ETV Bharat / state

4 కంటైనర్లలో రూ.2 వేల కోట్లు తరలింపు - ఏపీలోని పామిడి వద్ద పట్టుకున్న పోలీసులు - 2 thousand crores seized in AP - 2 THOUSAND CRORES SEIZED IN AP

2 thousand crores seized in AP : ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లాలో 4 కంటైనర్లలో రూ.2 వేల కోట్ల కరెన్సీ నోట్లను పోలీసులు పట్టుకున్నారు. 4 కంటైనర్లను తనిఖీ చేయగా, వాటిలో రూ.500 నోట్లు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వాటి విలువ సుమారు రూ.2 వేల కోట్లు ఉంటుందని సమాచారం. అయితే ఆ కంటైనర్లు ఆర్బీఐకి చెందినవిగా అధికారులు వెల్లడించారు.

2 thousand crores seized in AP
2 thousand crores seized in AP
author img

By ETV Bharat Telangana Team

Published : May 2, 2024, 3:02 PM IST

Updated : May 2, 2024, 3:40 PM IST

4 కంటైనర్లలో రూ.2 వేల కోట్లు తరలింపు - ఏపీలోని పామిడి వద్ద పట్టుకున్న పోలీసులు

2 thousand crores seized in AP : ఏపీలోని అనంతపురం జిల్లా పామిడి వద్ద 4 కంటైనర్ల కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. కొచ్చి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కంటైనర్లను ముందస్తు సమాచారంతో పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఒక్కో కంటైనర్​లో రూ.500 కోట్లు ఉన్నట్టుగా గుర్తించిన పోలీసులు, మొత్తం 4 కంటైనర్లలో రూ.2 వేల కోట్లు ఉన్నాయని తెలిపారు. పూర్తి రికార్డులు పరిశీలించిన అనంతరం, కొచ్చి ఆర్బీఐ నుంచి హైదరాబాద్ ఆర్బీఐకి కంటైనర్లు వెళ్తున్నాయని స్పష్టం చేశారు.

ఎన్నికల తనిఖీల్లో భాగంగా అనంతపురం జిల్లా జాతీయ రహదారిపై పామిడి సీఐ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో పోలీస్ స్టిక్కరింగ్​తో వెళ్తున్న 4 కంటైనర్లను గుర్తించిన పోలీసులు అనుమానం వచ్చి వాటిని ఆపారు. కంటైనర్​తో వస్తున్న సిబ్బందిని ప్రశ్నించగా, నాలుగు కంటైనర్లలో రూ.2000 కోట్లు ఉన్నట్లు చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో నగదు తరలిస్తుండటంతో వెంటనే స్థానిక పోలీసులు, జిల్లా కలెక్టర్​తో పాటుగా ఎన్నికల అధికారులు, ఇన్​కమ్ ట్యాక్స్ అధికారులకు సమాచారం అందించారు.

ఎన్నికల ప్రచారానికి కోట్లలో ఖర్చు - పైసలిస్తేనే ప్రచారానికి వస్తామంటున్న స్థానిక నేతలు - Lok Sabha Election 2024

అక్కడికి చేరుకున్న అధికారులు, డబ్బు కేరళ రాష్ట్రంలోని కొచ్చి ఆర్బీఐ నుంచి హైదరాబాద్​లోని ఆర్బీఐకి వెళ్తున్నట్లుగా గుర్తించారు. ఇందులో రూ.500 కోట్లు ఐసీఐసీఐ బ్యాంకు, రూ.500 కోట్లు ఐడీబీఐ బ్యాంకు, మరో రూ.1000 కోట్లు ఫెడరల్ బ్యాంకుకు చెందినవిగా పోలీసులు గుర్తించారు. ఈ మొత్తం డబ్బుకు సంబంధించి సరైన పత్రాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ ఉత్తర్వులతో వెళుతున్నట్లు రికార్డులు పరిశీలించి, ఆ కంటైనర్లను వదిలేశారు.

అనంతపురం జిల్లా పామిడి వద్ద 4 కంటైనర్లలో కరెన్సీని గుర్తించాం. ఒక్కో కంటైనర్​లో రూ.5 వందల కోట్లు ఉన్నట్టుగా గుర్తించాం. మొత్తం 4 కంటైనర్లలో రూ.2 వేల కోట్లు ఉన్నాయి. పూర్తి రికార్డులు పరిశీలించాం. పై అధికారులకు సమాచారం ఇచ్చాం. కొచ్చి ఆర్బీఐ నుంచి హైదరాబాద్ ఆర్బీఐకి కంటైనర్లు వెళ్తున్నాయి. ఈ డబ్బులు ఆర్బీఐకి చెందినవి. అందుకు సంబంధించి పూర్తి పత్రాలు ఉన్నాయి. సరైన పత్రాలు ఉండటంతో ఆ కంటైనర్లను వదిలిపెట్టాం. - పామిడి సీఐ

Huge Amount of Money Seized in Telangana : రాష్ట్రంలో ఎక్కడ చూసినా నోట్లకట్టలే.. ఇప్పటి వరకు రూ.168 కోట్లు సీజ్

Last Updated : May 2, 2024, 3:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.