ETV Bharat / state

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఉండాలి : సీఎం రేవంత్​ రెడ్డి

CM Revanth Reddy Review on Medical and Health Department : రాష్ట్రంలో వైద్య కళాశాల ఉన్న ప్రతిచోట నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అధికారులను ఆదేశించారు. బీబీనగర్ ఎయిమ్స్‌లో పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. బోధనాసుపత్రుల్లో హౌజ్ కీపింగ్ నిర్వహణ బాధ్యత ఫార్మా కంపెనీలకు అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు.

CM Review on Medical and Health Department
CM Revanth Reddy Review on Medical and Health Department
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2024, 2:09 PM IST

Updated : Jan 29, 2024, 7:35 PM IST

CM Revanth Reddy Review on Medical and Health Department : వైద్య కళాశాల ఉన్న ప్రతిచోట నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. అందుకోసం ఉమ్మడి విధానాన్ని తీసుకురావాలని అధికారులకు సూచించారు. సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొడంగల్​లో మెడికల్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటును పరిశీలించాలని సూచించిన రేవంత్, బీబీనగర్ ఎయిమ్స్‌లో పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా చూడాలని ఆదేశించారు.

ఆర్​ఆర్​ఆర్​ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలి : సీఎం రేవంత్​ రెడ్డి

ఎయిమ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని, తద్వారా ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులపై భారం తగ్గుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఎయిమ్స్‌ను సందర్శించి పూర్తిస్థాయి నివేదిక తయారు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవల కోసం అవసరమైతే తానే స్వయంగా కేంద్రమంత్రిని కలిసి వివరిస్తానని తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రి విస్తరణలో సమస్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మంగళవారం (రేపు) కోర్టులో బెంచ్​పైకి ఉస్మానియా హెరిటేజ్ భవనం వ్యవహారం రానున్న తరుణంలో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఏరియాల వారీగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొన్నింటిని గుర్తించి, వాటికి సీఎంఆర్​ఎఫ్​ ఎల్​వోసీ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.

నేనూ రైతు బిడ్డనే వ్యవసాయం మా సంస్కృతి - దావోస్​లో సీఎం రేవంత్ ప్రసంగం

ఫార్మా కంపెనీలకు హౌస్ కీపింగ్ : వైద్య కళాశాలలకు అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో హౌస్‌ కీపింగ్‌ మెయింటనెన్స్‌ నిర్వహణ బాధ్యతను పెద్ద ఫార్మా కంపెనీలకు అప్పగించాలని రేవంత్​ రెడ్డి సూచించారు. నిర్వహణ ఖర్చు ఆ సంస్థలే భరించేలా చూడాలని తెలిపారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో ఏదో ఒక ఆసుపత్రిలో దీనిని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు తీరు, నిధులకు సంబంధించి వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుసంధానంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్స్, ప్రభుత్వ ఆస్పత్రులకు, పెండింగ్‌లో ఉన్న ఆరోగ్యశ్రీ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ప్రతి నెల 15వ తేదీలోగా బిల్లులు విధిగా విడుదల చేయాలని స్పష్టం చేశారు. ప్రతి 3 నెలలకోసారి విధిగా ప్రైవేటు ఆసుపత్రుల ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల చేయాలని సూచించారు. ఈ సమీక్షలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

బీఆర్​ఎస్​ను 100 మీటర్ల లోతులో పాతిపెడతానన్న సీఎం రేవంత్​ రెడ్డి - వెకిలి మాటలెందుకంటూ మాజీ మంత్రి ఆగ్రహం

'రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఉండాలి. ప్రజలకు డిజిటల్‌ హెల్త్ ప్రొఫైల్ కార్డులు సిద్ధం చేయాలి. హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయాలి. ఆరోగ్యశ్రీకి తెల్లరేషన్ కార్డు నిబంధన సడలింపును పరిశీలించాలి. వరంగల్, ఎల్బీనగర్ టిమ్స్‌ ఆస్పత్రుల నిర్మాణంలో వేగం పెంచాలి. సనత్‌నగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రులు వేగంగా పూర్తి చేయాలి. వైద్యం కోసం అందరూ హైదరాబాద్‌పైనే ఆధారపడే పరిస్థితి ఉండొద్దు. జిల్లాల్లోనూ మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టాలి. వైద్య కాలేజీల్లో ఆరోగ్యశ్రీ కొనసాగేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రతినెలా ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించాలి. ప్రైవేట్ ఆస్పత్రులకు 3 నెలలకోసారి ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వాలి. 108, 102 ద్వారా మరింత మెరుగైన సేవలు అందించాలి' అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

మూడు కస్టర్లుగా తెలంగాణ విభజన : సీఎం రేవంత్​ రెడ్డి

Last Updated : Jan 29, 2024, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.