ETV Bharat / state

రూ.2 లక్షల రుణమాఫీపై సీఎం రేవంత్‌ సమీక్ష - ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం - CM Revanth on Crop Loan Waiver

CM Revanth Orders to Officials Over Crop Loan Waiver : రూ.2 లక్షల రైతు రుణమాఫీపై విధివిధానాలు రూపొందించాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరాల్సిందేని స్పష్టం చేశారు. పూర్తి వివారాలు సేకరించి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. పంట రుణమాఫీ, ఇతర అంశాలపై వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.

CM Revanth Reviewed Crop Loan Waiver with Officials
CM Revanth Reddy reviewed the crop loan waiver with the officials (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 10, 2024, 8:56 PM IST

Updated : Jun 10, 2024, 10:17 PM IST

CM Revanth Reviewed Crop Loan Waiver with Officials : గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కుపెట్టిన ప్రధాన ప్రచార అస్త్రం పంట రుణమాఫీ. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ అన్నా, నేటికీ అది అమలు కాలేదు. శాసన సభ ఎన్నికలకే పరిమితమనుకున్న పంట రుణమాఫీ మాట, కాస్త సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే పాశుపతాస్త్రంగా మారింది. కాగా ఆగస్టు 15 లోపల సంపూర్ణ రుణమాఫీ అని చెప్పిన సీఎం రేవంత్​ రెడ్డి, ఎట్టకేలకు ఆ దిశగా పంట రుణమాఫీ, ఇతర అంశాలపై అధికారులతో ఇవాళ సమీక్ష జరిపారు.

ఈక్రమంలోనే రూ.2 లక్షల రుణమాఫీకి విధివిధానాలు రూపొందించాలని సీఎం అధికారులకు ఆదేశించారు. ఆగస్టు 15వ తేదీ లోపు రుణమాఫీ చేసి తీరాల్సిందేని ఆయన స్పష్టం చేశారు. పూర్తి వివారలు సేకరించి ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులకు సూచించారు. పంట రుణమాఫీ, ఇతర అంశాలపై వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖా అధికారులు పాల్గొన్నారు.

రూ.2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితా సిద్ధం చేయాలి : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రూ.2లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలని సూచించారు. కటాఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు.

కేవలం బ్యాంకుల నుంచే కాకుండా, పీఏసీఎస్ నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసేందుకు పూర్తి స్థాయి వివరాలతో పాటు అవసరమైన అంచనా వ్యయాన్నిరూపొందించాలని సూచించారు. రుణమాఫీకి సంబంధించి విధివిధానాలను రూపొందించి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15లోగా పంట రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి అధికారులకు తేల్చి చెప్పారు.

రాష్ట్రంలో కులగణనపై నిపుణులతో బీసీ కమిషన్​ భేటీ - పలు అధ్యయనాలపై చర్చ

రైతులకు గుడ్​ న్యూస్​ - త్వరలో కొత్త వ్యవసాయ పంట బీమా పథకం అమలు - Crop Insurance in Telangana

Last Updated : Jun 10, 2024, 10:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.