ETV Bharat / state

పాశమైలారంలో కాలుష్య వ్యర్థాల శుద్ధి కర్మాగారం ఏర్పాటు - మంత్రులతో కలిసి ప్రారంభించిన స్పీకర్ - Congress Leaders Inaugurate CETP

Congress Leaders Inaugurate CETP at Sangareddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో రూ.104 కోట్లతో నిర్మించిన జీరో లిక్విడ్ డిశ్చార్జ్ కామన్ ఎఫ్లెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్(ZLD-CETP)ను మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖలతో కలిసి ఆయన ప్రారంభించారు.

Congress Govt Focus on Development
Congress Leaders Inaugurate CETP at Sangareddy
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 9, 2024, 10:06 PM IST

Congress Leaders Inaugurate CETP at Sangareddy : సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలో రూ.104 కోట్లతో నిర్మించిన కాలుష్య వ్యర్థాల శుద్ధి కర్మాగారాన్ని మంత్రులతో కలిసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ఏషియాలో నెంబర్ వన్‌గా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ కామన్ ఎఫ్లెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంటును(ZLD-CETP) ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించాలని, కానీ పని ఒత్తిడితో ఆయన రాలేకపోయారని, అందువల్ల మంత్రులతో కలిసి తాను ప్రారంభించినట్లు స్పీకర్‌ తెలిపారు. దీనితో వాతావరణ కాలుష్యం లేకుండా చేస్తుందని, ఇది మంచి పరిణామం అన్నారు.

గత ప్రభుత్వం పదేళ్లు పాలన చేసినా సక్రమంగా చేయలేదని దుయ్యబట్టారు. పదేళ్లలో దొరకని అనుమతులు 80 రోజుల్లో ఇచ్చేలా తమ ప్రభుత్వం పని చేసిందన్నారు. పారిశ్రామిక వాడలో నీటి సమస్యలు తీర్చాలని మంత్రి దామోదర రాజనర్సింహను(Minister Damodara Rajanarsimha) కోరుతున్నట్లు ఆయన చెప్పారు. రోజురోజుకు వాతావరణ కాలుష్యం పెరిగిపోతుందని, భావితరాల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.

దేశానికే దిక్సూచిగా మారనున్న ప్రాజెక్ట్‌ : పరిశ్రమలు పెరిగేకొద్దీ కాలుష్యం పెరిగిపోతుందన్నారు. పెరిగిన కాలుష్యం నివారించడం కష్టతరమైన పని, ముందుగానే నివారించే చర్యలు తీసుకోవాలన్నారు. సాంకేతికతను ఉపయోగించి కాలుష్యాన్ని నివారించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతం అయితే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం(Central Govt) ప్లాంట్లు ఏర్పాటు చేసే ప్లాన్‌లో ఉందని తెలిపారు. ఇది విజయవంతం అవుతుందని మంత్రి కొండా సురేఖ భావిస్తున్నాని చెప్పారు.

టీఎస్​ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్​న్యూస్ - పీఆర్సీ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

పాశమైలారం పారిశ్రామికవాడలో 540 పరిశ్రమలు ఉండగా 500 పరిశ్రమలు నడుస్తున్నాయని, ఇందులో 60 రసాయన పరిశ్రమలు ఉన్నాయని ఈ కాలుష్య జలాల శుద్ధి కర్మాగారం ఏర్పాటుతో జీరో పొల్యూషన్ ఉంటుందన్నారు. వరంగల్‌లో కూడా పరిశ్రమల ప్రారంభించక ముందే ఇలాంటి ప్లాంట్ ప్రారంభించాలని కోరారు. పాశమైలారం ప్లాంట్‌కు పర్యావరణ శాఖ(Environment Department) నుంచి రూ.25 కోట్లు కేటాయించామని, అందులో ఇప్పటికే రూ.12.5 కోట్లు విడుదల చేసామని త్వరలోనే మిగతావి విడుదల చేస్తామని తెలిపారు.

CEPT Launch with Goal of Zero Pollution : పాశమైలారం పారిశ్రామిక వాడలో ప్రైవేటుగా ఉన్న మూడు ఫైర్ స్టేషన్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని ప్రభుత్వం టేకోవర్ చేసుకుని, సిబ్బంది కేటాయించేలా చూస్తానని తెలిపారు. ఎటువంటి స్కిల్ డెవలప్‌మెంట్ వారు కావాలో తెలిపితే నియోజకవర్గాల్లో శిక్షణ ఇప్పించి అందించేలా చర్యలు తీసుకుంటాంమని మంత్రి సురేఖ తెలిపారు.

రూ.104 కోట్లతో నిర్మించడం ప్రధాన పాత్ర రాంకీ సంస్థ పోషించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్య కావడం సంతోషం అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఫ్యాక్టరీలకు సంబంధించిన భూములు కమర్షియల్(Commercial Land), రెసిడెన్షియల్ అవసరాలకు వినియోగిస్తున్నారు. దీనిపై సీరియస్‌గా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని రంగాలు ఒక కుటుంబంలా ఎదగాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందని తెలిపారు.

'సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చాం - ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టే దమ్ము ఎవరికైనా ఉందా?

హైదరాబాద్​ అభివృద్ధికి అడ్డుపడే వారికి నగర బహిష్కరణ : సీఎం రేవంత్‌ రెడ్డి వార్నింగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.