ETV Bharat / state

రూ.500కే గ్యాస్​ సిలిండర్ - లబ్ధిదారుల ఖాతాలోకి రాయితీ నగదు బదిలీనే - Officers on 500 Gas Cylinder Scheme

Congress Govt Gas Cylinder Scheme : తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ హామీ అమలుపై రాష్ట్ర సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గ్యాస్‌ రాయితీ విషయంపై పౌరసరఫరాల శాఖ సమీక్ష నిర్వహించింది. వినియోగదారుడు సిలిండర్‌ మొత్తం ధర చెల్లించాలని, ఆ తర్వాత వారి ఖాతాలోకి సబ్సిడీని బదిలీ చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2024, 7:31 AM IST

Congress Govt Gas Cylinder Scheme : రాష్ట్రంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా గ్యాస్‌ రాయితీ లబ్ధిదారులకు నగదు బదిలీ విధానాన్నే అమలు చేయాలని పౌరసరఫరాల శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ విధానం ప్రకారం లబ్ధిదారులు గ్యాస్‌ సిలిండర్‌ తీసుకునేటప్పుడు మొత్తం ధర చెల్లించాలి. ప్రస్తుతం సిలిండర్‌ ధర రూ.955గా ఉంది. మహాలక్ష్మి పథకంలో అర్హులకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని ప్రకటించిన తెలంగాణ సర్కార్ మిగతా మొత్తాన్ని సబ్సిడీ రూపంలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో బదిలీ చేయాలని నిర్ణయించింది. తాజా నిర్ణయానికి సంబంధించిన విధివిధానాల్ని పౌరసరఫరాల శాఖ రూపొందించింది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

రూ.500కే గ్యాస్​ సిలిండర్ - మూడేళ్ల సగటు లెక్క ప్రకారమే కసరత్తు!

వాడకంలో ఉన్న సిలిండర్లకే రాయితీ

  • నూతనంగా తీసుకునే గ్యాస్‌ కనెక్షన్లకు రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ పథకం వర్తించదు. పాత కనెక్షన్లలో ఆహారభద్రత కార్డులున్నవారికీ అది కూడా వాడకంలో ఉన్న సిలిండర్లకే తెలంగాణ ప్రభుత్వ గ్యాస్‌ సబ్సిడీ వర్తిస్తుంది.
  • గృహ వినియోగదారుడు గడిచిన మూడు సంవత్సరాల్లో వాడిన సిలిండర్ల సగటు ఆధారంగా రాయితీ సిలిండర్ల సంఖ్య ఖరారు చేస్తారు.
  • ప్రస్తుతానికి దాదాపు 40 లక్షల మహిళా లబ్ధిదారుల గుర్తించారు. ఈ సంఖ్యతో పథకం ప్రారంభం కానుంది.
  • తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులకు అందించే రాయితీ చెల్లింపులకు ఎన్‌పీసీఐ(నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) ప్లాట్‌ఫాంగా పనిచేస్తుంది. ఎస్‌బీఐ నోడల్‌ బ్యాంకుగా వ్యవహరిస్తుంది. రాష్ట్ర సర్కార్ ఇచ్చే అప్రూవ్ అమౌంట్‌ బ్యాంకులో ఉంటుంది. అనంతరం రాయితీ సిలిండర్లు సరఫరా చేశాక నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా నోడల్‌ బ్యాంకులో ఉన్న సొమ్ము నుంచి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నిర్ణీత సబ్సిడీని బదిలీ చేస్తుంది.

సాంకేతిక ఇబ్బందుల కారణంగానే! : గ్యాస్‌ ఏజెన్సీల ప్రతినిధులతో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సమావేశం నిర్వహించారు. రూ.500కే వినియోగదారులకు (500 Rupees Gas Cylinder Scheme )సిలిండర్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సూత్రప్రాయంగా ఏజెన్సీల ప్రతినిధులు అంగీకారం తెలిపారు. అయితే ఆయిల్‌ కంపెనీల నిబంధనలు కూడా అనుమతించాల్సి ఉంటుందని వారు స్పష్టం చేశారు.

Officers on 500 Rupees Gas Cylinder Scheme : ఈ ప్రక్రియలో ఆర్థికపరమైన అంశాలు ఉండటం దాదాపు 800 మంది గ్యాస్‌ డీలర్లు, వారి పరిధిలో వేలాది మంది డెలివరీ బాయ్స్‌ ఉండటం వంటి అంశాలపై పౌరసరఫరాల శాఖ శుక్రవారం సమీక్ష నిర్వహించింది. గ్యాస్‌ ఏజెన్సీలు, డెలివరీ బాయ్స్‌లో కొందరు అవకతవకలకు పాల్పడే అవకాశాలు ఉండటం వంటి అంశాలు ఇందులో చర్చకు వచ్చాయి. గ్యాస్‌ డీలర్లకు ఆయిల్‌ కంపెనీల వారికి కేంద్ర పెట్రోలియం శాఖ అనుమతులు వంటి సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకున్న పౌరసరఫరాల శాఖ (Civil Supplies Department) తన నిర్ణయాన్ని తాజాగా మార్చుకుంది.

గ్యాస్​ సిలిండర్​ ఎక్స్​పైరీ డేట్ ఎలా చెక్ చేయాలో తెలుసా?

How to Book Gas Cylinder Using Gpay : గూగుల్ పే ఉపయోగించి గ్యాస్ సిలిండర్​ బుక్​ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.