ETV Bharat / state

అప్పు చెల్లించాలని ఫైనాన్స్​ సంస్థ వేధింపులు - దంపతుల ఆత్మహత్య - FINANCE COMPANY HARASSMENT

Couple Suicide Due to Finance Company Harassment in Bapatla District : నిన్నటి వరకూ వాళ్లకు అమ్మా, నాన్నా ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్లు అనాథలయ్యారు. తల్లిదండ్రుల మరణ వార్త విన్న కుమారుడు గుండె విలవిల్లాడింది, మాట పడిపోయింది, పక్షవాతం వచ్చి ఆస్పత్రి పాలయ్యాడు. ఇక కుమార్తె ఒంటరి అయ్యింది. తమ్ముడి ఆలనాపాలనా చూడాలి. అమ్మానాన్నా లేరన్న బాధను దిగమింగి ముందుకు సాగాలి. ఇంతకీ వాళ్లిద్దరూ ఎందుకు చనిపోయారంటే!

Couple Suicide Due to Finance Company Harassment
Couple Suicide Due to Finance Company Harassment (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 21, 2024, 5:39 PM IST

Couple Suicide Finance Company Harassment in Guntur District : అనుకోకుండా జరిగే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడంతో కొందరి కలలు చిధ్రమవుతాయి. అనారోగ్యంతో మరి కొందరు ఈ లోకాన్ని వీడాల్సి వస్తుంది. కానీ అన్నీ సరిగ్గా ఉండి, చిన్న చిన్న సమస్యలకే జడిసి జీవితాల్ని చీకటి చేసుకునే వారు అనేకం. ఈ తరహాలోనే ఆర్ధిక సమస్యలు బాపట్ల జిల్లాకు చెందిన ఓ రైతు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి.

బాపట్ల జిల్లాలో చదలవాడకు పోలిశెట్టి శ్రీనివాసరావు రైతు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు పిల్లలు. కుమార్తె బీటెక్​ పూర్తి చేయగా, కుమారుడు ఇంటర్​ చదువుతున్నాడు. అవసరాలరీత్యా ఓ ప్రైవేట్​ కంపెనీలో రూ.15 లక్షలు రుణం తీసుకున్నారు. నెలనెలా కిస్తీలు కడుతున్నాడు. కానీ సాగులో నష్టం రావడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రెండు నెలల నుంచి వాయిదాలు చెల్లించడం లేదు. దీంతో ఫైనాన్స్​ కంపెనీ అప్పు చెల్లించాలని ఒత్తిడి చేసింది. సంస్థ ప్రతినిధులు ఇంటికి వచ్చి డబ్బు చెల్లించాలని వేధించారు. అంతటితో ఆగకుండా ఇంటికి నోటీసులు అంటించారు. దీన్ని శ్రీనివాసరావు అవమానంగా భావించాడు. అంతే ఇలాంటి పరిస్థితిలో దిక్కుతోచక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు.

పోలిశెట్టి శ్రీనివాసరావు భార్య పుష్పలతతో సహా గుంటూరు జిల్లా నారాకోడూరు వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. భార్య అక్కడికక్కడే చనిపోగా, శ్రీనివాసరావు జీజీహెచ్​లో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. తల్లిదండ్రుల మరణ వార్త విని ఇంటర్ చదువుతున్న కుమారుడు లిఖిత్ కుమార్ షాక్​కు గురయ్యాడు. అంతేకాదు పక్షవాతం బారిన పడ్డాడు. ప్రస్తుతం తెనాలి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుమార్తెకు విషయం తెలిసి దిక్కుతోచని స్థితిలో పడింది. కన్నవారిని కోల్పోవడంతో పాటు సోదరుడు మంచానికే పరిమితం కావడంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో తల్లిదండ్రుల మృతదేహం వద్ద కుమార్తె ఒంటరిగా రోదిస్తున్న ఘటన స్థానికులను కలిచివేసింది.

ఎన్‌ఐటీ పట్నాలో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య - సూసైడ్‌ నోట్‌ లభ్యం - AP Student Suicide in NIT Patna

'వ్యవసాయం చేస్తూ అమ్మ, నాన్న మమ్మల్ని చదివిస్తున్నారు. మూడేళ్ల కిందట ఓ ప్రైవేట్ సంస్థలో రూ. 15 లక్షలు రుణం తీసుకున్నారు. సాగులో నష్టాలు వచ్చి రెండు నెలలుగా వాయిదాలు చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన వారు ఇంటికి నోటీసులు అంటించారు. అవమానకరంగా మాట్లాడారు. దీంతో మనస్తాపానికి గురైన మా అమ్మానాన్న ఆత్మహత్య చేసుకున్నారు.' -భార్గవి మృతులి కుమార్తె

Couple Dies by Suicide Due to Harassment by Loan Agents in Andhra Pradesh : అప్పు ఇచ్చిన సంస్థ ఇంటికి నోటీసులు అంటించి, డబ్బులు కట్టాల్సిందేనని ఒత్తిడి చేయడంతోనే పురుగులు మందు తాగి చనిపోయారని కుమార్తె కన్నీటి పర్యంతమయ్యారు. అసలే అమ్మా నాన్న చనిపోయి దిక్కుతోచని స్థితిలో తమను వదిలి వెళ్లిన బాధలో ఉన్న భార్గవిని తమ్ముడి అనారోగ్యం మరింత కుంగదీస్తుందని బంధువులు ఆందోళన చెందుతున్నారు.

వసతి గృహంలో తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.