ETV Bharat / state

భార్య ఆత్మహత్య - భయంతో భర్త బలవన్మరణం - Adilabad Husband and Wife Suicide

Couple Suicide In Adilabad Today : ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలం కొల్హారి గ్రామంలో భార్య ఆత్మహత్య చేసుకున్న రోజే భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడంతో తనపై అపవాదు వస్తుందన్న భయంతో భర్త పురుగుల మందు తాగి మరణించాడు.

Husband and Wife Suicide In Adilabad
Husband and Wife Committed Suicide In Adilabad
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 27, 2024, 6:16 PM IST

Couple Suicide In Adilabad Today : పెళ్లి అనేది ఓ అందమైన ప్రయాణం. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, కష్టాల్లో తోడునీడగా ఉంటూ హాయిగా ముందుకు సాగుతుండాలి. అలానే అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు, కష్టాలు రావడం దాంపత్య జీవితంలో సహజమే. కానీ కొందరు మాత్రం చిన్న చిన్న గొడవలు లేదా చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వృద్ధ దంపతుల నుంచి కొత్తగా పెళ్లైన జంట వరకు చాలా మంది క్షణికావేశంలో ఘోరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌ మండలంలో దంపతుల ఆత్మహత్య తీరని విషాదం నింపింది.

Husband and Wife Suicide In Adilabad
మృతి చెందిన దంపతులు విజయ్, పల్లవి

Husband and Wife Suicide In Adilabad : ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలం కొల్హారి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకున్న రోజే భర్త కూడా బలవన్మరణానికి ప్రయత్నించగా గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

డిసెంబరు 31న ఆత్మహత్యకు పాల్పడిన జంట - శ్రీకాకుళం జిల్లా వాసులుగా గుర్తించిన పోలీసులు

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం : కొల్హారి గ్రామనికి చెందిన విజయ్‌(24)తో మహారాష్ట్రకు చెందిన పల్లవి(22)కి గతేడాది మే నెలలో వివాహం జరిగింది.సంక్రాంతి పండగకు పుట్టింటికి వెళ్లిన పల్లవి శుక్రవారం మధ్యాహ్నం అత్తగారి ఇంటికి వచ్చింది. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పల్లవి పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో ఉంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే పల్లవి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ప్రేమించడం లేదని బాలికపై దాడి - ఆపై భయంతో ఆత్మహత్య

భార్య మరణంతో విషాదంలో మునిగిపోయిన విజయ్ ఆమె చావుకు తానే బాధ్యుడన్న అపవాదు వస్తుందని భయపడ్డాడు. ఈ క్రమంలోనే మనస్తాపం చెంది క్షణికావేశంలో స్మశాన వాటికకు వెళ్లి అక్కడ పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న బంధువులు విజయ్​ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఆత్మహత్యలకు గల కారణం తెలియకపోవడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. భార్యా భర్తలు ఒకేసారి చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

మొయినాబాద్ యువతి సూసైడ్ కేసు - ఆ ఒక్క ఫుటేజీతో మిస్టరీ వీడింది

అమెరికాలో మళ్లీ హింస- కాల్పుల్లో 8మంది మృతి- నిందితుడి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.