ETV Bharat / state

13 స్థానాల అభ్యర్థుల కోసం కాంగ్రెస్​ కసరత్తు - హైదరాబాద్​ సీటుపై స్పెషల్​ ఫోకస్​

Congress MP Candidates List in Telangana : లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే 13 లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల బలాబలాలపై అభిప్రాయాలు తీసుకున్న రాష్ట్ర నాయకత్వం లోతైన అధ్యయనం చేస్తోంది. బీఆర్​ఎస్​, బీజేపీలకు చెందిన నాయకులు టచ్‌లోకి వస్తుండటంతో ఆచితూచి ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Lok Sabha Elections 2024
Congress Focus On MP Candidates List
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 15, 2024, 9:38 AM IST

13స్థానాల అభ్యర్థుల కోసం కాంగ్రెస్​ కసరత్తు హైదరాబాద్​ సీటుపై స్పెషల్​ ఫోకస్​

Congress MP Candidates List in Telangana : రాష్ట్రంలో అత్యధిక లోక్‌సభ స్థానాలు తమ ఖాతాలో వేసుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌ నాయకత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. నాలుగుచోట్ల ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన అధిష్ఠానం మిగిలిన 13 స్థానాలకు బలమైన వారిని రంగంలోకి దించేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. టికెట్లు ఆశించిన నాయకుల్లో చాలా నియోజకవర్గాల్లో ఆశించిన మేర బలంగా లేరన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Telangana Congress Lok Sabha Candidates 2024: నియోజకవర్గాలవారీగా తీసుకుంటే ఎంఐఎం ప్రాతినిథ్యం వహిస్తున్న హైదరాబాద్‌పైన కాంగ్రెస్‌ గట్టిగానే గురి పెడుతోంది. సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీసీ నాయకులను బరిలో దించాలనే ఆలోచనతో మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ను పార్టీలోకి తీసుకున్నారు. ఆ నియోజకవర్గం నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కొందరు నాయకులను బుజ్జగించి ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మల్కాజిగిరి నియోజకవర్గం సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) సిట్టింగ్‌ స్థానం కావడం వల్ల అక్కడ నుంచి ఎవరిని పోటీలో దింపాలన్న విషయాన్ని అధిష్ఠానం పూర్తిగా ఆయనకే వదిలేసింది.

చేవెళ్ల నుంచి బరిలో దించేందుకు వికారాబాద్‌ జిల్లా ఛైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చారు. ఆమెనే బలమైన నాయకురాలిగా స్థానిక నేతల మద్దతు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మెదక్‌ నుంచి పోటీ చేసేందుకు కొందరు స్థానికులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ నీలం మధు వైపే రాష్ట్ర నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా గౌడ్‌ తాను పోటీకి సిద్దమని ముందుకు వస్తున్నారు. వీరిద్దరిలో ఎవరికో ఒకరికి అవకాశం దక్కొచ్చని పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

MSPకి చట్టబద్ధత, శాశ్వత రుణమాఫీ కమిషన్- కాంగ్రెస్‌ 'కిసాన్‌ న్యాయ్‌' 5 గ్యారంటీలు

నాగర్‌కర్నూల్‌ నుంచి మల్లు రవికి సర్వేలతోపాటు స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్‌ నుంచి ప్రవీణ్‌కుమార్‌ రెడ్డితోపాటు వ్యాపారి రాజేందర్‌ టికెట్‌ కోసం పోటీపడుతున్నారు. వీరిద్దరిపై సర్వేలు చేస్తున్నట్లు సమాచారం. పెద్దపల్లి (Peddapalli MP Ticket) నుంచి గడ్డం వివేక్‌ కుమారుడు గడ్డం వంశీకే టికెట్‌ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయన అభ్యర్థిత్వాన్ని కొందరు ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తూ ఏఐసీసీ పెద్దలకు ఫిర్యాదు చేశారు.

Lok Sabha Elections 2024 Telangana : భువనగిరి నుంచి పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి పోటీ చేసేందుకు కొంతకాలంగా క్షేత్రస్థాయిలో పని చేసుకుంటూ పోతున్నారు. తాజాగా ఆయనతోపాటు కొత్తగా పార్టీలోకి వచ్చేందుకు కొందరు చొరవ చూపుతున్న వేళ టికెట్‌ ఎవరికి దక్కుతుందోనే ఉత్కంఠ నెలకొంది. నిజామాబాద్‌ (Nizamabad Congress MP Seat) నుంచి ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డికి టికెట్‌ ఇచ్చేందుకు పార్టీ సుముఖంగా ఉన్నప్పటికీ అక్కడి టికెట్‌ కోసం మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ గట్టిగా పట్టుబడుతున్నారు. ఆదిలాబాద్‌ నుంచి పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌ చొరవ చూపుతున్నారు. ఇక్కడ ఇంతకంటే బలమైన నాయకులు ఎవరైనా పార్టీలోకి వస్తారా అన్న కోణంలో వేచి చూస్తున్నారు.

ఖమ్మం స్థానానికి (Khammam Congress MP Seat ) అత్యధిక మంది పోటీ పడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు పొంగులేటి, తుమ్మల కుటుంబాల నుంచి టికెట్‌ ఆశిస్తున్నారు. ఖమ్మం అభ్యర్థి ఎంపిక బాధ్యత ఏఐసీసీకి అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 18న కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. అదేరోజు లేదా మరుసటి రోజున అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

4 వివాదరహిత స్థానాలకు ఎంపీ అభ్యర్థుల ప్రకటన - మిగిలిన సీట్లపై కాంగ్రెస్ కసరత్తు

లోక్​సభ అభ్యర్థుల ఎంపికపై నేతల అభిప్రాయ సేకరణ చేస్తున్న కాంగ్రెస్​ అధిష్ఠానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.