ETV Bharat / state

రామోజీరావు సంస్మరణ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన సీఆర్‌డీఏ కమిషనర్ - RAMOJI RAO MEMORIAL PROGRAMME - RAMOJI RAO MEMORIAL PROGRAMME

CRDA Commissioner Inspected Arrangements for Ramoji Rao Memorial Service: కృష్ణా జిల్లాలో ఈ నెల 27న నిర్వహించే రామోజీరావు సంస్మరణ కార్యక్రమం ఏర్పాట్లను సీఆర్‌డీఏ కమిషనర్ పరిశీలించారు. పెనమలూరులో పరిధిలో ఉన్న చైతన్య మహిళా జూనియర్ కళాశాల సమీపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఏపి ప్రభుత్వ అధికారికంగా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో ఎలాంటి లోటు పాట్లు ఉండొద్దని కింది స్థాయి సిబ్బందికి సూచించారు.

ramoji_rao_memorial_service
ramoji_rao_memorial_service (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 24, 2024, 7:49 PM IST

CRDA Commissioner Inspected Arrangements for Ramoji Rao Memorial Service: ఈ నెల 27న నిర్వహించే రామోజీరావు సంస్మరణ కార్యక్రమం ఏర్పాట్లను ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ పరిశీలించారు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు మండలం తాడిగడప-ఎనికెపాడు చైతన్య మహిళా జూనియర్ కళాశాల సమీపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సీఆర్‌డీఏ కమిషనర్​తో పాటుగా కృష్ణ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో పాటుగా వివిధ శాఖల అధికారుల కలసి పరిశీలించారు.

వేదిక వద్ద రామోజీరావు చిత్రపటం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి, అతిథులు పుష్పాంజలి ఘటించే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. డిజిటల్ స్క్రీన్‌తో పాటు రామోజీరావు చిత్రపటం, యానిమేషన్‌లో పుష్పాంజలి విజువల్స్ ప్రదర్శించాలని చెప్పారు. రామోజీరావు జీవిత విశేషాలు, పత్రికారంగానికి చేసిన సేవలపై ప్రత్యేక ఫొటో ఎగ్జిబిషన్, షార్ట్ ఫిలిం ప్రదర్శన, ముఖ్యమంత్రి ప్రధాన వేదిక వద్దకు చేరుకునేలోగా సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.

ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి ఎలా? డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​తో భేటీ అయినఅ సినీ నిర్మాతలు - Producers Meeting with Pawan Kalyan

చైతన్య మహిళా జూనియర్ కళాశాల ఆవరణ, సిద్ధార్థ లేడీస్ హాస్టల్ ఆవరణ, కృష్ణవేణి విద్యాసంస్థల ఆవరణలో పార్కింగ్ ఏర్పాట్లపై సమీక్ష చేశారు. ప్రధాన వేదిక వద్ద ముఖ్యమంత్రి కాన్వాయ్ వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, చైతన్య మహిళా జూనియర్ కళాశాల ఆవరణ, సిద్ధార్థ లేడీస్ హాస్టల్ ఆవరణ, కృష్ణవేణి విద్యాసంస్థల ఆవరణలు వివిఐపీలకు, వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో బస్సులు, జనరల్ పబ్లిక్ పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. శానిటేషన్ తాగునీటి సరఫరా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేయాలన్నారు.

'ఇక్కడి అబ్బాయి'ని కలిసేందుకు వచ్చిన 'అక్కడి అమ్మాయి'!- పవన్, సుప్రియ భేటీపై సరదా కామెంట్లు - Supriya met Pawan Kalyan

ప్రధాన వేదిక వద్ద పార్కింగ్ ప్రదేశాల్లో అవసరమైన లైటింగ్, నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు పవర్ బ్యాకప్ ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు. ప్రధాన వెన్యూ ప్రదేశంలో డయాస్, బారికేడింగ్ ఆర్అండ్​బి అధికారులు ఏర్పాటు చేయాలని, వివిఐపీలు, పబ్లిక్ గ్యాలరీలు, గ్రీన్ రూమ్​ల వద్ద ఇన్​ఛార్జీలను నియమించాలని ఆదేశించారు. ఈ కార్యక్రంలో సీఆర్​డీఏ అదనపు కమిషనర్ అలీం బాష, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ కస్తూరి, ప్రోటోకాల్ అదనపు డైరెక్టర్ వాణి, ఉద్యాన శాఖ డీడీ ధర్మజ తదితరులు పాల్గొన్నారు.

మెగా డీఎస్సీకి కేబినెట్ ఆమోదం - మంత్రివర్గ సమావేశ కీలక నిర్ణయాలు ఇవే! - Andhra Pradesh Cabinet Meeting

రామోజీరావు సంస్మరణ కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు - సభా ప్రాంతాన్ని పరిశీలించిన సీఆర్‌డీఏ కమిషనర్ (ETV Bharat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.