందితుల అరెస్ట్‌ - Stock Investment Cyber Fraud

ఇటీవలి ఘటనలే ఆధారం : అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్‌లో మహ్మద్‌ అబ్దుల్‌ అర్భాత్‌ అనే భారతీయ విద్యార్థి మార్చి 7వ తేదీన కిడ్నాప్‌నకు గురయ్యాడు. పది రోజుల తర్వాత ఆయణ్ని విడుదల చేయడానికి 1200 అమెరికన్‌ డాలర్లు డిమాండ్‌ చేస్తూ తల్లిదండ్రులకు ఫోన్‌కాల్‌ వచ్చింది. ఆ తర్వాత ఆ యువకుడు వారి చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ సంవత్సరం ఆరంభంలో విదేశాల్లో ఇద్దరు భారతీయ విద్యార్థుల విషయంలోనూ ఈ తరహా రెండు ఘటనలు నమోదయ్యాయి. సైబర్‌ నేరగాళ్లు తల్లిదండ్రులకు వీఓఐపీ కాల్స్‌ చేసి భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు లాగుతున్నారు.

మోసం చేస్తారిలా : తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న, విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లే పిల్లలు, వారి తల్లిదండ్రుల వివరాలను సైబర్ నేరగాళ్లు సేకరిస్తున్నారు. అంతర్జాతీయ నంబర్‌ (వీఓఐపీ)తో వారికి ఫోన్‌ చేస్తున్నారు. మీ పిల్లలను కిడ్నాప్‌ చేశామని, తమ చెర నుంచి సురక్షితంగా బయటపడాలంటే అడిగినంత డబ్బులు పంపించాలని డిమాండ్‌ చేస్తుంటారు. అలా డబ్బులు ఇవ్వని పక్షంలో పిల్లలు దక్కరని బెదిరిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురై వారు చెప్పినట్లే చేస్తున్నారు.

ఇలా చేయండి :

  • ఈ తరహా కాల్స్‌ వస్తే వెంటనే డయల్‌ 100, 1930కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలి.
  • తల్లిదండ్రులు తమ పిల్లలను, విద్యాసంస్థల అధికారులను సంప్రదించాలి.
  • విచారణ ప్రక్రియలో సహాయం అందించేందుకు కేటుగాళ్ల కాల్‌ను రికార్డ్‌ చేయాలి.

పార్శిల్ పేరిట మోసం - బాధితుడి ఖాతా నుంచి రూ.20 లక్షలు స్వాహా - Cyber ​​fraud in the name of parcel

సైబర్​ నేరాలపై కేంద్రం ఉక్కుపాదం- 28200 మొబైళ్లు బ్లాక్​- 20లక్షల నంబర్లు కట్! - DOT BLOCKS MOBILE HANDSETS

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.