Constable Candidates Fake Bonafides : తప్పుడు బోనోఫైడ్ పత్రాలు సమర్పించిన కానిస్టేబుల్ అభ్యర్థుల జాబితాను తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలికి పంపారు. నియామక ప్రక్రియ విధివిధానాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి నకిలీ పత్రాలతో ఉద్యోగాలు పొందే ప్రయత్నం చేసినందున టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ(TSLPRB) సూచన మేరకు తదుపరి చర్యలు ఉండనున్నాయి. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తే నకిలీ బోనఫైడ్లు ఇచ్చిన పాఠశాలలు, తీసుకున్న అభ్యర్థుల మీద కేసులు నమోదు చేసే అవకాశముంది.
Telangana Constable Recruitment : ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 46 ప్రకారం జనాభా ప్రాతిపదికన నియామకాలు చేపడతారు. ఈ లెక్కన హైదరాబాద్ పరిధిలో ఎక్కువ పోస్టులుంటాయి. ఇదే సమయంలో పోటీ కొంత తక్కువగానూ ఉంటుంది. దీన్ని అవకాశంగా తీసుకున్న కొందరు అభ్యర్థులు హైదరాబాద్ పరిధిలోని పాఠశాలల్లో చదవకున్నా, ఇక్కడ ప్రాథమిక విద్య చదివినట్లు నకిలీ బోనఫైడ్లు తీసుకుని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీకి సమర్పించారు.
కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తున్న క్రమంలో దాదాపు 350 మంది దాకా రెండు జిల్లాల్లో ప్రాథమిక విద్య చదివినట్లు బోనఫైడ్లు సమర్పించారు. అనుమానాస్పదంగా భావించిన అధికారులు తాత్కాలికంగా పక్కనబెట్టి రెండోసారి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని నిర్ణయించారు. అభ్యర్థులు సమర్పించిన బోనఫైడ్ల ఆధారంగా చదివిన పాఠశాల, ఆ సమయంలోని రిజిస్టర్లు, ఇతర ఆధారాలతో పోల్చి చూడగా దాదాపు 290 మందివి నిజమేనని తేలింది. 60 మంది మాత్రం ఉద్దేశపూర్వకంగా నకిలీవి ఇచ్చినట్లు బయటపడింది. హైదరాబాద్ స్థానికత చూపించి ఉద్యోగాలు దక్కించుకునేందుకు ఈ పని చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
టీఎస్పీఎస్సీ గ్రూప్ ఎగ్జామ్స్ తేదీలు విడుదల - ఆగస్టులో గ్రూప్2 పరీక్షలు
పోలీస్ నియామాకాల్లో ఎంపికైన 16,604 మంది అభ్యర్థులకు హైదరాబాద్ ఎల్బీస్టేడియం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి(CM REVANTH) నియామక పత్రాలు అందించారు. వీరిలో సివిల్, ఏఆర్, ఎస్ఏఆప్సీపీఎస్, టీఎస్ఎస్పీ విభాగాలకు 13వేల 444 మంది కానిస్టేబుళ్లను ఎంపిక చేశారు. రాష్ట్రంలోని 28 శిక్షణ కేంద్రాల్లో ట్రెయినింగ్ ఇస్తున్నారు. దాదాపు 11వేల మంది శిక్షణకు సరిపడ వసతులే ఉండడంతో టీఎస్ఎస్పీ విభాగం కానిస్టేబుళ్ల శిక్షణను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇందుకోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్పీఎఫ్తో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక పోలీస్ శాఖలకు లేఖలు రాసిన అధికారులు అక్కడి కేంద్రాల్లో అనుమతివ్వాలని కోరారు. కుదరని పక్షంలో 9 నెలల పాటు జరిగే ఇతర కానిస్టేబుళ్ల శిక్షణ పూర్తి అయ్యే వరకు వేచి ఉండాల్సిందే.
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల - పోస్టుల వివరాలు ఇవే
రాష్ట్రంలోని 65 ఐటీఐలలో స్కిల్ కేంద్రాల ఏర్పాటు - టాటా టెక్నాలజీస్‌తో ప్రభుత్వం ఒప్పందం