CM Revanth Reddy Comments on NDA Govt : తెలంగాణ అడిగింది పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కానీ బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయంపై ఎక్స్(ట్విటర్) వేదికగా సీఎం రేవంత్ స్పందించారు. ఈ సందర్భంగా బీజేపీపై విరుచుకుపడ్డారు. పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం పెద్ద గాడిద గుడ్డు ఇచ్చిందంటూ దుయ్యబట్టారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీనే అడ్డుగోడ వేసిందని సీఎం రేవంత్ విమర్శించారు.
ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు : తెలంగాణకు అడిగింది 'రైల్వే కోచ్ ఫ్యాక్టరీ' అయితే బీజేపీ ఇచ్చింది మాత్రం 'గాడిద గుడ్డు' అంటూ సీఎం రేవంత్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే 'బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ' అడిగితే కమలం పార్టీ ఇచ్చింది 'గాడిద గుడ్డు' అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. మరోవైపు 'కృష్ణా, గోదావరి వాటాల పంపకం' గురించి అడిగితే బీజేపీ ఇచ్చింది మాత్రం 'గాడిద గుడ్డు' అంటూ ధ్వజమెత్తారు. 'మేడారం జాతరకు జాతీయ గుర్తింపు' ఇవ్వమంటే వారిచ్చింది 'గాడిద గుడ్డు' అంటూ భారతీయ జనతా పార్టీపై విరుచుకుపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీనే అడ్డుగోడగా నిలిచిందని అన్నారు. పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 'పెద్ద గాడిద గుడ్డు' ఇచ్చిందంటూ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
"తెలంగాణ అడిగింది పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు. మళ్లీ తెలంగాణ అడిగింది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు. తెలంగాణ అడిగింది బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ అడిగితే బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు. తెలంగాణ అడిగింది కృష్ణా, గోదావరిలో వాటాల పంపకం బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు. తెలంగాణ అడిగింది మేడారం జాతరకు జాతీయ హోదా బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీనే అడ్డు. పదేండ్ల మోదీ పాలనలో తెలంగాణకు ఇచ్చింది పెద్ద గాడిద గుడ్డు." - సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్