ETV Bharat / state

కుమురం భీం ప్రాజెక్టుపై ఈటీవీ భారత్​ కథనం - స్పందించిన కలెక్టర్ - Collector reacts To ETVBharat Story - COLLECTOR REACTS TO ETVBHARAT STORY

Komaram Bheem Project Problems : కుమురం భీం ప్రాజెక్టు ఆనకట్టపై 'క్షణ క్షణం భయం భయం - డేంజర్ జోన్​లో కుమురం భీం ప్రాజెక్టు - మరో ముప్పు తప్పదా?' అంటూ ఈటీవీ భారత్​లో వచ్చిన కథనంపై జిల్లా కలెక్టర్​ వెంకటేశ్​ దోత్రే, అదనపు కలెక్టర్​ దీపక్​ తివారీ స్పందించారు. ఇద్దరు అధికారులు వెళ్లి ప్రాజెక్టును సందర్శించారు.

Collector Responds on Komaram Bheem Project Problem
Komaram Bheem Project Problems (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 22, 2024, 5:39 PM IST

Updated : Jul 22, 2024, 6:42 PM IST

Collector Responds on Komaram Bheem Project Problem : కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా కుమురం భీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. అయితే ఇప్పటికే ప్రాజెక్టు ఆనకట్ట సమస్య ఉండటంతో డ్యామ్ అథారిటీ అధికారుల ఆదేశాల మేరకు ప్లాస్టిక్​ టార్పాలిన్​ కప్పి కట్టను ఆపే ప్రయత్నం చేశారు. కాగా ఆనకట్ట కుంగిపోయి రెండేళ్లు గడిచినా, మరమ్మతులు చేయక టార్పాలిన్‌తో కాలం వెళ్లదీస్తున్నారు. జనరేటర్లతో నిర్వహణను నెట్టుకొస్తున్న అధికారులు, వరద పోటెత్తితే ఎలా బయటపడాలనే విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. దీనిపై ఈటీవీ-ఈటీవీ భారత్‌లో వచ్చిన కథనంపై కలెక్టర్ వెంకటేశ్​ దోత్రే స్పందించారు. వెంటనే అదనపు కలెక్టర్​తో కలిసి ప్రాజెక్టును సందర్శించారు.

ప్రాజెక్టు నిర్మాణంపై ఆరా : అనంతరం ప్రాజెక్టు అధికారులను పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. టార్పాలిన్​ కప్పినా జలాశయం ఆనకట్టకు సమస్య వస్తుందా అని అడిగారు. కవర్​ ఎవరు కప్పమన్నారని అక్కడున్న వారిని అడగ్గా, డ్యామ్ అథారిటీ అధికారులు వచ్చి సందర్శించి చెప్పటం వల్లే కప్పామని కలెక్టర్​కు తెలిపారు. ఆనకట్టను బాగు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందని ప్రశ్నించగా, సుమారు రూ.5 కోట్ల నుంచి రూ.8.5 కోట్ల మేర ఖర్చు అవుతుందని కలెక్టర్​కు వివరించారు.

క్షణక్షణం భయంభయం - డేంజర్ జోన్​లో కుమురంభీం ప్రాజెక్టు - మరో ముప్పు తప్పదా? - Komaram Bheem Project Problems

ఆయకట్టు మొత్తం నీరు అందేవిధంగా పనులు : సెప్టెంబర్​ లేదా అక్టోబర్​లో ఆనకట్ట నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రెండు నెలల్లో పనులు పూర్తి చేసి పూర్తిస్థాయి మట్టం వరకు వరద నీటిని ఉండేలా చూడాలని అధికారులకు తెలిపారు. మున్ముందు ప్రాజెక్టు ద్వారా రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్మాణ పనులు చేయాలని సూచించారు. 45 వేల 500 ఎకరాల ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో నీటిని అందించి పంటలు పండే విధంగా ఉండాలని అన్నారు.

కుమురం భీం ప్రాజెక్టు ప్రమాద ఘంటికలు : కుమురం భీం ప్రాజెక్టు ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీలు ఉంటే, ఆనకట్ట మరమ్మతుల దృష్ట్యా 5 టీఎంసీలనే కొనసాగిస్తున్నారు. భారీగా వస్తున్న వరదను కిందకు వదులుతున్నారు. ఏడాది క్రితం బిల్లులు చెల్లించకపోవడంతో ప్రాజెక్టుకు త్రీ ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. అప్పటి నుంచి జనరేటర్ల సహాయంతో నిర్వహణను కొనసాగిస్తున్నారు. భారీగా వరద వచ్చిన సమయంలో జనరేటర్ మొరాయిస్తే ఆనకట్టకే ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. అస్తవ్యస్తంగా మారిన కుమురం భీం ప్రాజెక్టు నిర్వహణతో పరివాహక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి - 25 గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి నీటి విడుదల - Heavy Floods to Taliperu Project

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు - నిండుకుండలా మారిన ప్రాజెక్టులు - Telangana Dams With Full Water

Last Updated : Jul 22, 2024, 6:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.