ETV Bharat / state

మీ నాన్నను అరెస్ట్ చేశామంటూ కాల్స్ వస్తున్నాయా? - ఐతే వెంటనే మీరు చేయాల్సిందిదే! - FRAUD CALLS IN TELANGANA

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 2, 2024, 7:46 AM IST

Updated : Aug 2, 2024, 10:13 AM IST

Cyber Frauds in Telangana : సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త పంథాలో జనాలను బురిడి కొట్టిస్తున్నారు. పోలీసులమంటూ ఆర్థిక మోసాలకు తెరలేపారు. మీ కుటుంబ సభ్యులు తమ వద్దే ఉన్నారని బెదిరించి, డబ్బులు లాగేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మోసగాళ్లు చేస్తున్న కొత్త దందాపై ప్రత్యేక కథనం.

Cyber Frauds in Nizamabad
Cyber Frauds in Telangana (ETV Bharat)

Cyber Frauds in Nizamabad : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం రాంపూర్ చెందిన ఓ యువతికి, ఇటీవల సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. మీ నాన్న డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడని, వదిలిపెట్టాలంటే వెంటనే 10 వేలు పంపించాలని లేదంటే చేతులు తీసేస్తామని బెదిరించారు. మోపాల్ మండలానికి చెందిన భూమేశ్‌కు ఓ అపరిచితుడు ఫోన్ చేసి, మీ కోడలు గౌతమి తమ అదుపులో ఉందని బెదిరించాడు. అనుమానం వచ్చిన భూమేశ్, తన కోడలు క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నాడు.

బెదిరింపు కాల్స్ : నిందితుడుకి మళ్లీ వీడియో కాల్ చేసి తన కోడలు క్షేమంగా ఉందని చెప్పడంతో, వీడియోకాల్‌లో ఓ మహిళను చూపించి ఆమెను అత్యాచారం చేశావని కేసు పెడతా అంటూ బెదిరించాడు. భూమేశ్ ఠాణాకు వెళ్తున్నానని చెప్పడంతో, ఫోన్ కట్ చేశాడు. ఇలాగే కామారెడ్డికి చెందిన ఒకరిని బెదిరించి లక్షరూపాయలు కాజేశారు. డొంకేశ్వర్ మండలం గంగసముద్రానికి చెందిన ముత్యంరెడ్డికి గుర్తు తెలియని నెంబర్ నుంచి వాట్సాప్‌లో బ్యాంకు లోగోతో రెండు లింక్‌లు వచ్చాయి.

బ్లాక్ మెయిలింగ్​ : మరుసటి రోజు లింక్‌ను క్లిక్ చేయడంతో బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యాయని మేసేజ్ రావడంతో బ్యాంకుకు వెళ్లి ఖాతా చూసుకుంటే మొత్తం ఖాళీ అయ్యింది. తన కుమార్తె పెళ్లి కోసం దాచుకున్న 4 లక్షలు పోయాయని బాధితుడి పోలీసుల వద్ద మొరపెట్టుకున్నాడు. తాజాగా జక్రాన్‌పల్లి మండలం పడ్కల్‌కు చెందిన రాములు అనే వ్యక్తిని, సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిచారు. తాము పోలీసులమని మీ కుమారుడు గంజాయి కేసులో తమ ఆధీనంలో ఉన్నాడని బెదిరింపులకు పాల్పడ్డారు.

పలు దఫాలుగా 95 వేల రూపాయలు కాజేశారు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కొందరు బయటకొచ్చి ఫిర్యాదు చేస్తుండగా, ఇంకొందరు బాధను తమలోనే దాచుకుని కుంగిపోతున్నారు. జిల్లాలో 2021లో 43, 2022లో 192, 2023లో 294 సైబర్‌ నేరాల కేసులు నమోదు కాగా, ఈ ఏడాదిలో ఇప్పటికే 44 కేసులు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. సైబర్ మోసగాళ్ల వలకు చిక్కకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

"సైబర్ మోసగాళ్ల వలకు చిక్కకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బ్యాంక్​ పేరుతో ఏ మెసేజ్​లు, కాల్స్​ వచ్చినా బ్యాంక్ అకౌంట్​ సమాచారం ఇవ్వకూడదు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి". - చంద్రశేఖర్‌రెడ్డి , కామారెడ్డి సీఐ

'మీ పిల్లలు ఫలానా కేసులో ఇరుక్కున్నారంటూ' కాల్స్​ వస్తున్నాయా? - అయితే జాగ్రత్త పడాల్సిందే! - Cyber Crime in Nizamabad

రూ.10వేలకు 20 వేలు వస్తాయన్నారు - చివరకు రూ.10కోట్లు కొట్టేశారు - Investment Fraud in Karimnagar

Last Updated : Aug 2, 2024, 10:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.