ETV Bharat / state

నేడు మహబూబ్​నగర్​కు సీఎం రేవంత్ - సాగునీటి ప్రాజెక్టులు, పర్యాటకం సహా కీలకమైన అంశాలపై సమీక్ష - CM Revanth Reddy Mahabubnagar Tour

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 9, 2024, 7:11 AM IST

CM Revanth Reddy Mahabubnagar Tour Today : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు ఉమ్మడి పాలమూరులో పర్యటించనున్నారు. అధికారిక పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి హోదాలో ఎన్నికల తర్వాత తొలిసారిగా మహబూబ్‌నగర్‌కు రానున్నారు. ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారు.

CM Revanth Reddy Palamuru Tour
CM Revanth Reddy Mahabubnagar Tour (ETV Bharat)

CM Revanth Reddy Mahabubnagar Tour : అధికారిక పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు మహబూబ్​నగర్ జిల్లాకు రానున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పాలమూరు కలెక్టరేట్‌కు చేరుకోనున్న ఆయన తొలుత ఉమ్మడి జిల్లా ప్రముఖులతో సమావేశమవుతారు. అనంతరం మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం సహా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత కలెక్టరేట్​లో పూర్వ మహబూబ్​నగర్ జిల్లాకు చెందిన కలెక్టర్లు, ఉన్నతాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం భూత్పూర్‌ రోడ్డులోని ప్రైవేట్‌ ఫంక్షన్​హాల్​లో ఉమ్మడి జిల్లా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు.

ప్రజాప్రతినిధులతో సమీక్ష : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లావాసి కావడంతో సమీక్ష తర్వాత జిల్లా సమగ్రాభివృద్ధికి ఏ నిర్ణయాలు తీసుకుంటారోనని జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి సహా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, విద్య, వైద్యం, పర్యాటకం, మహిళా సాధికారత సహా ఇతర అంశాలు ప్రధాన ఎజెండాగా సమీక్ష జరపనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావాల్సిన అంశాలపై జిల్లా ఇంచార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహా జిల్లా అధికారులతో సమీక్షించారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు కావాల్సిన పనులపై అధికారులకు నివేదిక సమర్పించారు.

'అభివృద్ధే వైఎస్సార్ ఆశయం - రాహుల్​ను పీఎం చేయాలన్నదే ఆయన లక్ష్యం' - CM REVANTH REDDY ABOUT YSR

కీలకమైన అంశాలపై చర్చ : సాగునీటి రంగం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్య, వైద్యం, మహిళా సాధికారత, పర్యాటకం సహా ఇతర అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. ఉమ్మడి జిల్లాకు జేఎన్టీయూ కళాశాలలు, పాలమూరు విశ్వవిద్యాలయం అభివృద్ధి, సర్కారీ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన.. జిల్లా కేంద్రంలో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తి, పరిశ్రమల ఏర్పాటు, నల్లమల ఎకో టూరిజం, పర్యాటక హబ్‌గా పాలమూరును అభివృద్ధి చేసేందుకు అనుసరించాల్సిన ప్రణాళికలపై సీఎం సమీక్షిస్తారు.

ఓ ప్రైపేట్‌ పంక్షన్​హాల్‌లో జరిగే సమావేశంలో పలువురు నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అభివృద్ధి పనుల పేరిట సోమవారం ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఆయనతో పాటు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపిస్తోంది.

"గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని కోరుకుంటాం. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇక్కడ పెట్టాలని సీఎంని కోరుతాం. మహబూబ్​నగర్ జిల్లా అభివృద్ది పనులకు నిధుల కేటాయింపు గురించి సీఎం చర్చిస్తారు. పర్యాటక హబ్‌గా పాలమూరును అభివృద్ధి చేసేందుకు సీఎం సమీక్ష ఉంటుంది." -యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, శాసనసభ్యుడు

రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయండి : సీఎం రేవంత్​ రెడ్డి - Skill University in Telangana

ఆ 6 సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్​ స్పెషల్​ ఫోకస్ - 2025 మార్చి నాటికి పూర్తయ్యేలా ఆదేశాలు జారీ - CM Revanth on Irrigation Projects

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.