CM Revanth Reddy Review on Pending Irrigation Projects : పెండింగులో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతల వారీగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అధ్యయానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పటిష్ఠత, కుంగిపోయిన పిల్లర్లపై అధ్యయనం చేయించాలని అధికారులను ఆదేశించారు.
కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌లో రూ.లక్షతో పాటు తులం బంగారం
CM Revanth on Kaleshwaram Project : కేంద్ర జల సంఘం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఇరిగేషన్ ఇంజినీర్లతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రెండు మూడు రోజుల్లో నిపుణులతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. సాంకేతికంగా అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే మరమ్మతులు, పునరుద్ధరణ చర్యలపై నిర్ణయం తీసుకోనున్నట్లు, కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్లకు రూ.10కోట్ల వరకు ఖర్చయినా ఆలోచించవద్దని తెలిపారు.
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనులకు మొదటి ప్రాధాన్యమిచ్చి గ్రీన్ చానెల్ ద్వారా వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తయితే సుమారు నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించవచ్చునని తెలిపారు. నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు అలర్ట్ - రేషన్‌కార్డు కేవైసీ అప్డేట్కు గడువు సమీపిస్తోంది
కల్వకుర్తి ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ఎందుకు ముందుకు సాగడం లేదని సీఎం ప్రశ్నించారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. అధికారులు సమర్పించిన ప్రాజెక్టుల వారీగా ఆయకట్టు వివరాలు గందరగోళంగా ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. గ్రామాలు, మండలాల వారీగా ఆయకట్టు వివరాలు సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సమీక్షకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, అధికారులు హాజరయ్యారు.
కృష్ఱా జలాల్లో వాటాలు, ప్రాజెక్టులపై త్వరలో అఖిలపక్ష సమావేశం కానున్నట్లు సీఎం రేవంత్ పేర్కొన్నారు. కృష్ణ జలాలపై పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేదని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంటే ఏం చేస్తున్నారని ఇరిగేషన్ అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజామాబాద్ లోక్‌సభ బరి నుంచి ఎమ్మెల్సీ కవిత ఔట్ - మరి ఎక్కడి నుంచి పోటీ అంటే?