ETV Bharat / state

బీ కేర్​ఫుల్!! మీ మొబైల్​కు లింక్ వచ్చిందా? - క్లిక్ చేశారో బుక్కైపోతారు - Trading Crimes Through Whatsapp

Cyber ​​Crimes Rising Through WhatsApp : 'మేము చెప్పినదాంట్లో పెట్టుబడులు పెట్టండి అధిక లాభాలు వస్తాయంటూ' వాట్సాప్‌లో లింక్స్‌ వస్తే మాత్రం పట్టించుకోవద్దు సుమీ. లేదంటే నిండా ముంచేసి వెళ్లిపోతారు. పెట్టుబడులు పెడితే అధిక లాభాలంటూ కోట్లు కొల్లగొట్టి పోతున్న సైబర్ నేరాలపై కథనం.

Cyber ​​Crimes Rising Through WhatsApp Links
Cyber ​​Crimes Rising Through WhatsApp Links (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 19, 2024, 2:25 PM IST

Cyber ​​Crimes Rising Through WhatsApp Links : షేర్‌ ట్రేడింగ్ చేసేవారికి భారీగా లాభాలు ఇప్పిస్తామంటూ దోచుకున్నారు. తమ వాట్సాప్‌ గ్రూప్‌లో చేరిన వారికి షేర్‌ మార్కెట్‌లో ప్రముఖ సంస్థలు త్వరలోనే ఐపీవోకు వెళ్తున్నాయని, వాటికోసం దరఖాస్తు చేసుకుంచే షేర్లు దక్కేలా చేస్తామంటూ ఊరించారు. గ్రూప్‌లోని మిగిలిన వారంతా ముఠా సభ్యులే ఉంటారు. అయితే కొత్తగా చేరిన వారిని నమ్మించడానికి వారు తమకు లాభాలపంట పండిందని పోస్టింగులతో హోరెత్తిస్తుంటారు. అవి నమ్మిన కొత్తవారు నిజమేనని వారితో అసలు కంపెనీల యాప్‌ల రూపంలోని నకిలీ యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేయిస్తారు. ఐపీవోకు వెళ్తున్న సంస్థల పేరిట బ్యాంకు ఖాతాల వివరాలు పంపించి వాటిల్లోకి నేరుగా డబ్బు జమ చేస్తే షేర్ల వివరాల పంపిస్తారు.

లాభాలు తీసుకుందామంటే రావు : చాలామంది మొదట్లో కొంత మొత్తం పెట్టుబడితో షేర్లు కొంటారు. పెట్టుబడి, కేటాయించిన షేర్లు, లాభాలు వంటి వివరాలన్నీ వారు సూచించిన యాప్‌లోనే కనిపిస్తాయి. దీనికితోడు ప్రాథమిక స్థాయిలో లాభాలను ఉపసంహరించుకునే ఆప్షన్ ఉంటుంది. కొంత మొత్తానికే భారీ లాభాలు కనిపించడంతో క్రమంగా రూ.కోట్లు పెట్టుబడిగా పెడతారు. కొన్నిరోజులకు లాభాలను ఉపసంహరించుకునేందుకు ప్రయత్నిస్తే చాలు పన్నులు చెల్లించాలంటూ మెలిక పెడతారు. అప్పుడు మొదలవుతుంది అసలు కథ. అప్పటివరకు పని చేసిన కస్టమర్‌కేర్‌ నంబర్‌ అవుటాఫ్‌ కవరేజ్ ఏరియా, వాట్సాప్‌ ఉంటుంది కానీ అందులో సభ్యులెవ్వరూ స్పందించరు. దీంతో మోసపోయామని గ్రహించిన వారు చివరకు 1930కు ఫిర్యాదులు చేస్తున్నారు.

షేర్ ట్రేడింగ్​లో మోసపోయిన టెకీ - రూ.1కోటి స్వాహా! ఎలా తప్పించుకోవాలి మరి? - Share Trading Fraud Techie

అంతా మాయలోకం : ఈ మోసాల వెనక చైనా నేరస్థుల ముఠాలున్నాయని ఇండియన్‌ సైబర్‌క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ దర్యాప్తులో తేలింది. థాయ్‌లాండ్‌, కంబోడియా, మయన్మార్‌ తదితర సౌత్‌ఈస్ట్‌ ఆసియా దేశాల్లో అడ్డారు ఏర్పాటు చేసుకుని ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. భారతీయ యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని అక్కడికి రప్పించి వారిని నిర్భందించి ఈ తరహా నేరాలు చేయిస్తున్నారని పేర్కొంది.

సోషల్​ మీడియాలో స్టాక్​​ మార్కెట్​ లింక్​​ ఓపెన్ చేశారు - రూ.3.81 కోట్లు పోగొట్టుకున్నారు - Cyber Crime In Patancheru

తెలంగాణలో అత్యధికం : గతేడాది దేశవ్యాప్తంగా జరిగిన సైబర్‌ నేరాల్లో ఒక్క తెలంగాణలోనే 40శాతం పైగా కేసులు నమోదయ్యాయి. దీన్నిబట్టి ముఠాలు రాష్ట్ర ప్రజల్ని ఎంతగా టార్గెట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ ఎక్కువగా నకిలీ ట్రేడింగ్‌ యాప్‌ల దారుణాలే అధికంగా ఉండటం ఆందోళన కలిగించే విషయం.

రీసెర్చ్ చేయకపోతే అంతే సంగతి : తెలియని వారి మాటలు నమ్మి ఆన్‌లైన్‌లో షేర్‌ట్రేడింగ్‌ చేయమంటే మోసుపోయే కంటే ముందుగా వారు చేప్తుంది నిజమాకాదా అన్న విషయాన్ని రీసెర్చ్ చేయండి. లేదంటే మోసపోయిట్లే. షేర్‌ ట్రేడింగ్‌లో ఇంత లాభం ఇప్పిస్తామని చెప్పడం సెబీ నిబంధనల ప్రకారం నేరమన్న విషయం తెలుసుకోండి. అలా చెప్పారంటే నకిలీల పనే అనే గుర్తుంచుకోవాలి. 10-20 ప్రముఖ స్టాక్‌ బ్రోకింగ్‌ కంపెనీలు మాత్రమే ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ నిర్వహిస్తున్నాయి.

డాక్టర్​ 'డిజిటల్ అరెస్ట్'!- రూ.2.8 కోట్లు స్వాహా- 'సైబర్' నేరగాళ్ల పనే! - Doctor Cheated By Cyber Frausters

సైబర్ నేరగాళ్ల​ ఉచ్చులో వైద్యుడు - స్టాక్​ మార్కెట్లో ఇన్వెస్ట్​ పేరిట రూ.74 లక్షలు మాయం - Doctor in Trap Of Cyber Criminals

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.