ETV Bharat / state

'నేను చేసిన తప్పును నా భర్త, అత్తామామలు క్షమించినా - మా పిన్ని దుష్ప్రచారాన్ని తట్టుకోలేకపోతున్నాం' - Couple committed suicide - COUPLE COMMITTED SUICIDE

Nizamabad Couple Commits Suicide : పిన్ని అంటే అమ్మ తర్వాత అమ్మలాంటిది. తల్లి తన పిల్లలు చేసిన తప్పులను కడుపులో దాచుకుంటుంది. కానీ ఆ చిన్నమ్మ మాత్రం బిడ్డ ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. చిన్న సమస్యను ఫేస్​ చేయలేక ఆత్మహత్యే మార్గం అన్నట్లు ఆ నవ దంపతులు రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

couple_suicide
couple_suicide (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 16, 2024, 10:14 AM IST

Couple committed suicide in Nizamabad : ప్రస్తుత రోజుల్లో ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్యలు చేసుకోవడం పరిపాటిగా మారిపోయింది. ఎవరో ఏదో అన్నారని, వారికి సమాధానం చెప్పలేక, పరువు పోయిందనే తొందరలో ఆత్మహత్య ఒక్కటే శరణ్యం అన్నట్లు నూరేళ్ల జీవితాన్ని కొందరు మధ్యలోనే తుంచుకుంటున్నారు. కనీసం ముందూ వెనుక ఆలోచించకుండా క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని కన్నవారికి పుట్టెడు శోకాన్ని మిగుల్చుతున్నారు. తాజాగా నిజామాబాద్​ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. బంధువులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మనస్తాపం చెందిన నవ దంపతులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. అంతకు ముందు తమ సూసైడ్​కు గల కారణాన్ని వివరిస్తూ వీడియో తీసి పోలీసులకు పంపించారు. వారిని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్‌-మిట్టాపూర్‌ మధ్యలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.

ఊరంతా అప్పులు, ఆపై వేధింపులు - తట్టుకోలేక మహిళ ఆత్మహత్య - Wife Commits Suicide Issue

పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, నిజామాబాద్​ జిల్లా పొతంగల్​ మండలం హెగ్డోలికి చెందిన అనిల్​, శైలజలకు ఏడాది క్రితం వివాహం జరిగింది. కుటుంబంతో కలిసి సొంతూరిలోనే ఉంటున్నారు. అయితే సోమవారం ఉదయం ఓ ఇంటర్వ్యూకు వెళ్తున్నామని కుటుంబీకులకు చెప్పి బయటకు వచ్చారు. అనంతరం తాను ఓ తప్పు చేశానని, దాన్ని భర్త క్షమించినా బంధువులు తమపై దుష్ప్రచారం చేస్తుండటాన్ని తట్టుకోలేక ఇద్దరం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు శైలజ ఓ వీడియో చిత్రీకరించి కోటగిరి ఎస్సై సందీప్‌కు పంపారు.

'మా పిన్ని వల్లే మేం చనిపోతున్నాం. గతంలో నేను ఓ తప్పు చేశాను. ఆ తప్పును క్షమించిన నా భర్త, అత్తామామలు, ఏనాడూ ఎవరితోనూ ఆ విషయం గురించి చెప్పలేదు. కానీ మా పిన్ని ఈ విషయాన్ని మా బంధువుల్లో చాలా మందికి చెప్పింది. ఎవరికీ చెప్పొద్దని మేం చెప్పినా, బంధువులతో పాటు ఇతరులతోనూ చెబుతోంది. ఆమె చెప్పిన మాటలు విన్న బంధువులు ఏదోదో మాట్లాడితే ఇటీవలే నా భర్త పురుగుల మందు తాగాడు. అయినా ఈ దుష్ప్రచారం ఆగడం లేదు. అందుకే మేం చనిపోతున్నాం. నా చావుకు కారణం మా పిన్నే.' - వీడియోలో శైలజ

కారుతో చెరువులోకి దూసుకెళ్లి ఆత్మహత్యాయత్నం - తండ్రీపిల్లలను కాపాడిన స్థానికులు - Father Suicide Attempt With Kids

రైల్వే ట్రాక్​పై దంపతుల మృతదేహాలు : వెంటనే ఈ వీడియోపై స్పందించిన కోటగిరి ఎస్సై సందీప్​ ఆ వీడియోతో పాటు సెల్​ఫోన్​ నంబరును నవీపేట ఎస్సై యాదగిరి గౌడ్​కు పంపించారు. దంపతులు ఆత్మహత్య చేసుకునేందుకు గోదావరి వద్దకు వస్తున్నట్లు సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు బాసర వంతెన దగ్గరకు వెళ్లి గాలించారు. అక్కడ వారిద్దరు కనిపించలేదు. ఆ తర్వాత బాధితుల ఫోన్​ నంబరును ట్రాక్​ చేయగా, ఫకీరాబాద్​-మిట్టాపూర్​ మధ్య ఉన్నట్లు నవీపేట ఎస్సై గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి గాలించగా ఇద్దరి మృతదేహాలు పట్టాలపై కనిపించాయి. రైల్వే పోలీసులకు సమాచారం అందించినట్లు ఎస్సై చెప్పారు.

భార్య తిట్టిందని ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న భర్త - WIFE AND HUSBAND ISSUE

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.