ETV Bharat / state

జీహెచ్​ఎంసీలో బోణీ కొట్టిన కాంగ్రెస్ - కంటోన్మెంట్‌లో హస్తం అభ్యర్థి విజయం - CONGRESS WINS CANTONMENT BY ELECTION - CONGRESS WINS CANTONMENT BY ELECTION

Secunderabad Cantonment By Election Result : జీహెచ్​ఎంసీ పరిధిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. గత ఎన్నికల్లో సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ శాసనసభ నియోజకవర్గ బీజేపీ తరఫున పోటీ చేసి పరాజయం పాలైన శ్రీగణేశ్ ఈసారి కాంగ్రెస్ చెంతన చేరి ఉపఎన్నికలో విజయం సాధించారు.

Secunderabad Cantonment By Election
Secunderabad Cantonment BY Election Result 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 4, 2024, 6:41 PM IST

Secunderabad Cantonment By Election Result 2024 : రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్​ ప్రక్రియ ఉత్కంఠగా కొనసాగింది. 17 లోక్​సభ స్థానాలతో పాటు జరిగిన సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నిక లెక్కింపు ప్రక్రియ కూడా జరిగింది. ఈ ఎన్నికలో అధిక మెజారిటీతో కాంగ్రెస్​ అభ్యర్థి శ్రీగణేశ్ గెలిచారు. దీంతో జీహెచ్​ఎంసీ పరిధిలో హస్తం పార్టీ బోణి కొట్టినట్లయింది. బీఆర్ఎస్​ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలో బీఆర్ఎస్​ తరఫున లాస్య నందిత సోదరి నివేదిత, బీజేపీ అభ్యర్థిగా టీఎన్​. వంశ తిలక్​ సహా 15 మంది పోటీలో పాల్గొన్నారు.

Cantonment Assembly By Election Counting 2024 : ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో మే 13వ తేదీన ఉపఎన్నిక పోలింగ్ జరిగింది. అందులో 2,53,706 మంది ఓటర్లు ఉంటే 1,30,929 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో 47.85 శాతం ఓట్లు పోలవగా, ఈసారి 51.61 శాతం నమోదైంది. మొత్తం 17 రౌండ్లలో ఓట్లు లెక్కింపులో భాగంగా 14 టేబుళ్లు ఈసీ ఏర్పాటు చేసింది. ఉదయం 8 గంటల నుంచి పోస్టల్​ బ్యాలెట్​ ఓట్ల లెెక్కింపుతో ప్రక్రియ మొదలైంది. అనంతరం పలు రౌండ్లలో జరిగిన లెక్కింపులో చివరగా కాంగ్రెస్​ అభ్యర్థి విజేతగా నిలిచారు.

అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే కౌంటింగ్ ప్రక్రియ - ఎలా జరుగుతుందో మీకు తెలుసా? - Vote Counting Process in India

Secunderabad Cantonment Winner : కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న మృతితో 2023లో జరిగిన ఎన్నికల్లో ఆయన కుమార్తె లాస్య నందిత బీఆర్ఎస్​ తరుఫున పోటీ చేసి విజయం సాధించారు. కొన్ని నెలలకే రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మళ్లీ ఆ పార్టీ తరఫున సాయన్న చిన్న కుమార్తె నివేదిత బరిలో నిలవగా, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన శ్రీగణేశ్ ఈ సారి కాంగ్రెస్‌ నుంచి రంగంలోకి దిగారు. బీజేపీ తరఫున వంశతిలక్‌ పోటీ చేశారు.

Telangana BY Election Result 2024 : 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు రాలేదు. అందుకే కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల్లో విజయం సాధించి బోణీ కొట్టాలనే దృఢ సంకల్పంతో ప్రచారం చేసి ఎట్టకేలకు విజయం సాధించింది. మరోవైపు పట్టు కోల్పోరాదని బీఆర్ఎస్, బీజేపీ తీవ్రంగా శ్రమించినా ఎట్టకేలకు ఈ స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

కంటోన్మెంట్‌ నియోజకవర్గాన్ని నిలబెట్టుకోవడానికి అంతా సహకరించాలి : నివేదిత - Cantonment by Election

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.