ETV Bharat / state

తెలంగాణలో కొత్త బ్రాండ్లు ఉన్నట్టా? లేనట్టా? - మద్యం కొత్త బ్రాండ్ల విషయంలో గందరగోళం - New Liquor Brands in Telangana - NEW LIQUOR BRANDS IN TELANGANA

New Liquor Brands in Telangana : తెలంగాణ రాష్ట్రంలో మద్యం కొత్త బ్రాండ్ల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక్క బ్రాండ్‌కు కూడా అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. కానీ ఆ శాఖ కమిషనర్‌ శ్రీధర్‌ మాత్రం గడిచిన ఐదునెలల్లో నాలుగు బ్రాండ్లకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు.

Minister Jupally On New Liquor Brands
New Liquor Brands in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 1, 2024, 2:02 PM IST

New Liquor Brands in Telangana : రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీ ఎత్తున పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో 30లక్షల59 వేల కేసులు లిక్కర్‌ అమ్ముడుపోగా 50లక్షల14 వేల కేసులు బీరు విక్రయాలు జరిగాయి. అంటే రోజుకు దాదాపు రెండు లక్షల కేసులు బీరు అమ్ముడు పోతోంది. రాష్ట్రంలో ఆరు బ్రూవరీలు ఉండగా వాటి ద్వారా రోజుకు రెండు లక్షల కేసులు బీరు ఉత్పత్తి అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ మెట్రో పాలిటిన్ నగరమైనందున వివిధ రాష్ట్రాలు, దేశాలు నుంచి వ్యాపార వాణిజ్య, పర్యాటక తదితర అవసరాలకు రాకపోకలు సాగించేవారి సంఖ్య క్రమంగాపెరుగుతోంది. దీంతో సాధారణంగా రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో బీరు వినియోగం ఎక్కువ అవుతోంది.

కొత్త బ్రాండ్లకు అనుమతులు : బేవరీలు డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా చేయలేకపోతున్నాయి. ఇందులో నాలుగు పాపులర్‌ బ్రాండ్లు తయారు చేసే బ్రూవరీలకు మూడు షిఫ్టులల్లో పని చేసేందుకు ఆబ్కారీ శాఖ అవకాశం కల్పించింది. వాటి ద్వారా రోజుకు దాదాపు 5 లక్షల కేసులు ఉత్పత్తి చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కానీ ఆ బ్రూవరీలు కేవలం రెండున్నర లక్షల కేసులు బీరు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో బీరు కొరత ఏర్పడింది.

ఈ నేపథ్యంలో బీరు సరఫరా చేసేందుకు బయట రాష్ట్రాల నుంచి ఆసక్తి చూపుతున్న నాలుగు కొత్త బ్రాండ్లకు తెలంగాణ బెవరేజెస్‌ కార్పోరేషన్‌ అనుమతి ఇచ్చింది. ఆయా బ్రూవరీలు బెవరేజెస్‌ కార్పోరేషన్‌తో ధర విషయంలో ఒప్పందం చేసుకుంటున్నాయి. ఆ మేరకు నిర్దేశించిన ధరకే ఆయా బ్రూవరీలు రాష్ట్రానికి బీర్లు సరఫరా చేయాల్సి ఉంటుంది.

ఎక్సైజ్‌ శాఖ ప్రక్షాళనపై సర్కార్‌ కార్యచరణ - రాబడికి గండి కొడుతున్నవారిపై ఉక్కుపాదం - TS EXCISE DEPARTMENT REVENUE

Minister Jupally On New Liquor Brands : ఎక్సైజ్‌ శాఖలో జరిగే ప్రతి డెవలప్‌మెంట్‌ ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంది. కాని మంత్రికి అన్ని విషయాలు తెలియ చేయడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఇందువల్లనే ఇటీవల మీడియాతో మాట్లాడిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక్క బ్రాండ్‌కు అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు. అప్పటికే బెవరేజెస్‌ కార్పోరేషన్‌ నాలుగు కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చింది. ఈ విషయం మంత్రి జూపల్లి దృష్టికి వెళ్లలేదు.

ఆయన మీడియాతో మాట్లాడే ముందు అధికారుల నుంచి పూర్తి సమాచారం తెలుసుకోవాల్సి ఉంది. కాని అది జరగలేదు. ఆ తరువాత ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ శ్రీధర్‌ విడుదల చేసిన ప్రకటనలో ఇప్పటి వరకు 360 బీరు బ్రాండ్లకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. బ్రాండ్లకు అనుమతి ఇచ్చినంత మాత్రాన ఉత్పత్తి చేస్తారన్న నమ్మకం ఉండదని వారి నుంచి దిగుమతి వచ్చేవరకు వేచి చూడాల్సి ఉంటుందని వివరించారు. మంత్రి, కమిషనర్‌ల మాటల్లో ఏది నిజమో తెలియడం లేదు. ఇప్పటికైనా వాస్తవాలను ప్రజల ముందు పెట్టాల్సి ఉంది.

అలర్ట్ : మద్యం ప్రియులపై మరో బాంబు - మళ్లీ వైన్స్ బంద్! - Wine Shops Closes in Telangana

అక్రమ మద్యం సరఫరాపై ఆబ్కారీ శాఖ ఫోకస్​ - ఇప్పటివరకు 13వేలకు పైగా కేసులు నమోదు - ILLEGAL LIQUOR SUPPLY IN TELANGANA

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.