ETV Bharat / state

Live Update :ఇది కాంగ్రెస్‌ మేనిఫెస్టో మాత్రమే కాదు - ప్రజల ఆత్మ : రాహుల్‌ గాంధీ - Congress Jana Jatara Sabha

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 6, 2024, 6:48 PM IST

Updated : Apr 6, 2024, 8:22 PM IST

Congress Jana Jatara Sabha at Thukkuguda Live Updates : పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాలను రచిస్తోంది. అందులో భాగంగా తుక్కుగూడలో కాంగ్రెస్‌ జనజాతర సభ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. జనజాతర సభకు రాహుల్‌గాంధీ ఇప్పుడే చేరుకున్నారు.

Live Update
Live Update

08.21 PM

లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలి : సీఎం రేవంత్‌

లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలి. జూన్‌ 9న దిల్లీలో మువ్వెన్నల జెండా ఎగరాలి. బీఆర్‌ఎస్‌ను తుక్కుతుక్కుగా ఎలా ఓడించామో బీజేపీను అలాగే ఓడించాలి. కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలి.కార్యకర్తల కష్టం వల్లే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. గుజరాత్‌ మోడల్‌పై వైబ్రెంట్‌ తెలంగాణ ఆధిపత్యం చూపిస్తోంది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారు. పదేళ్లలో మోదీ 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు 17 నెలలు పోరాడారు. నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ 750 మంది రైతులు చనిపోయారు. 750 మంది రైతులు చనిపోతే వాళ్ల కుటుంబాలను మోదీ పరామర్శించలేదు.

08.09 PM

బీఆర్‌ఎస్‌ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని తెచ్చిపోయింది : డిప్యూటీ సీఎం భట్టి

బీఆర్‌ఎస్‌ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని తెచ్చిపోయిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒకటో తేదీన ఉద్యోగస్థులకు జీతాలు ఇచ్చిందని చెప్పారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని ఉపముఖ్యమంత్రి చెప్పారు. రాహుల్‌ నిరంతర పర్యవేక్షణ వల్లే ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించామన్నారు. ప్రజలందరికీ న్యాయం జరగాలనే న్యాయపత్రం విడుదల చేశామని చెప్పారు.

08.03 PM

కాంగ్రెస్‌పై కేసీఆర్‌ బురద జల్లేందుకు యత్నించారు : మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

'కాంగ్రెస్‌పై కేసీఆర్‌ బురదజల్లేందుకు యత్నిస్తున్నారు. కేసీఆర్‌ ఉన్నప్పుడూ వర్షాలు పడలేదు. కృష్ణా, గోదావరి జలాల్లో కేసీఆర్‌ లూటీ చేశారు. 4 నెలలు ఫామ్‌హౌజ్‌లో ఉండి కేసీఆర్‌ ఇప్పుడు బయటకొచ్చారు. పదేళ్లపాటు బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రజలను మోసం చేశాయి.'

08.00 PM

'మేడిన్‌ చైనా' కంటే మిన్నగా 'మేడిన్‌ తెలంగాణ' కావాలి : రాహుల్‌

ప్రజల స్వప్నం సాకారం చేసేందుకు రాష్ట్రాన్ని ఇచ్చాం. ఈ కొత్త రాష్ట్రం దేశానికే మార్గం చూపించాలి. 'మేడిన్‌ చైనా' కంటే మిన్నగా 'మేడిన్‌ తెలంగాణ' కావాలి. దేశంలో బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతోంది. మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ, తెలంగాణ సందేశాన్ని దేశం మెుత్తం చెబుతా.

07.57 PM

తెలంగాణ ప్రజల సిపాయిలాగా దిల్లీలో ఉంటా : రాహుల్‌

నాకు, ప్రజలకు ఉన్న సంబంధం రాజకీయాలకు అతీతం. నాకు, ప్రజలకు ఉన్న సంబంధం కుటుంబసంబంధం. తెలంగాణ ప్రజల సిపాయిలాగా దిల్లీలో ఉంటా. నా జీవితాంతం చిన్నపిల్లలు పిలిచినా తెలంగాణ వస్తాం.

07.55 PM

ఈ 5 గ్యారంటీలే కాదు యువత కోసం మరో 5 గ్యారంటీలు ఉన్నాయి : రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ వద్ద ప్రేమ, స్వచ్ఛత ఉన్నాయి. కాంగ్రెస్‌ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది. ఈ 5 గ్యారంటీలే కాదు యువత కోసం మరో 5 గ్యారంటీలు ఉన్నాయి. మహిళల కోసం మరో 5 గ్యారంటీలు ఉన్నాయి. రైతులు, బీసీలకు కూడా మరో 5 గ్యారంటీలు ఉన్నాయి. భారత్‌ ముఖచిత్రాన్ని మార్చే మేనిఫెస్టో. ఇది కాంగ్రెస్‌ మేనిఫెస్టో మాత్రమే కాదు-ప్రజల ఆత్మ. మా మేనిఫెస్టోను జాగ్రత్తగా పరిశీలిచండి.

07.52 PM

రాజ్యాంగాన్ని రద్దు చేసే ఆలోచన బీజేపీ చేస్తుంది : రాహుల్‌ గాంధీ

'ఎలక్ట్రానిక్‌ బాండ్ల రూపంలో ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్‌ జరిగిందని రాహుల్‌ గాంధీ అన్నారు. ఎలక్ట్రానిక్‌ బాండ్ల జాబితా చూస్తే ఏం జరిగిందో మీకే అర్థమవుతుందని తెలిపారు. ముందు సీబీఐ బెదిరిస్తుంది వెంటనే ఆ కంపెనీ బాండ్లు కొంటుంది. కాంగ్రెస్ బ్యాంక్‌ ఖాతాలనూ స్థంభింపజేశారు. కాంగ్రెస్ బ్యాంక్‌ ఖాతాలనూ స్థంభింపజేసినా భయపడం. తెలంగాణలో బీజేపీ బీ టీమ్‌ను ఓడించాం. ఇప్పుడు కేంద్రంలో భాజపానే ఓడిస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీల రక్షణ రాజ్యాంగం ద్వారానే సాధ్యం. రాజ్యాంగాన్ని రద్దు చేసే ఆలోచన బీజేపీ చేస్తుంది. మోదీ కేవలం 3 శాతం మంది కోసం పనిచేస్తున్నారు. మోదీ వద్ద ధనం, సీబీఐ, ఈడీ ఉన్నాయి.'

07.48 PM

గత సీఎం వేలాది మంది ఫోన్లు ట్యాప్‌ చేశారు : రాహుల్‌ గాంధీ

"గత సీఎం ఎలా పనిచేశారో మీకందరికీ తెలుసునని రాహుల్‌ గాంధీ అన్నారు. గత సీఎం వేలాది మంది ఫోన్లు ట్యాప్‌ చేయించారన్నారు. గతం సీఎం రెవెన్యూ, ఇంటిలిజెన్స్‌ వ్యవస్థలను దుర్వినియోగం చేశారు. ట్యాపింగ్‌ ఆధారాలు దొరక్కుండా నదుల్లో పడేశారన్నారు. బెదిరించి, భయపెట్టి బలవంతపు వసూళ్లుకు పాల్పడ్డారన్నారు.దేశ సామాజిక పరిస్థితిని అంచనా వేసేందుకు జనగణన చేపడతాం. జనగణనతో ఎవరి భాగస్వామ్యం ఎంతో తేలిపోతుంది. ఆర్థిక, సంస్థాగత సర్వేలు కూడా చేపడతాం. ఈ సర్వేల ద్వారా దేశంలో సంపద ఎవరి చేతుల్లో ఉందో తేలుతుంది. అన్ని రంగాల్లో మీకు దక్కాల్సిన హక్కు మీకు దక్కుతుంది."

07.43 PM

దేశంలో జనగణన చేపడతాం : రాహుల్‌ గాంధీ

'జనాభాలో ఓబీసీలు 50 శాతం ఐఏఎస్‌ల్లో ఓబీసీల వాటా 3 శాతం. బడ్జెట్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం ఖర్చు పెట్టేది 6 శాతమే. దేశంలో 90 శాతం జనాభాకు సరైన అవకాశాలు లేవు. దేశ సామాజిక పరిస్థితిని అంచనా వేసేందుకు జనగణన చేపడతాం. జనగణనతో ఎవరి భాగస్వామ్యం ఎంతో తేలిపోతుంది. ఆర్థిక, సంస్థాగత సర్వేలు కూడా చేపడతాం. ఈ సర్వేల ద్వారా దేశంలో సంపద ఎవరి చేతుల్లో ఉందో తేలుతుంది.'

07.41 PM

ఉపాధి హామీ కూలీలకు వేతనం పెంపు : రాహుల్‌

ఉపాధి హామీ కూలీలకూ వేతనం పెంపు ఉంటుందని రాహుల్‌ గాంధీ చెప్పారు. దేశంలో 50 శాతం జనాభా బీసీలు, 15 శాతం ఎస్సీలు ఉన్నారన్నారు. దేశంలో 8 శాతం ఎస్టీలు, 15 శాతం మైనార్టీలు ఉన్నారని తెలిపారు. దేశంలో 90 శాతం పేదలే, దేశంలో ఏ సంస్థలో చూసినా ఈ 90 శాతం మంది కనిపించరని ఆవేదన చెందారు. దేశంలోని ఏ పెద్ద కంపెనీ యజమానుల్లోనూ ఈ 90 శాతం కనిపించరన్నారు. జనాభాలో 50 శాతం ఐఏఎస్‌ల్లో 3 శాతం మాత్రమే బీసీలు ఉన్నారు. జాతీయ స్థాయిలో కనీస వేతనం రూ.400కు పెంచుతామని రాహుల్‌ గాంధీ అన్నారు.

07.38 PM

స్వామినాథన్‌ సిఫార్సులను అనుసరించి పంటలకు మద్దతు ధర : రాహుల్‌ గాంధీ

'ఇకపై దేశంలో ఏ కుటుంబానికి ఏటా రూ.లక్ష ఆదాయ కంటే తక్కువ ఉండదు. మోదీ ప్రభుత్వం ధనవంతులకే రూ.16 లక్షల కోట్లు రుణమాఫీ చేసింది. రైతులకు ఒక్క రూపాయి కూడా మోదీ ప్రభుత్వం మాఫీ చేయలేదు. స్వామినాథన్‌ సిఫార్సులను అనుసరించి పంటలకు మద్దతు ధర. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తాం.'

07.34 PM

మహిళలకు ఏటా రూ.లక్ష ఇస్తాం : రాహుల్‌ గాంధీ

మహిళ న్యాయం ద్వారా మహిళలకు ఏటా రూ.లక్ష ఇస్తామని రాహుల్‌ గాంధీ వెల్లడించారు. మహిళలకు ఏటా రూ.లక్ష విప్లవాత్మక పథకం అని అన్నారు. మహిళలకు ఏటా రూ.లక్ష నేరుగా బ్యాంకులో వేస్తామన్నారు. ఇకపై దేశంలో ఏ కుటుంబానికి ఏటా రూ. లక్ష ఆదాయం కంటే తక్కువ ఉండదని వివరించారు.

07.29 PM

యువతకు ఏడాదికి రూ.లక్ష ఆదాయం వచ్చేలా ఉపాధి : రాహుల్‌ గాంధీ

మరో 50 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని రాహుల్‌ గాంధీ అన్నారు. ప్రజల హృదయాల నుంచి పుట్టిందే మా గ్యారంటీల పత్రం అని తెలిపారు. జాతీయ మేనిఫెస్టోలో ఐదు గ్యారంటీలు ఉన్నాయని పేర్కొన్నారు. యువతకు ఏడాదికి రూ.లక్ష వచ్చేలా ఉపాధి కల్పిస్తామన్నారు. విద్యావంతులైన యువకులకు సంవత్సరం పాటు నెలకు రూ.8500 ఇస్తాం. యువకులకు నెలకు రూ.8500తో సంవత్సరం పాటు శిక్షణ. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఏటా రూ.లక్ష ఇస్తాం.

07.27 PM

అమలు చేయదగిన గ్యారంటీలనే ఇచ్చాం : రాహుల్‌ గాంధీ

'కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల చేసేందుకు వచ్చాను. కొన్ని నెలల క్రితం తుక్కుగూడలోనే గ్యారంటీ కార్డు విడుదల చేశాను. జాతీయ స్థాయి మేనిఫెస్టోను విడుదల చేసేందుకు వచ్చాను. అమలు చేయదగిన గ్యారంటీలనే ఇచ్చాం. రూ.500 సిలిండర్‌, గృహజ్యోతి గ్యారంటీలు ఇచ్చాం. మహిళలకు ఉచిత బస్సు, గృహలక్ష్మి గ్యారంటీలు ఇచ్చాం. కాంగ్రెస్‌ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నాం. గ్యారంటీలను అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇప్పటికే 25 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేశాం.'

07.24 PM

న్యాయ పత్రం పేరిట కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల

జనజాతర వేదికపై రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ జాతీయ మేనిఫెస్టోను విడుదల చేశారు. న్యాయ పత్రం పేరిట కాంగ్రెస్‌ జాతీయ స్థాయి మేనిఫెస్టో విడుదల చేశారు. కాంగ్రెస్‌ గ్యారంటీ కార్డులు రాహుల్‌ విడుదల చేశారు.

07.19 PM

ప్రజలకు అభయమిస్తూ రాహుల్‌ గాంధీ పాదయాత్ర చేశారు : మంత్రి శ్రీధర్‌ బాబు

ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు రాహుల్‌ పాదయాత్ర చేశారని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు రాహుల్‌ పాదయాత్ర సాగిందన్నారు. ప్రజలకు అభయమిస్తూ రాహుల్‌ గాంధీ పాదయాత్ర చేశారన్నారు.

07.13 PM

జనజాతర సభకు చేరుకున్న రాహుల్‌ గాంధీ

హైదరాబాద్‌లోని తుక్కుగూడలో 'కాంగ్రెస్‌ జనజాతర' సభ జరుగుతుంది. జనజాతర ప్రాంగణానికి చేరుకున్న రాహుల్‌గాంధీ. జనజాతర ప్రాంగణానికి చేరుకున్న రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. జనజాతర వేదికపై నుంచి ప్రజలకు రాహుల్‌గాంధీ అభివాదం చేస్తున్నారు.

07.10PM

దేశ సమగ్రత కోసం ఇందిరా, రాజీవ్‌ గాంధీ ప్రాణాలు అర్పించారు : జూపల్లి

దేశ సమగ్రత కోసం ఇందిరా, రాజీవ్‌ గాంధీ ప్రాణాలు అర్పించారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 2004లోనే సోనియాగాంధీకి ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందని గుర్తు చేశారు. సోనియాగాంధీ మన్మోహన్‌ సింగ్‌ను ప్రధానిగా చేశారన్నారు. టెపిఫోన్‌ ట్యాపింగ్‌ ఎందుకు చేశారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో అవినీతి, బంధుప్రీతి ఉండేది. బీఆర్‌ఎస్‌ హయాంలో కేసీఆర్‌ మంత్రులను కూడా కలిసేవారు కాదన్నారు.

06.57 PM

కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చ పెడితే కేసీఆర్‌ రాలేదు: మంత్రి పొన్నం

నియంతృత్వ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ గెలవాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చ పెడితే కేసీఆర్‌ రాలేదని విమర్శించారు.

06.54 PM

బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి కాంగ్రెస్‌ను అంతం చేయాలని చూస్తున్నాయి : మంత్రి సీతక్క

బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి కాంగ్రెస్‌ను అంతం చేయాలని చూశారు. రాహుల్‌గాంధీ దేశం మొత్తం తిరుగుతూ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నారు. బీజేపీ నేతలను ప్రశ్నిస్తే ఈతడీ కేసులు పెడుతున్నారని మంత్రి సీతక్క అన్నారు. మోదీని ఉద్యోగాలు గురించి అడిగితే అయోధ్యను చూపిస్తున్నారు.

06.40 PM

శంషాబాద్‌ చేరుకున్న రాహుల్‌గాంధీ

శంషాబాద్‌ విమానాశ్రయమానికి రాహుల్‌గాంధీ చేరుకున్నారు. రాహుల్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి, దీపాదాస్‌ మున్షీ ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి జనజాతర సభకు రాహుల్‌ గాంధీ బయలుదేరారు. రాహుల్‌ గాంధీ వెంట సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు.

Last Updated : Apr 6, 2024, 8:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.