ETV Bharat / state

ఆరంభ శూరత్వం కాదు - కూల్చివేతలు ఇలాగే కొనసాగాలి : సీపీఐ నారాయణ - CPI Narayana Visit N Convention - CPI NARAYANA VISIT N CONVENTION

CPI Narayana Comments On Hero Nagarjuna : హైడ్రా కమిషన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం అభినందనీయమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ విషయంలో తమ పార్టీ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటుందని తెలిపారు. నాగార్జున బిగ్‌ బాస్‌కే బాస్‌ అని, చెరువును ఆక్రమించుకుని కబ్జాలు చేశారని అన్నారు. ఆయనేం సత్య హరిశ్చంద్రుడు కాదని, ఎన్‌ కన్వెన్షన్‌ మీద రోజుకు రూ.లక్షల ఆదాయం వచ్చేదని తెలిపారు.

CPI Narayana Comments On Hero Nagarjuna
CPI Narayana Visit N Convention (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 25, 2024, 7:16 PM IST

CPI Narayana Visit N Convention : సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మాదాపూర్‌లో ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ కూల్చివేసిన ప్రాంతాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పేదలు గజం స్థలం ఆక్రమిస్తేనే నానా రాద్ధాంతం చేస్తారని పేర్కొన్నారు. చెరువులు కబ్జా చేయడం వల్ల హైదరాబాద్ పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వర్షం పడితే చాలు నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని అన్నారు.

నాగార్జున బిగ్‌ బాస్‌కే బాస్‌ : నాగార్జున బిగ్‌ బాస్‌కే బాస్‌ అని, చెరువును ఆక్రమించుకుని కబ్జాలు చేశారని అన్నారు. ఆయనేం సత్య హరిశ్చంద్రుడు కాదని, ఎన్‌ కన్వెన్షన్‌ మీద రోజుకు రూ.లక్షల ఆదాయం వచ్చేదని తెలిపారు. ఆయనకు చాలా డబ్బులు ఉన్నాయని, ఇదంతా లెక్క కాదని అన్నారు. మధ్య తరగతి, పేద ప్రజల ఇళ్ల గురించి ఆలోచించి ప్రభుత్వం ముందుకు వెళ్లాలని సూచించారు.

చెరువుల్లో కాలేజీలు కట్టారు : మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి చెరువులో కాలేజీలు కట్టారని, వారంతా కబ్జాకోరులని విమర్శించారు. అక్కడ ఫిరంగి నాలాను కబ్జా చేశారని ఆరోపించారు. చెరువులు, నాలాలు కబ్జా అయితే ఊర్లు మునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఆరంభ శూరత్వం కాదని, ఎక్కడ కబ్జా జరిగినా ఖాళీ చేయించాలని, పెద్దలు కబ్జాలు చేసినా, దొంగ పట్టాలు పొందినా వారి ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు.

రాజకీయ కక్ష సాధింపు అవసరం లేదని, ఒకే పార్టీ, ఒకే వర్గం మీద కక్ష సాధింపు మంచిది కాదన్నారు. ఎవరు ఆక్రమించినా వారిపై హైడ్రా కూల్చివేతలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ కూల్చివేతలు ఇలాగే కొనసాగాలని తెలిపారు. ఎంఐఎం పార్టీ వారివి కూడా తొలగించాలని అన్నారు. అక్రమ నిర్మాణాలకు అనుమతిచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తాము మొదటి నుంచి భూ సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నామని నారాయణ అన్నారు.

"నాగార్జున బిగ్‌ బాస్‌కే బాస్‌. చెరువుని ఆక్రమించుకుని కబ్జాలు చేశారు. నాగార్జునకు ఎందుకింత దురాశ. సినిమా డైలాగ్‌లు పనికిరావు. ఒక్కడే కూర్చుని వంద మందిని కొట్టేస్తే కుదరదు. రోజుకు ఎంత సంపాదించాడో కక్కించాలి. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి చెరువుల్లో కాలేజీలు కట్టారు. వాటిని కూడా పరిశీలించాలి." - నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి

తమ్మిడికుంట వద్ద 3.30 ఎకరాలు ఆక్రమించిన ఎన్​ కన్వెన్షన్‌ : హైడ్రా - Hydra On N Convention Demolition

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు - HC On N Convention Demolition

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.