ETV Bharat / state

రాష్ట్రంలో ఎండుతున్న పంటలు - అన్నదాతకు తప్పని తిప్పలు - Telangana Farmers Worried Crop Loss

Crops Drying Situation in Telangana : తెలంగాణ సిరిసంపదలను వర్ణిస్తూ, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి మాటలు చాలా మందికి గుర్తుండే ఉంటాయి. ఎటు చూసినా పచ్చని మాగాణితో కళకళలాడే పల్లెలను వర్ణిస్తూ ఇలాంటి ఎన్నో కవితలు రాశారు రచయితలు. ఏ పల్లె చూసినా గొలుసుకట్టు చెరువులు, ప్రధాన జలాశయాలు, గలగలపారే నదులతో ఎంతో సందండిగా ఉండేది. దీంతో తెలంగాణ రైతులు రెండు పంటలు పండించుకునేవారు. అయితే గత కొన్నిసంవత్సరాలుగా వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా, భూగర్భజలాలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ యాసంగి మెుదటి నుంచి నీటి ఎద్దడి ఉన్నా, పంట చివరి దశకి వచ్చే సరికి పూర్తిగా ఎండిపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి. మరి, ఈ సమస్య ఎందుకు వచ్చింది? రాష్ట్ర వ్యవసాయశాఖ నివేదికలు ఏం చెబుతున్నాయి? కరవుపై క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితి ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం.

Water Crisis in Telangana
Crops Dying in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 7, 2024, 7:03 AM IST

Crops Drying Situation in Telangana : ఈ చిత్రాలను చూస్తుంటే రాష్ట్రంలో దీర్ఘకాలం తరువాత కరవు ఆవరించినట్లే కనిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. సాధారణ వర్షపాతం కూడా లేక వ్యవసాయ రంగం(Agriculture sector) కుదేలవుతోంది. లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు మునుపటి పరిస్థితిని ఎదుర్కొంటూ, నష్టాలను మూటకట్టుకుంటున్నారు. ప్రధాన జలాశయాలు, నదులు, తెలంగాణాకు వరప్రదాయినిగా ఉన్న గొలుసుకట్టు చెరువులు ఎండిపోయి తాగునీటికి కూడా కటకటలాడే పరిస్థితి నెలకొంది.

వాతావరణ మార్పులు కరవు పరిస్థితులు దీనికి కారణంగా కన్పిస్తున్నాయి. సాగునీటి ప్రాజక్టులలో కూడా చుక్క నీరు లేకపోవడంతో రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఆవరించాయి. గతేడాది జూన్‌లో పడాల్సిన తొలకరి జల్లులు దీర్ఘకాల వేసవి కారణంగా బాగా ఆలస్యం అయ్యాయి. వర్షాకాలంలో కూడా సాధారణ వర్షపాతం(Normal Rainfall) కంటే తక్కువ నమోదవటం యాసంగి పంటలపై తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా ఇప్పుడు లక్షల ఎకరాల్లో పంటలు నిట్టనిలువునా ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

Farmers Worried Crop Loss in Telangana : ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. ఈ ఏడాది నైరుతి, ఈశాన్య రుతుపవనాలు ఎక్కువ వర్షపాతాన్ని తీసుకుని రాకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. ప్రధాన జలాశయాలు, నీటి వనరులు, చెరువులన్నీ అడుగంటిపోయి జలకళ తప్పి కరవు ఛాయలు కమ్ముకుంటున్నాయి. ప్రధాన ఆహార పంట వరి సహా మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, కూరగాయలు, ఆకుకూరల పైర్లు ఎండిపోతుండటం రైతుల్లో కలవరం కలిగిస్తోంది.

మిర్చి పంటను వీడని చీడపీడలు - అప్పుల ఊబిలో కూరుకుపోతున్న అన్నదాతలు - warangal Chilli Farmers Problems

వీటికి తోడు చీడపీడలు, తెగుళ్ల బెడదతో రైతులకు పెట్టుబడులు పెరిగి ఆర్థికంగా మరింత నష్టాల్లోకి వెళ్తున్నారు. నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలోకి ఆలస్యంగా ప్రవేశించడం, ఆశాజనంగా వర్షాలు కురవకపోవం వల్ల ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదైంది. నాగార్జునసాగర్, శ్రీశైలం, శ్రీరాంసాగర్ వంటి ప్రధాన జలాశయాల్లో నీరు అడుగంటిపోయి కళ తప్పడంతో, వ్యవసాయ, ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో బోర్లు ఎండిపోయాయి. కొన్ని చోట్ల విద్యుత్ పంపు సెట్లు ఆన్ చేస్తే అతి కష్టం మీద చిన్న ధార తప్ప పెద్దగా నీరు రావడం లేదు. తద్వారా పంటలు ఎండిపోతుండటంతో రైతుల్లో కలవరం పెరిగిపోతోంది.

Water Crisis in Telangana : నీటి ఎద్దడి కారణంగా వేసిన పంటను కాపాడుకునేందుకు రైతన్న పడరాని పాట్లు పడుతు న్నాడు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 37 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంది. రాబోయే 3 రోజుల్లో మరో 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగబోతున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రైతుల ఆందోళన అంతకంతకూ పెరిగిపోతోంది. మరోవైపు ఇటీవల కాలంలో అక్కడక్కడా కురిసిన అకాల వర్షాలకు కూడా పెద్ద ఎత్తున వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి.

ప్రభుత్వం ఆ పంటలకు సంబంధించిన పరిహారం ఊసే ఎత్తడం లేదు. మరోవైపు వారం పది రోజుల్లో చేతికొచ్చే దశలో ఉన్న వరి, జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర, కూరగాయలు, ఆకుకూరల పంటలు(Vegetable crops) ఎండిపోతున్నాయి. ఇక ఆశలు పూర్తిగా వదిలేసుకున్న కొందరు రైతులు ఎండిపోయిన పంటలను గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలకు మేతగా అందిస్తున్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి వంటి ఉమ్మడి జిల్లాల్లో వరి పంటలు రక్షించుకునేందుకు రైతులు ట్యాంకర్ల సాయంతో నీరు పెట్టుకుంటున్నారు. ఆర్థిక భారమైనా కూడా ఒక్కో ట్యాంకరు 500 నుంచి 800 రూపాయల చొప్పున చెల్లించి వరి పంటలకు నీరు అందిస్తున్నారు.

ఎండుతున్న పంటలు - అన్నదాత తిప్పలు : రాష్ట్రంలో భూగర్భ జల మట్టాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో అత్యంత ప్రమాదకర స్థాయిల్లో పతనమయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరిలో 7.34 మీటర్లు ఉన్న రాష్ట్ర సగటు భూగర్భ జల మట్టాలు, ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 8.7 మీటర్లకు పడిపోయింది. ముఖ్యంగా గత జనవరిలో 7.72 మీటర్లు ఉన్న భూగర్భ జలాలు నెల రోజుల వ్యవధిలోనే 1 మీటరు వరకు క్షీణించి 8.7 మీటర్లకు చేరాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో భూగర్భ జలాల స్థితిగతులపై రూపొందించిన నివేదికలో ఈ ఆందోళనకరమైన అంశాలు వెలుగు చూశాయి.

వరిపైనే మమకారం - ఇతర పంటల సాగుకై దృష్టి పెట్టలేకపోతున్న వ్యవసాయదారులు - Varieties Crop Cultivated

రాష్ట్రంలో జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యంత ప్రమాదకర స్థాయిలో వికారాబాద్ జిల్లాలో 13.07 మీటర్లు మేర భూగర్భ జల మట్టాలు పడిపోయాయి. సాధారణంగా భూగర్భ జల మట్టం 10 మీటర్లు పైగా పడిపోతే పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నట్లు అంచనా వేస్తారు. అయితే తాజా నివేదికలో సిద్దిపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లోని దక్షిణాది ప్రాంతాలు, వికారాబాద్ జిల్లాలోని దక్షిణ మధ్య, ఉత్తరాది ప్రాంతాలు, కామారెడ్డి, భూపాలపల్లి జిల్లాల్లోని మధ్య, ఉత్తరాది ప్రాంతాలు, తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయని ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక చెబుతోంది.

Crops Dry Up in Telangana : యాసంగిలో సాగునీటి కొరత ప్రభావం వరిసాగుపై(Paddy Field) భారీగా పడింది. నాగార్జునసాగర్‌తో పాటు కడెం, ఎస్సారెస్పీ, నిజాంసాగర్‌, కాళేశ్వరం అనుసంధాన ప్రాజెక్టుల నుంచి అవసరమైన సాగునీళ్లు అందుబాటులో లేకపోవడంతో వరిసాగు భారీగా తగ్గింది. గతంతో పోల్చితే మొత్తం 7 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. అందులో వరి సాగే ఏకంగా 6 లక్షల ఎకరాల్లో తగ్గడం గమనార్హం. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడింది.

అకాల వర్షాలతో అపార పంట నష్టం - ఆదుకోమంటూ రైతన్నల వేడుకోలు - CROP DAMAGE in Telangana

2023-24 వార్షిక వర్షపాతం 920.30 మిల్లీమీటర్లు ఉండాల్సి ఉండగా, శుక్రవారం నాటికి 875.10 మిల్లీమీటర్లు నమోదైంది. ఈ ఏడాది ఈశాన్య, నైరుతి రుతు పవనాలు బలహీనంగా ఉండటమే కాకుండా జనవరి మాసంలో అసలు వర్షాలే కురవలేదు. అదే ఫిబ్రవరి మాసంలో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. మొత్తంగా ఈశాన్య, నైరుతి పవనాలు మెండి చేయి చూపడంతో ఈ ఏడాది భూగర్భ జలలు అడుగంటిపోయాయి.

సాగునీరందక ఎండుతున్న పంటలు : నీటి వనరులు అందుబాటులో ఉన్నాయి కదా అని ఏకంగా 67,11,394 ఎకరాల విస్తీర్ణంలో రకరకాల పంటలు సాగు చేశారు. తీరా చూస్తే నీటి ఎద్దడితో పరిస్థితి పూర్తి విరుద్ధంగా మారింది. దాదాపు అన్ని జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు(Ground water) పడిపోయినట్లు సంబంధిత శాఖ అధికారిక లెక్కలు కూడా చెబుతున్నాయి. అయితే, ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన గత మూడు మాసాల గణాంకాల కంటే, క్షేత్రస్థాయిలో ఇంకా ఎక్కువ మీటర్లలో నీటి మట్టాలు పడిపోయినట్లు తెలుస్తుంది. అయితే రైతులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, తాజా వర్షాభావం, ఎండిపోతున్న పంటల అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

దేశానికి అన్నం పెట్టే రైతన్నకి ఈసారి పంటలో లాభం రాకుంటే వచ్చే ఏడాది పంటలో లాభం సాధించాలని ప్రయత్నాలు చేస్తాడు. మరి, ఆరుగాలం కష్టపడి పండించిన ఆ పంటే చేతికి రాకుండా ఉంటే ఎలా? అసలే, పంట బీమా సౌకర్యం లేదు. అటు ప్రభుత్వం, వ్యవసాయశాఖ జోక్యం చేసుకుని, దెబ్బతిన్న పంటల నష్టం అంచనా వేసి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంట బీమాను పక్కాగా అమలుపరిచేలా చూడాల్సిన ఆవశ్యకత ఉంది.

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు సర్కార్​ సిద్ధం - అయినా ప్రైవేట్​ వైపే రైతుల మొగ్గు - prefer to sell paddy in Private

చక్కెర ఫ్యాక్టరీ కోసం 9 నెలలగా రైతు నిరసన - చెప్పులు వేసుకోకుండా, గడ్డం తీయకుండా దీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.