CPM Fired on YSRCP Government: నూటికి 97 శాతం హామీలు అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటోందని సీపీఎం రాష్ట్ర కమిటీ విమర్శించింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనైనా హామీలు నేరవేరుస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించాలని సీపీఎం డిమాండ్ చేసింది. గత ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను ప్రభుత్వం గడువు ముగిసే వరకైనా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాష్ట్రంలోని 3 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని జగన్ హామీ ఇచ్చారని సీపీఎం గుర్తు చేసింది. సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తానన్నారు, కానీ, ఇప్పటికీ అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యుత్ శాఖలోని కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చిన డైరెక్ట్ పేమెంట్, రెగ్యులరైజేషన్ వంటి హామీలను అమలు చెయ్యలేదని గుర్తు చేసింది.
కార్మికులందర్ని రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. వారం రోజుల్లో సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరింది. అంతేకాకుండా ఓపీఎస్ హామీని ప్రభుత్వం అమలు చేయడం లేదని, జీపీఎస్ పేరుతో మోసం చేయడానికే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించింది.
వైఎస్సార్సీపీకి ఓటమి తప్పదు - బీజేపీతో పొత్తు ఏ పార్టీకి తగదు: గఫూర్
CPM State Committee Meeting ఇప్పటికైనా ఓపీఎస్‌ను పునరుద్దరించి ఎన్నికల వాగ్దానాన్ని సీఎం జగన్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసింది. కేవలం 10వేల 177 మందిని మాత్రమే రెగ్యులర్ చేయటానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది, కానీ, ఆ ఉత్తర్వులు ఇంకా అమలు కాలేదని గుర్తు చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ పథకాలలో పనిచేస్తున్న వారికి సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం లేదని వివరించింది. కనీసం టైంస్కేల్‌ను కూడా అమలు చెయ్యలేదని తెలిపింది.
కనీసం వేతనాలనైనా రెగ్యులర్‌గా చెల్లించడం లేదని, హెచ్‌ఆర్ పాలసీని రూపొందించలేకపోయిందని సీపీఎం విమర్శించింది. రాష్ట్రంలో పని చేస్తున్న పలు రంగాల్లోని కార్మికులకు వేతనాల సవరణ నిర్వహించలేదని పేర్కొంది. చట్ట వ్యతిరేకంగా దారి మళ్లించిన భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులను వెంటనే సంబంధిత బోర్డుకు చెల్లించాలని, సంక్షేమ పథకాలు అమలు కోనసాగించాలని డిమాండ్ చేసింది. నిలిపివేసిన కార్మిక సంక్షేమ బోర్డు పథకాలను కొనసాగిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. రాష్ట్రంలోని అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.
బడ్జెట్ పేరుతో ఎన్నికల ప్రసంగం: సీపీఐ రామకృష్ణ
సీఎం రోజు చెప్పే అబద్దాలనే గవర్నర్‌తో: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోజూ చెప్పే అబద్దాలనే గవర్నర్ ప్రసంగంలో చెప్పించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. విద్యా రంగంలో సంస్కరణలు తీసుకువచ్చామని చెప్తున్న మాట పూర్తిగా అవాస్తవమన్నారు. విద్యారంగంలో అంతలా మార్పులు తీసుకువస్తే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎందుకు ప్రైవేట్ పాఠశాలల్లో చేరుతున్నారని ప్రశ్నించారు.
బైజూస్‌కు వేల కోట్ల రూపాయలు దోచి పెడుతున్నారని మండిపడ్డారు. సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేశారన్నారు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు. కనీసం నిర్వహణకైనా నిధులు కేటాయించలేదన్నారు. కరెంట్ బిల్లులు రూపంలో వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపారన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు.
ఓపీఎస్ సాధించే వరకు ఉద్యమం ఆగదు- సాగర సంగ్రామ దీక్షలో నినదించిన ఉద్యోగులు