ETV Bharat / state

సైబర్​ వలలో చిక్కి మోసపోయిన వైద్యుడు - రూ.33 లక్షలు స్వాహా చేసిన నేరగాళ్లు - Man Loses 33 Lakhs by Cyber Fraud

Cyber Crime in Satya Sai District : సైబర్​ నేరగాళ్ల వలలకు ఎక్కువ చదువుకున్నవారు, ఉన్నత స్థాయిల్లో ఉన్నవారే ఎర అవుతున్నారు. అధికారులు ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా ఈ మోసాలకు అడ్డుకట్ట పడటం లేదు. కష్టపడి సంపాదించిని సొమ్ము అనాలోచితంగా సైబరాసుల ఖాతాల్లో కుమ్మరిస్తున్న ఘటనలు కోకొల్లలు. తాజాగా సత్యసాయి జిల్లాలో 70 ఏళ్ల ఓ వైద్యుడిని బెదిరించి రూ.33 లక్షలు దోచుకున్నారు.

Cyber Crime in Satya Sai District RS.33 Lakh Fraud
Cyber Crime in Satya Sai District (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 19, 2024, 7:32 PM IST

Cyber Crime in Satya Sai District RS.33 Lakh Fraud : కష్టపడి చెమటోడ్చి డబ్బు కూడగట్టేవారు కొందరు. కాలుమీద కాలేసుకుని వడ్డీలు చక్ర వడ్డీల పేరులో ఆస్తులు సంపాదిస్తారు మరి కొందరు. రోజంతా ఆఫీసులో పని చేసి, ఇలా ఎన్నో విధాలుగా లక్ష్మీ కటాక్ష కోసం పరితపిస్తుంటారు జనాలు. కానీ ఈ రోజుల్లో పక్కనోళ్ల సొమ్ము ఎలా కొట్టేద్దామా అని చూస్తున్నవారే ఎక్కువ, అందులోనూ ఇళ్ల మీద పడి దోచుకోవడం ఓల్డ్ స్టైల్​ అయిపోయింది. దర్జాగా సిస్టమ్​ ముందు కూర్చుని లూటీ చేస్తూ పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు సైబరాసులు. ఇలాంటి ఘటనే తాజాగా సత్యసాయి జిల్లాలో జరిగింది.

ముంబయి పోలీసులం అంటూ సైబర్ నేరగాళ్లు 70 ఏళ్ల ఓ వైద్యుడికి వీడియో కాల్ చేసి బెదిరించి రూ.33 లక్షలను తమ ఖాతాలో వేయించుకున్నారు. ఆధ్యంతం డ్రామాను తలపిస్తున్న ఈ ఘటనలో వైద్యుడి భయమే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడిగా మారింది. బెదిరింపులకు భయపడి కంగారులో రూ. 33 లక్షలు మోసగాళ్ల ఖాతాలో వేశాడు. తరువాత నిజానిజాలు తెలుసుకున్నాక, తాను మోసపోయానని గ్రహించాడు. దీంతో బాధితుడు ధర్మవరం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి తన గోడును వెల్లబోసుకున్నాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐదుగురు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ధర్మవరం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న వెల్లడించారు.

​మోసానికి సహకరించిన వ్యక్తలు అరెస్టు : సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన వైద్యుడు సూర్యనారాయణరెడ్డికి ఇటీవల ముంబయి పోలీసు యూనిఫామ్ ధరించిన ఓ వ్యక్తి వాట్సప్ వీడియో కాల్ చేశాడు. ముంబయిలో నరేశ్​ గోయల్ అనే వ్యక్తి కెనరా బ్యాంకులో రూ.500 కోట్లు అప్పుగా తీసుకున్నారని, అందులో కొంత మొత్తం మీ ఖాతాలో జమచేశారు. అందుకు ఆ వ్యక్తి నుంచి మీరు రూ.20 లక్షలు కమీషన్ తీసుకున్నారని వైద్యుడిని బెదిరించారు.

రూ.33 లక్షలు ఇవ్వాలని లేకపోతే అక్కడికి వచ్చి అరెస్టు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయభ్రాంతుడైన వైద్యుడు నిమిషాల వ్యవధిలో రూ.20 లక్షలు, రూ.13 లక్షల చొప్పున రెండు విడతలుగా సైబర్ నేరగాళ్లు ఇచ్చిన ఖాతాలో జమ చేశాడు. అనంతరం నరేష్‌ గోయల్‌ అనే వ్యక్తి నుంచి తన ఖాతాలో అసలు నగదు జమ అయ్యిందా అనే విషయంపై ఆరా తీశాడు. మోసపోయానని తెలుసుకున్న వైద్యుడు ధర్మవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తుతో వైద్యుడిని మోసగించిన వ్యక్తులను పోలీసులు గుర్తించారు. కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన ఇళయజర్‌, నంద్యాల జిల్లా అయ్యలూరు మెట్టు గ్రామానికి చెందిన ప్రహ్లాద, నంద్యాలకు చెందిన అంబిరెడ్డి, ఆళ్లగడ్డకు చెందిన సత్యం, బాపట్ల జిల్లా గూడవల్లికి చెందిన జావిద్‌ను అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు. వైద్యుడి నుంచి సైబర్ నేరగాళ్ల ఖాతాలో జమ చేసిన డబ్బును త్వరలో రికవరీ చేస్తామని ఎస్పీ చెప్పారు.

'మీ ఫోన్​లో ఏం చేస్తున్నారు? ఇంకేం చూస్తున్నారో మాకు అన్నీ తెలుసు' - Cyber Crimes In Hyderabad

వృద్ధుడు నుంచి రూ.13.16 కోట్లు కొట్టేసిన సైబర్​ కేటుగాళ్లు - దర్యాప్తులో పాన్​ ఇండియా సంబంధాలు బహిర్గతం - Stock Market Fraud In Hyderabad

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.