World Bank and ADB Representatives Meet Amaravati Farmers: రాజధానిలో చేపట్టే ప్రాజెక్టులపై రైతులకు సీఆర్‌డీఏ అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో రైతులతో సీఆర్‌డీఏ అధికారులు, ప్రపంచబ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులను, ఐకాస నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించి అధికారులు వారి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. వీలైనంత త్వరగా అమరావతి నిర్మాణం చేపట్టాలని, చదువుకున్న యువతకు, మహిళలతో పాటు కూలీలకు ఉద్యోగాలు ఇవ్వాలని రైతులు కోరారు. అమరావతి ప్రాంతాన్ని జిల్లాగా పరిగణించాలని కోరారు.
త్వరలోనే నిర్మాణాలు ప్రారంభం: రైతుల సందేహాలను సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ (CRDA Commissioner Katmaneni Bhaskar) నివృత్తి చేశారు. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచబ్యాంకు, ఏడీబీ పెట్టిన నిబంధనలు వివరించారు. రైతులు చెప్పిన అంశాల్లో 80శాతం సీఆర్డీఏ ఒప్పందంలో ఉన్నాయని స్పష్టం చేశారు. అమరావతి ఉద్యమంలో పాల్గొన్న రైతులపై నమోదైన కేసులపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు త్వరలోనే నిర్మాణాలు ప్రారంభిస్తాయని వెల్లడించారు. రుణాలు ఇచ్చే వేళ ఇళ్లు కట్టాలని నిబంధన పెట్టారని వివరించారు. బయటినుంచి వచ్చేవారికి ఇళ్లు మంజూరు చేస్తామని సీఆర్‌డీఏ కమిషనర్ హామీ ఇచ్చారు.
బ్రాండ్ ఏపీ కోసం మంత్రి లోకేశ్ కృషి - పెట్టుబడిదారుల్లో సరికొత్త జోష్
10 మిలియన్ డాలర్ల పెట్టుబడి వస్తే 1 మిలియన్ డాలర్ల రాయితీ ఇస్తారని కమిషనర్ భాస్కర్ వివరించారు. మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామని ఇవన్నీ ఒప్పందంలో భాగమేనని స్పష్టం చేశారు. 90 శాతం కేంద్రసంస్థలు త్వరలోనే నిర్మాణాలు ప్రారంభిస్తాయని తెలిపారు. ఈ ఒప్పందాలు పూర్తయితే బ్యాంకులు ఇంకా రుణాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నాయని తెలిపారు. దాదాపు రూ.30 వేల కోట్ల రుణం వచ్చే అవకాశం ఉందని కమీషనర్ వివరించారు. ఈ నెల 11న దిల్లీలో రుణాల మంజూరుపై సంతకాలు ఉంటాయని అన్నారు.
భవిష్యత్తులోనూ మా సహకారం ఉంటుంది: రుణాలు వచ్చిన వెంటనే రాజధాని నిర్మాణం ప్రారంభిస్తామని ప్రపంచబ్యాంకు ప్రతినిధి గెరాల్డ్ (World Bank Representative Gerald) తెలిపారు. అంతే కాకుండా అమరావతిలో భాగం అవుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఇది ప్రజా రాజధాని అని వారి భాగస్వామ్యం అవసరమని తెలిపారు. భవిష్యత్తులోనూ అమరావతికి మా సహకారం ఉంటుందని ప్రపంచబ్యాంకు ప్రతినిధి గెరాల్డ్ స్పష్టం చేశారు.
నాగార్జునసాగర్-శ్రీశైలం బోటు షికారు ప్రారంభం - ప్యాకేజి వివరాలివే
అప్పుడు అధికారం - ఇప్పుడు అహంకారం- మారని వైఎస్సార్సీపీ నేతల వైఖరి