ETV Bharat / state

హైదరాబాద్​లో మార్చి 8 నుంచి 10 వరకు క్రెడాయ్​ ప్రాపర్టీ షో - Credai president about Development

Credai Property show for Householders : హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మార్చి 8 నుంచి 10వ తేదీ వరకు క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2024 జరుగనుందని ఆ సంస్థ అధ్యక్షుడు రాజశేఖర్​రెడ్డి తెలిపారు. ఒకే చోట నగరంలోని అత్యధిక సంఖ్యలో బిల్డర్ల వద్ద ఉత్తమమైన ధరలను పొందేందుకు, అత్యుత్తమ గృహాలను ఎంచుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వివరించారు.

Credai Property show for Householders
Credai 13th Edition Property Show
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 25, 2024, 9:12 AM IST

Credai 13th Edition Property Show : హైదరాబాద్‌లో స్థిరాస్తి రంగం దినదినాభివృద్ధి చెందుతోందని, ముంబయి తర్వాత అత్యధిక నిర్మాణాలు నగరంలోనే ఉన్నాయని క్రెడాయ్ హైదరాబాద్‌ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (Credai) ఆధ్వర్యంలో 13వ ఎడిషన్ క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోను హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మార్చి 8 నుంచి 10, 2024 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గృహ కొనుగోలుదారులు పేరొందిన నిర్మాణ సంస్థలకు చెందిన అపార్ట్‌మెంట్‌లు, విల్లాలు, ఇళ్ల గురించి తెలుసుకోవచ్చని ఆయన వివరించారు.

Credai Property show for Householders : రాష్ట్రాభివృద్ధి విషయంలో ఒక్కో ప్రభుత్వం ఒక్కో విధానంతో ముందుకు వెళ్తుందని, ఆయా ప్రభుత్వాల సహకారంతో క్రెడాయ్ కార్యకలాపాలు నిర్వహిస్తుందని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే మూసీ సుందరీకరణకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని గుర్తు చేశారు. మెట్రో విస్తరణ, రీజినల్ రింగు రోడ్డుతో హైదరాబాద్‌కు అవకాశాలు మరింత ఎక్కువవుతున్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో నగరంలోని రియల్​ ఎస్టేట్​ మార్కెట్​లో స్థిరమైన పెరుగుదల కనబరుస్తోందని చెప్పారు. ప్రాపర్టీ ధరలు పెరుగుతున్నప్పటికీ, నగరంలో గృహ కొనుగోలుదారులను ఆకర్షిస్తూనే ఉందని అన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే నవంబర్ 2023లో ప్రాపర్టీ ధరల్లో 25% పెరిగిందని తెలిపారు.

'2024లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ భవిష్యత్ ఆశాజనకంగా కనిపిస్తోంది. ప్రస్తుతం నగరంలో వృద్ధి జోరు కొనసాగుతుంది. ప్రస్తుత ప్రభుత్వం రూ. 40,000 కోట్లకు పైగా తాజా పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించింది. దీంతో కార్యాలయాలు, నివాస స్థలాలను ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని ఇవి పెంచనున్నాయి. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, విమానాశ్రయాన్ని కూడా అనుసంధానించడానికి నగర జనాభాలో ఎక్కువ మంది అవసరాలను తీర్చడానికి మెట్రో రైలు 2వ దశను కూడా ప్రభుత్వం ఆమోదించింది' - రాజశేఖర్ రెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు

Credai president about Development : ఈ క్రెడాయ్​ ప్రాపర్టీ షోలో బ్యాంకులు సైతం పాల్గొంటాయని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి తెలిపారు. దీంతో గృహ కొనుగోలుదారులకు నచ్చిన ఇంటిని ఎంచుకొని, అక్కడే రుణం పొందడానికి తగిన ఏర్పాట్లు కూడా చేశామని ఆయన పేర్కొన్నారు. కొనుగోలుదారులు నేరుగా డెవలపర్‌లను, బిల్డర్లను కలుసుకోవచ్చని, ఒకే చోట ఉత్తమమైన గృహాలు ధరలను తెలుసుకోవచ్చని అన్నారు. నగరం అంతటా జరుగుతున్న అభివృద్ధి, పరిశ్రమల అభివృద్ధి, హౌసింగ్, కమర్షియల్ రియల్ ఎస్టేట్ కోసం ఈ ప్రాపర్టీ షోను క్రెడాయ్ హైదరాబాద్ రూపొందించిందని పేర్కొన్నారు.

హైదరాబాద్​ నగరం అభివృద్ధిపై సీఎం ఫోకస్​ - మూసీ నది అభివృద్ధే ప్రధానం

అభివృద్ధి పనుల పూర్తికి చర్యలు చేపట్టండి : భట్టి విక్రమార్క

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.