ETV Bharat / state

వివేకా హత్య కేసులో సాక్ష్యాలు తుడిచేస్తుంటే అవినాష్‌ ఎందుకు మౌనంగా ఉన్నారు: వైఎస్‌ షర్మిలారెడ్డి - YS Sharmila Election Campaign - YS SHARMILA ELECTION CAMPAIGN

YS Sharmila Election Campaign In kadapa : వైఎస్‌ షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప యోగి వేమన వర్సిటీ ప్రాంగణంలో ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలో రాగానే ఉపాధి హామీ కూలీల వేతనం పెంచుతామని హామీ ఇచ్చారు. వివేకా హత్య కేసులో సాక్ష్యాలు తుడిచేస్తుంటే అవినాష్‌ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

YS Sharmila Election Campaign In kadapa
YS Sharmila Election Campaign In kadapa (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 7, 2024, 2:49 PM IST

YS Sharmila Election Campaign In kadapa : ఎన్నికలు దగ్గర పడుతుండటంలో వైఎస్సార్‌ జిల్లా కమలాపురంలో వైఎస్‌ షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప యోగి వేమన వర్సిటీ ప్రాంగణంలో ఉపాధి హామీ కూలీలతో షర్మిల ముఖాముఖి నిర్వహించారు. కూలీల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. వారికి భరోసా నింపేందుకు పలుగు, పార పట్టి మట్టి తవ్వారు. కాంగ్రెస్ అధికారంలో రాగానే ఉపాధి హామీ కూలీల వేతనం రూ.400కు పెంచుతాం హామీ ఇచ్చారు. సీఎం జగన్ బటన్ నొక్కుతున్నా అంటూ ఉన్నది గుంజుకున్నారని, ఒక చేత్తో మట్టి చెంబు ఇచ్చి మరో చేత్తో వెండి చెంబు తీసుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కడప వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు.

షర్మిలపై కేసు పెట్టిన ఏపీ పోలీసులు- వివేకా హత్యపై మాటలే కారణమట! - case filed on ys sharmila

అవినాష్‌ను చిన్నపిల్లోడు, అమాయకుడు అని జగన్‌ అంటున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. వివేకా హత్య కేసులో సాక్ష్యాలు తుడిచేస్తుంటే అవినాష్‌ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. అవినాష్‌రెడ్డి అమాయకుడని రవీంద్రనాథ్‌రెడ్డి, జగన్‌ ఇద్దరూ చెబుతున్నారని, వీళ్లను అమాయకులంటే ఎవరైనా నమ్ముతారా? అని నిలదీశారు.

వివేకా హత్య కేసులో సాక్ష్యాలు తుడిచేస్తుంటే అవినాష్‌ ఎందుకు మౌనంగా ఉన్నారు:వైఎస్‌ షర్మిలారెడ్డి (ETV Bharat)

అధికారం వాడుకుని హంతకులు తప్పించుకోవడానికి వీల్లేదు: పీసీసీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల - PCC President Sharmila Campaign

కడప స్టీల్‌ప్లాంట్‌పై పార్లమెంటులో ఎంపీ అవినాష్‌ ఒక్కసారైనా మాట్లాడారా? వివేకా హత్య జరిగినరోజు ఎవరు చంపారో తమకు కూడా తెలియదని, అవినాష్‌ హస్తం ఉందని, సాక్ష్యాలు, ఆధారాలు సీబీఐ సేకరించాకే తెలిసిందని తెలిపారు. హత్య చేసిన వాళ్లతో హత్య చేయించిన అవినాష్‌ కలిసినట్లు సాక్ష్యాలు బయటపెట్టారని అన్నారు. అవినాష్‌ ఎవరెవరితో మాట్లాడారో ఫోన్‌ కాల్‌ రికార్డులు స్పష్టం చేశాయని తెలిపారు. రూ.40 కోట్లు డబ్బులు చేతులుమారాయని ఆధారాలు చూపుతున్నాయని, ఇన్ని సాక్ష్యాలు, ఆధారాలున్నా ఐదేళ్లుగా అవినాష్‌పై ఒక్క చేయి కూడా పడలేదెందుకు? అని నిలదీశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే అధికారాన్ని అడ్డమేసి మరీ అవినాష్‌ను కాపాడుతున్నారని, అవినాష్‌ అరెస్టుకు కర్నూలుకు సీబీఐ అధికారులు వెళ్తే అడ్డుకున్నారని గుర్తు చేశారు.

న్యాయానికి, నేరానికి జరుగుతున్న పోరాటం - కడపలో గెలిచేది నేనే: షర్మిల - YS Sharmila Interview

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.