Congress allegations against CM Jagan: సీఎం జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టారని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ పల్లంరాజు(Pallam Raju) ఆరోపించారు. విజయవాడ(Vijayawada) ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం అయ్యింది. పల్లంరాజు మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆధారంగా కాంగ్రెస్(Congress) మేనిఫెస్టో రూపకల్పన చేయనున్నట్లు తెలిపారు. సీఎం జగన్ పోలవరం ప్రాజెక్ట్(Polavaram Project)ను నిర్లక్ష్యం చేశారన్నారని ఆరోపించారు. రెండు పోర్టులను ప్రైవేటీకరించారని, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ(Visakha Steel)ని అమ్మేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సీపీఐ, సీపీఎంలు కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్నాయని పల్లంరాజు పేర్కొన్నారు. ఇరుపార్టీలతో చర్చించాక ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు.
బహిరంగ సభలో ప్రకటిస్తాం: జిల్లాకు ఏం చేశారో చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) సిద్దమా, అని మాజీ మంత్రి శైలజానాథ్ సవాల్ విసిరారు. అనంతపురంలో ఈ నెల 26న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలరెడ్డి(YS Sharmila) హాజరవుతారని తెలిపారు. దేశ, రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాల్సిన అవసరం ఉందని శైలజానాథ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అనంతపురం(Anathapur) జిల్లాలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల వివరాలను బహిరంగ సభలో ప్రకటిస్తామని తెలిపారు. సీఎం జగన్ అనంతపురం జిల్లాకు చేసిన అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్ పాలనలో జిల్లాకు తాగు, సాగు నీరు అందించేందుకు శాయశక్తులా కృషి చేసినట్లు శైలజానాథ్ తెలిపారు. అనంతపురానికి సీఎం జగన్(CM Jagan) ఏం చేశాడో చెప్పడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. రాప్తాడు ముఖ్యమంత్రి సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడిని ఖండించారు. పాత్రికేయులపై దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. హింసను ప్రేరేపించే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
సీఎం జగన్ చేతకానితనం - 'కోమా'లో ట్రామాకేర్ సెంటర్స్ !
చింతా మోహన్ ఆగ్రహం: సీఎం జగన్ ప్రభుత్వం పూర్తి అవినీతిమయంగా మారిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్(Chinta Mohan) ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు, రాజధాని, జర్నలిస్టులపై దాడులు అనే అంశంపై హైదరాబాద్ సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చింతా, విభజన తరువాత టీడీపీ, వైఎస్సార్సీపీ పరిపాలన వల్ల ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిందన్నారు. ఏపీ రాజధానిగా తిరుపతి ఉండాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండించిన చింతమోహన్, దాడులను అరికట్టడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తింగా విఫలమైందన్నారు. మోదీ దేశానికి చేసిందేమీ లేదని, కాంగ్రెస్ హయంలో జరిగిన అభివృద్దే ఇప్పుడు కనిపిస్తుందన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ లో పెను మార్పులు వచ్చాయని పేర్కొన్నారు.
'కుట్రతో కృష్ణపట్నం పోర్టు తరలింపు'- నిమ్మకునీరెత్తినట్లుగా అధికారులు