ETV Bharat / state

లాటరీ పేరుతో సైబర్ ​నేరగాళ్ల టోకరా - పదిహేను లక్షలకు పైగా పోగొట్టుకున్న ఆటోడ్రైవర్​ - Lucky Dip Frauds in Telangana

Cyber Fraud on Auto Driver in Nizamabad : నిజామాబాద్​ జిల్లాలో ఓ ఆటో డ్రైవర్​ సైబర్​ నేరగాళ్ల వలలో పడి భారీ మొత్తంలో మోసపోయాడు. ఓ కంపెనీ పేరుతో లాటరీ వచ్చిందని ఆటో డ్రైవర్​ను నమ్మించిన సైబర్​ మోసగాళ్లు వివిధ ఛార్జీల పేరుతో రూ. 15 లక్షలకు పైగా స్వాహా చేశారు.

Lucky Dip Frauds in Telangana
లాటరీ పేరుతో సైబర్​నేరగాళ్ల టోకరా - పదిహేను లక్షలకుపైగా పోగొట్టుకున్న ఆటోడ్రైవర్​
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 8, 2024, 5:37 PM IST

Cyber Fraud on Auto Driver in Nizamabad : నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఓ ఆటో డ్రైవర్ భారీ సైబర్ మోసానికి గురయ్యాడు. నిజామాబాద్ వినాయక్ నగర్​లో నివాసం ఉండే సాయిలు అనే ఆటో డ్రైవర్​ను సైబర్ నేరగాళ్లు లాటరీ పేరుతో 15 లక్షల 77 వేల రూపాయలు కుచ్చు టోపీ పెట్టారు. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి కౌన్ బనేగా కరోడ్ పతి కంపెనీ పేరుతో రూ. 25 లక్షల లాటరీ వచ్చిందని ఆటో డ్రైవర్​ను నమ్మించారు. దీంతో ఆ విషయాన్ని నమ్మిన ఆటో డ్రైవర్ వద్ద ఇప్పటి వరకు వివిధ రకాల ఛార్జీల పేరుతో 15 లక్షల 77 వేల రూపాయలు సైబర్ నేరగాళ్లు వసూలు చేశారు. ఈ నేపథ్యంలో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు.

Lucky Dip Frauds in Telangana : సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆఫర్ల పేరుతో లింక్‌లు పంపడం, బహుమతి గెలిచారని మాయమాటలు చెప్పి అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ మీషో పేరుతో స్క్రాచ్‌ కార్డు, లక్కీ డ్రా అంటూ (Lucky Dip Gifts Frauds)సైబర్‌ నేరస్థులు లక్షలు కొట్టేస్తున్నారు. లక్కీ డ్రాలో భాగంగా తాము చెప్పినట్లు చేస్తే నగదు, కారు, వివిధ దేశాల్లో టూర్‌లకు ఎంపికవుతారంటూ మోసగిస్తున్నారు. వారిని నమ్మి వాట్సాప్‌లో పంపిన క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసినా డబ్బు పోగొట్టుకున్నట్లేనని తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నారు. జనవరి నుంచి ఇప్పటివరకూ తెలంగాణలో 15 కేసులు నమోదు కాగా ఎక్కువగా హైదరాబాద్‌ పరిధిలోనే ఉన్నాయి.

Cyber Cases in Hyderabad : తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ వివాహిత ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌లో చీర కొనుగోలు చేసింది. 15 రోజుల తర్వాత ఆమెను సంప్రదించిన సైబర్‌ నేరగాళ్లు (Cyber Crimes) లక్కీ డ్రాలో కారు గెల్చుకున్నట్లు వాట్సాప్‌లో సందేశం పంపారు. నిజమేనని నమ్మిన ఆమె పలు ఛార్జీల కింద రూ.35,000 వారికి పంపించింది. పదేపదే డబ్బులు అడగడంతో మోసం వెలుగులోకి వచ్చింది.

Cyber Financial Fraud In Telangana : మరోవైపు ఇన్వెస్ట్​మెంట్​ జాబ్ ఫ్రాడ్​ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ కేటుగాళ్లు చైనాకు చెందిన నకిలీ కంపెనీలు ఏర్పాటు చేసుకుని బయటి ప్రపంచానికి తెలియకుండా మధ్యతరగతి ప్రజల నుంచి వేల కోట్ల కష్టార్జితం కాజేస్తున్నారు. దళారులు, కమీషన్ గాలంతో సామాన్యులను ఏజెంట్లుగా మలుచుకుంటున్నారు. నకిలీ సంస్ధలు, క్రిప్టో, బిట్ కాయిన్ ఖాతాలు తెరిపించి పావులుగా తయారు చేసుకుంటున్నారు. కేవలం డబ్బుపై ఆశతో లొంగిపోయినందుకు పోలీసు కేసులో ఇరుక్కొని జైలులో ఊచలు లెక్కిస్తున్నారు.

సైబర్​ నేరాల్లో ఇదో కొత్తరకం - ఫేక్​ లీగల్​ నోటీసులతో సొమ్ము కాజేస్తున్న గ్యాంగ్​ అరెస్ట్​

సైబర్ నేరాల్లో తెలుగు యువత - ఇతర రాష్ట్రాల వారితో కలిసి కోట్లు కొల్లగొడుతున్నారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.