ETV Bharat / state

లెక్క మారింది - 'తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో 100 ఎకరాలు కొనొచ్చు' - Land Prices Increased In Telangana

author img

By ETV Bharat Telangana Team

Published : 11 hours ago

CM Revanth On Telangana Land Price : ఒప్పటికి ఇప్పటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ రియల్​ ఎస్టేట్​కు చాలా వ్యత్యాసం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఒకప్పుడు కృష్ణా, గుంటూరులలో ఒక ఎకరం భూమి అమ్మితే తెలంగాణలో పదెకరాల భూమి కొనుక్కునే పరిస్థితి ఉండేదని, అదే ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం భూమి అమ్మితే ఏపీలో 100 ఎకరాలు కొనొచ్చు అని తెలిపారు.

CM Revanth Reddy Launched MSME Policy 2024
CM Revanth Reddy Launched MSME Policy 2024 (ETV Bharat)

CM Revanth Reddy Launched MSME Policy 2024 : ఒకప్పుడు కృష్ణా, గుంటూరులలో ఎకరం భూమి అమ్మితే తెలంగాణలో పదెకరాల భూమి కొనుక్కునే పరిస్థితి ఉండేదని, అదే ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం భూమి అమ్మితే అదే జిల్లాల్లో 100 ఎకరాలు కొనొచ్చు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్​లోని శిల్పారామంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో పరిశ్రమల శాఖ రూపొందించిన ఎంఎస్​ఎంఈ పాలసీ-2024ను సీఎం రేవంత్ ఆవిష్కరించారు.

పాలసీ పనితీరును పర్యవేక్షించడం, వేగవంతం చేయడంలో భాగంగా ప్రపంచ బ్యాంక్ సహకారంతో రాష్ట్రంలో రూ.117 కోట్లతో రైజింగ్​ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్​ఎంఈ పెర్ఫార్మెన్స్​ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన నేడు తెలంగాణలో భూముల విలువ గణనీయంగా పెరగాడనికి ప్రధాన కారణం యువత సిలికాన్​ వ్యాలీని శాసించే స్థానికి సాంకేతిక నైపుణ్యంలో ఎదగడమే అని అన్నారు. ఆ సంపాదనతో భూములపై పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు.

ఇల్లు కొనడానికి ఇదే సరైన సమయం! - ఎందుకో తెలుసా? - Real Estate Market in Hyderabad

ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత భూమి రేట్లు అధికంగా పెరిగాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్​లో విపరీతంగా పెరిగిపోయాయి. కారణం అభివృద్ధి, రాష్ట్రానికి పెట్టుబడుదారులు ఎక్కువ ఉండటమే. అదే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందినవారు పని కోసం తెలంగాణకు వస్తుంటారు. పెరుగుతున్న జనాభా కూడా కారణమే అంటున్నారు నిపుణులు.

హైదరాబాద్​లో రియల్ ఎస్టేట్ - ఆ ప్రాంతాల్లో ఇంటి స్థలాలు కొంటే భవిష్యత్తు బంగారమేనట! - Real Estate Business in Hyderabad

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.