ETV Bharat / state

గుజరాత్‌ ఆధిపత్యానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య పోరాటం : రేవంత్​రెడ్డి - lok sabha elections 2024 - LOK SABHA ELECTIONS 2024

CM Revanth fires on BJP : తెలంగాణకు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చలేదని, పదేళ్లలో తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చిందని సీఎం రేవంత్​రెడ్డి దుయ్యబట్టారు. జరగబోయే లోక్​సభ ఎన్నికలు గుజరాత్ ఆధిపత్యానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరిగే పోరాటమని అభివర్ణించారు.

Lok Sabha Elections 2024
CM Revanth fires on BJP
author img

By ETV Bharat Telangana Team

Published : May 1, 2024, 10:10 PM IST

Lok Sabha Elections 2024 : కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ ఆలోచిస్తోందని, సీఎం రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికలు గుజరాత్‌ ఆధిపత్యానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి జరిగే పోరాటంగా అభివర్ణించారు. లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కూకట్​పల్లి, శేరిలింగంపల్లిలో నిర్వహించిన కార్నర్​ మీటింగ్​లో ముఖ్యమంత్రి రేవంత్​ పాల్గొన్నారు.

అబద్ధాల యూనివర్సిటీకి వైస్‌ ఛాన్సలర్‌ మోదీ, రిజిస్ట్రార్‌ అమిత్‌ షా : సీఎం రేవంత్​ - Revanth Sensational comments on bjp

ఈసందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు గుప్పించారు. దేశంలో ఇవాళ పేదలు ఉద్యోగాలు, రాజకీయాల్లో ఉన్నారంటే కాంగ్రెస్‌ కల్పించిన రిజర్వేషన్లే కారణమని సీఎం రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. తాను రిజర్వేషన్లపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, పదేళ్లపాటు కేసీఆర్‌ పెట్టిన కేసులకు కాంగ్రెస్‌ వాళ్లం భయపడ్డామా?, ఇప్పుడు మోదీ పెట్టిన కేసులకు భయపడతామా? అని సీఎం రేవంత్​ పేర్కొన్నారు.

రేవంత్‌రెడ్డి ఉంటే గెలుపు సాధ్యం కాదని కేసీఆర్‌, మోదీ భావించినట్లున్నారని, తనపై కేసులు పెట్టి ప్రచారం చేయకుండా కుట్ర పన్నుతున్నారని సీఎం రేవంత్​ ఆరోపించారు. మూసీ పునర్నిర్మాణానికి నిధులు ఇవ్వాలని అడిగినా ఇవ్వలేదని సీఎం రేవంత్​ పేర్కొన్నారు. నిన్న మోదీ రాష్ట్రానికి వచ్చారని, మెట్రో రైలుకు నిధులు ఇస్తారని అనుకున్నామని తెలిపారు. నగరంలో రూ.లక్ష కోట్లు ఖర్చు అయినా సరే, మూసీని ఆధునీకరణ చేపడతామని సీఎం రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు.

యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇచ్చిందని, హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ మంజూరు చేసిందని సీఎం రేవంత్​ గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఉక్కుపరిశ్రమ, ఐటీఐఆర్‌ను మోదీ రద్దు చేశారని మండిపడ్డారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటకకు మోదీ సర్కారు ఇచ్చిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏపీ, కర్ణాటకకు మట్టి, చెంబు తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు గాడిదగుడ్డు మాత్రమే ఇచ్చిన బీజేపీ అవసరమా? అంటూ ప్రశ్నించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ను బంగాళాఖాతంలో కలిపారని సీఎం రేవంత్​ పేర్కొన్నారు. 2018లో కేసీఆర్‌ కుట్ర చేసి నన్ను కొడంగల్‌లో ఓడించారని, కొడంగల్‌లో ఓడినా ప్రజల మద్దతుతో మల్కాజిగిరిలో గెలిచానన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసినందుకు కాంగ్రెస్‌కు 65 సీట్లు ఇచ్చారని, కార్యకర్తల కష్టం వల్లే నేను సీఎంగా ఉన్నానని తెలిపారు. బస్తీల్లో సమస్యలు పరిష్కరించే బాధ్యత తీసుకుంటానన్నారు. మల్కాజిగిరిలో సునీతకు ఓటు వేస్తే, రేవంత్‌కు వేసినట్లేనని స్పష్టం చేశారు.

"రిజర్వేషన్లపై ప్రశ్నిస్తే నాపై కేసులు పెడుతున్నారు. రేవంత్‌రెడ్డి ఉంటే గెలుపు సాధ్యం కాదని కేసీఆర్‌, మోదీ భావించినట్లున్నారు. కేసులు పెట్టి ఎన్నికల ప్రచారానికి దూరం చేయాలని భావిస్తున్నారు". - సీఎం రేవంత్​రెడ్డి

గుజరాత్‌ ఆధిపత్యానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య పోరాటం : రేవంత్​రెడ్డి

'పదేళ్ల మోదీ పాలన'లో తెలంగాణకు కేంద్రం ఇచ్చింది 'పెద్ద గాడిద గుడ్డు' : సీఎం రేవంత్​ ట్వీట్ - CM REVANTH TWEET ON NDA GOVT

ఘనంగా మే డే వేడుకలు - ప్రజాపాలనలో కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందన్న సీఎం రేవంత్‌ - MAY DAY CELEBRATIONS in ts 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.