ETV Bharat / state

పచ్చదనం మాటున వైఎస్సార్సీపీ నేతల దోపిడీ - చర్యలకు జనసేన డిమాండ్ - Corruption in plant breeding - CORRUPTION IN PLANT BREEDING

Corruption in Cultivation of Plants in Anantapur: అవినీతికి కాదేదీ అనర్హం అంటూ అనంతపురంలో వైఎస్సార్సీపీ నాయకులు, నగరపాలక అధికారులు నిరూపించారు. నగరపాలక సంస్థ నిధులను మింగేసిన అక్రమార్కులు ఆఖరికి మొక్కలను కూడా వదల్లేదు. కర్బన ఉద్గారాలను తగ్గించటానికి కేంద్ర ప్రభుత్వం మొక్కల పెంపకానికి ఇచ్చిన నిధులను వైఎస్సార్సీపీ గుత్తేదారులకు ఫలహారంగా ఇచ్చేశారు. మొక్కల పెంపకం పేరుతో నిధులను మింగేసి పచ్చదనానికి పాతరేశారు. డివైడర్లపై ఉన్న ఎండిన మొక్కలు అవినీతికి నిలువెత్తు నిదర్శంగా మారాయి.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 28, 2024, 3:37 PM IST

పచ్చదనం మాటున వైఎస్సార్సీపీ నేతల దోపిడీ - చర్యలకు జనసేన డిమాండ్ (ETV Bharat)

Corruption in Cultivation of Plants in Anantapur : అనంతపురంలో మొక్కల పెంపకం అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. పచ్చదనం పేరుతో ఖరీదైన మొక్కలను తెప్పిస్తూ నిధులను మింగేస్తున్నారు. కర్బన ఉద్గారాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకం అమలు చేస్తోంది. ఈ పథకం కింద దేశంలోని అన్ని నగరపాలక సంస్థలకు మొక్కల పెంపకానికి వందల కోట్ల రూపాయలు ఇచ్చింది. దీనిలో భాగంగా కేంద్రం నుంచి వచ్చిన నిధులతో అనంతపురం నగరపాలక సంస్థ వర్టికల్ గార్డెన్ పెంచడానికి చర్యలు చేపట్టింది. ఏటా మొక్కల పెంపకానికే కోట్ల రూపాయలు వెచ్చించి వైఎస్సార్సీపీ గుత్తేదారులకు అప్పనంగా కట్టబెట్టింది.

44వ నెంబర్ జాతీయ రహదారిపై వంతెన పిల్లర్లకు వర్టికల్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఇదే అదనుగా భావించిన గుత్తేదారు దోచుకునేందుకు వీలుగా ఖరీదైన మొక్కలను తెప్పించారు. అనంతపురం వాతావరణ పరిస్థితులకు అనువుకాని మొక్కలను తీసుకువచ్చి నాటడంతో ఏ ఒక్కటీ నెల రోజులు కూడా బతకడం లేదు.

తిరుమలలో మఠాల పేరుతో కోట్ల రూపాయల కుంభకోణం: జనసేన నేత కిరణ్‌ రాయల్‌ - Kiran Royal On YSRCP Scam Tirumala

జనసేన నేతలు ఆగ్రహం : వర్టికల్ గార్డెన్ మొక్కలు ఎండిపోతుంటే మళ్లీ నిధులు ఖర్చు చేసి కొత్తవి తెచ్చి నాటిస్తూ నగరపాలక సంస్థ అధికారులు బంగారు గుడ్డు పెట్టే బాతులా మార్చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. దీని కోసం వైఎస్సార్సీపీ గుత్తేదారుడికి కోటి రూపాయల వరకు అప్పనంగా ఇచ్చారు. ఇంతేకాదు డివైడర్లలో నాటేందుకు కడియం నుంచి వేల రూపాయలు ఖర్చు చేసి ఆర్నమెంటల్ మొక్కలు తీసుకొచ్చి నాటారు. సంరక్షణ లేక మొక్కలు ఎండుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మొక్కల పెంపకంలో కోట్లాది రూపాయల అవినీతి! : మొక్కల పెంపకంలో అవినీతిపై అనేక సార్లు వైఎస్సార్సీపీ కార్పోరేటర్ల నుంచే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో మొక్కల పెంపకంలో అవినీతిపై అనేక సార్లు లేవనెత్తినా అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఒక్కసారి కూడా అధికారులను ప్రశ్నించలేదు. మొక్కల పెంపకంలో జరిగిన కోట్లాది రూపాయల అవినీతిపై విచారణ జరిపిస్తే అనేక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని కార్పొరేటర్లు చెబుతున్నారు.

మద్యం ముసుగులో' జగన్​ అండ్​ కో' - కీలక పాత్ర ఆ నాయకులదే! - Huge Liquor Scam In AP

అధికారులకు కలెక్టర్ ఆదేశాలు : ప్రస్తుతం అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మొక్కల పెంపకం ఉద్యమం ప్రారంభించారు. లక్ష మొక్కలు నాటే లక్ష్యంతో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించనున్నట్లు ప్రకటించారు. అయితే మొక్కల పెంపకానికి మళ్లీ అవినీతికి తెరలేపడానికి వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న అధికారులు సిద్ధమయ్యారు. ఇది గ్రహించిన కలెక్టర్ స్థానికంగా లభించే మొక్కలనే పెంచాలని మరెక్కడా మొక్కలు కొనడానికి వీలులేదని అధికారులను ఆదేశించారు.

ప్రజల సొమ్ము 'ధార' పోత - వాటర్‌ గ్రిడ్‌ పనుల్లో రూ.426.67 కోట్లు అక్రమంగా దోపిడీ - YSRCP Water Grid Scam

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.