ETV Bharat / state

జాతీయ రహదారుల విస్తరణ వివరాలు నెలాఖరులోగా సమర్పించండి - కలెక్టర్లకు సీఎం ఆదేశం - CM Revanth Review on Highways - CM REVANTH REVIEW ON HIGHWAYS

CM Revanth Review on NH Expansion : రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి పూర్తి సహకారం అందించే దిశగా రేవంత్​ సర్కార్ అడుగులు వేస్తోంది. మంగళవారం జరిగిన ఎన్‌హెచ్ఏఐ ఉన్నతాధికారుల భేటీలో లేవనెత్తిన వినతులపై, ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్​ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు నేషనల్​ హైవేల స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

CM Inquire on RRR Land Acquisition
CM Revanth Meeting on National Highways (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 10, 2024, 3:26 PM IST

Updated : Jul 10, 2024, 5:54 PM IST

CM Revanth Review on National Highway Projects : రాష్ట్రంలో జాతీయ రహదారులకు పూర్తి వివరాలు, ప్రతిపాదనలను ఈ నెలాఖరులోగా సమర్పించాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నేషనల్​ హైవే పనులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు చేపట్టేందుకు, మంగళవారం జరిగిన ఎన్‌హెచ్ఏఐ ఉన్నతాధికారుల భేటీలో లేవనెత్తిన వినతులపై ఇవాళ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

జాతీయ రహదారుల స్థితిగతులపై సీఎం అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణలో పురోగతిపై ఆరా తీశారు. మంచిర్యాల-వరంగల్-ఖమ్మం-విజయవాడ కారిడార్ భూసేకరణపై ఆరా తీసిన సీఎం, ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, అధికారులు ప్రత్యక్షంగా హాజరవ్వగా, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్నారు.

భూ సేకరణలో మానవీయ కోణంతో వ్యవహరించాలి : కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని వివరాలు సమర్పించారు. ఈ క్రమంలోనే జాతీయ రహదారులకు భూసేకరణ ఎందుకు జాప్యమవుతోందని కలెక్టర్లను రేవంత్​ రెడ్డి ప్రశ్నించగా, రిజిస్ట్రేషన్, మార్కెట్ ధరల మధ్య భారీ వ్యత్యాసం వల్ల రైతులు ముందుకు రావడం లేదని వారు బదులిచ్చారు. భూ సేకరణలో మానవీయ కోణంతో వ్యవహరించాలని సీఎం కోరారు. రైతులకు నిబంధనల ప్రకారం ఎక్కువ పరిహారం దక్కేలా చూడాలని సూచించారు.

భూములను కోల్పోతున్న రైతులను పిలిచి కలెక్టర్లు మాట్లాడాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ, ఉత్తర భాగాలకు ఒకే నంబరు కేటాయింపునకు అధికారులు చర్యలు చేపట్టాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్​హెచ్ఏఐ త్రైపాక్షిక ఒప్పందానికి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి కోరారు. ఆర్మూరు-నాగపూర్ కారిడార్​లో అటవీ భూములు బదులుగా ప్రభుత్వ భూమలు కేటాయించాలని ఆయన సూచించారు.

Minister Komati Reddy on Hyderabad-Vijayawada Highway : హైదరాబాద్ -మన్నెగూడ రహదారి పనులు వీలైనంత త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్-విజయవాడ రహదారి ఆరు వరుసల విస్తరణ పనులు వెంటనే చేపట్టాలన్నారు. కాగా ఈ విస్తరణ పనులు రెండు నెలల్లో ప్రారంభిస్తున్నట్లు ఎన్​హెచ్ఏఐ ప్రాజెక్టు మెంబర్ అనిల్ చౌదరి వెల్లడించారు.

NHAI High officials Met with CM Revanth : మరోవైపు భార‌త జాతీయ ర‌హ‌దారుల ప్రాధికార సంస్థ ఎన్​హెచ్​ఏఐ ఉన్నతాధికారులు, హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో మంగళవారం సమావేశమయ్యారు. జాతీయ రహదారులకు భూ సేక‌ర‌ణ‌ సహా ఇతర ఇబ్బందులను ముఖ్యమంత్రికి వివరించారు. ఆరు రహదారులను ప్రధానంగా ప్రస్తావించారు. అదేవిధంగా ఐదు జాతీయ రహదారుల నిర్మాణానికి ఎన్​హెచ్​ఏఐ సహకారం అవసరమని సీఎం రేవంత్​ విజ్ఞప్తి చేశారు. కాగా ఎన్​హెచ్​ఏఐ వినతుల సమస్యల పరిష్కార దిశగానే ఇవాళ సీఎం సమీక్ష నిర్వహించారు.

జాతీయ రహదారులపై సీఎం రేవంత్​ నజర్​ - పనుల పురోగతిపై ప్రతివారం తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశం - CM Revanth Review on NH Expansion

డీఎస్సీని అడ్డుకోవాలని కొందరు కుట్ర చేస్తున్నారు : సీఎం రేవంత్‌ రెడ్డి - CM REVANTH ON DSC EXAMS

Last Updated : Jul 10, 2024, 5:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.