Actor Nagarjuna Defamation Suit : మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీనటుడు అక్కినేని నాగార్జున వేసిన క్రిమినల్ పరువునష్టం దావాపై హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. మంగళవారం నాడు పిటిషనర్ నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని కోర్టు ఆదేశించింది. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. తదుపరి విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.
తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొండా సురేఖపై హీరో అక్కినేని నాగార్జున పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. తమ కుటుంబ సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె నిరాధార వ్యాఖ్యలు చేశారంటూ ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. నిజానిజాలు తెలుసుకోకుండా పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన ఆమెపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.
'కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీశారు' - మంత్రి సురేఖపై నాగార్జున పరువు నష్టం, క్రిమినల్ కేసులు
సమంత విడాకులకు కేటీఆరే కారణమన్న మంత్రి కొండా సురేఖ - నాగార్జున రియాక్షన్ ఇదే - ఏమని ట్వీట్ చేశారంటే!